బ్యాడ్‌ న్యూస్‌.. అక్కినేని ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన నిర్మాత | Akhil Akkineni Agent Producer Anil Sunkara Says Sorry To Akkineni Fans | Sakshi
Sakshi News home page

Akhil Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన నిర్మాత.. ట్వీట్‌ వైరల్‌

Published Fri, Apr 8 2022 12:20 PM | Last Updated on Fri, Apr 8 2022 3:06 PM

Akhil Akkineni Agent Producer Anil Sunkara Says Sorry To Akkineni Fans - Sakshi

యంగ్‌ హీరో అఖిల్‌ అక్కినేని నటిస్తున్న యాక్షన్‌ మూవీ ఏజెంట్‌. సురేందర్‌ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ షరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌ మూవీపై భారీ హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇక శుక్రవారం(ఏప్రిల్‌8)న అఖిల్‌ బర్త్‌డే .

ఈ సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయవచ్చని అంతా భావించారు. కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ మేకర్స్‌ ఓ పోస్టర్‌తో సరిపెట్టేశారు. 'ఈరోజు టీజర్‌ విడుదల చేయలేకపోతున్నాం. అక్కినేని అభిమానులందరికీ సారీ. మేము మీకు బెస్ట్‌నే అందించాలని అనుకుంటున్నాం. మీ నిరీక్షణకు తగినట్లుగా నాణ్యమైన టీజర్‌ను త్వరలోనే విడుదల చేస్తాం' అంటూ నిర్మాత అనిల్‌ సుంకర ట్వీట్‌ చేశారు. దీంతో బర్త్‌డే టీజర్‌ లేనట్లేనంటూ ఫ్యాన్స్‌ హర్టవుతున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement