Movie Makers Released Agent Movie New Poster on the Occasion of Akhil Akkineni’s Birthday - Sakshi
Sakshi News home page

Akhil Akkineni: రూమర్స్‌కి చెక్‌ పెట్టిన అఖిల్‌ అక్కినేని..  కొత్త పోస్ట్‌తో క్లారిటీ

Published Fri, Apr 7 2023 6:19 PM | Last Updated on Fri, Apr 7 2023 6:41 PM

Akhil Akkineni Birthday Special Poster Out And Clarifies Speculations - Sakshi

అఖిల్‌ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్‌. సురేంద్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్లుగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడింది.

ఇటీవలె ఈ సినిమాను ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి హడావిడి లేదు. అయితే రిలీజ్‌ డేట్‌ విషయంలో డైరెక్టర్‌కి, నిర్మాతకి మధ్య విబేధాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఏజెంట్‌ మళ్లీ వాయిదా పడనున్నట్లు టాక్‌ వినిపించింది.

కానీ అవన్నీ అవాస్తవాలే అని మేకర్స్‌ తేల్చేశారు. రేపు(శనివారం)అఖిల్‌ బర్త్‌డే సందర్భంగా ఓ కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో ముందుగా అనౌన్స్‌ చేసినట్లుగా ఏప్రిల్‌ 28నే సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement