surendar reddy
-
రాజకీయాలకు చట్టం బలి..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత సంతకం చేసిన ఫైళ్లలో ఒకటి ల్యాండ్ ‘టైటిల్ గ్యారంటీ చట్టం రద్దు’ ఫైల్. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని భూ సంస్కరణలలో భాగంగా భారత దేశంలో మొట్టమొదటిసారి అమలు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.ఒక్కో గ్రామంలో భూ సమస్య పరిష్కారం కావడానికి తరతరాలు పడుతోంది. దీన్ని నివారించడానికి తెచ్చినదే ‘టైటిల్ గ్యారంటీ చట్టం.’ అప్పుడెప్పుడో శతాబ్దాల క్రితం చేసిన సర్వే తప్ప ఇటీవలి కాలంలో భూసర్వే జరగనే లేదు. అందుకే ఈ కొత్త చట్టం ప్రకారం సమగ్ర భూ సర్వే, డిజిటల్ ల్యాండ్ సర్వే చేసి ఏమైనా సమస్యలు ఉంటే సర్వే సెటిల్మెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అక్కడికక్కడే పరిష్కరించి పట్టా పాస్ బుక్కులు ఇచ్చారు. అయినా ఎన్నికల్లో దీన్ని ఎందుకు ప్రచారాస్త్రం చేశారు?‘సింగిల్ సెటిల్మెంట్తో భూ సమస్య పరిష్కారం అయితే మేమేం కావాలి? మా పూట ఎలా గడవాలి’ అని గ్రామాల్లో పూట గడుపుకునే పెద్ద మనుషుల నుండి రైతులను చెప్పులు అరిగేలా కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్న న్యాయవాదుల వరకు వ్యతిరేకించారు. అందుకే ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా మారింది.తెలంగాణలో గొప్పలకు పోయి తెచ్చిన పట్టాదార్ పాస్ బుక్ చట్టం – 2020, ‘ధరణి’ పోర్టల్ వంటివి పెద్ద అక్రమాలకు తావిచ్చాయి. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో చేసిన టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా ఈ చట్టాన్ని ఉదాహరణగా తీసుకుని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంటే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, గుడ్ గవర్నెన్స్, గుడ్ అడ్మినిస్ట్రేషన్ లాంటి సర్టిఫికేట్లు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ చట్టాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగా ఎందుకు మలిచారు? అధికారం చేపట్టగానే రెండో సంతకం ఈ ఫైల్ మీదే ఎందుకు చేసినట్టు? ఈ సందర్భంగా భూ చట్టాల న్యాయ నిపుణులు ‘మంచి చట్టాన్ని చెత్త రాజకీయాలు చంపేశాయ’ని అంటున్నారు. – బందెల సురేందర్ రెడ్డి, మాజీ సైనికుడు -
అయ్యగారు ఈసారైనా ఓటీటీలోకి వస్తారా..?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇదొక గుడ్‌న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఉన్న చిక్కులు అన్నీ తొలగిపోయాయని తెలుస్తోంది. దీంతో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా 'ఏజెంట్' చిత్రాన్ని 'సోని లివ్' ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా వల్ల సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఏజెంట్ చిత్రాన్ని ఓటీటీ సంస్థలు కూడా తీసుకునేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ పలు మార్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ బ్రేక్ పడుతూ వచ్చింది. ఈసారైనా జనవరి 26న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా..? అంటూ సోషల్‌మీడియాలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను తొలగించి.. మంచి సన్నివేశాలను జోడించి కొత్త వెర్షన్‌ను విడుదల చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారట. -
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ...
ఎల్లారెడ్డి నియోజకవర్గం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో టిఆర్ఎస్ ఘన విజయం సాదిస్తే ఎల్లారెడ్డిలో మాత్రం టిఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి ఓడిపోవడం విశేషం. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్ధి జాజుల సురేందర్ 35148 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. సురేందర్‌కు 91510 ఓట్లు రాగా, రవీంద్ర రెడ్డికి 56362 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ధి టి.బాలరాజుకు 9600 పైచిలుకు ఓట్లు వచ్చాయి. సురేందర్ తొలిసారి గెలు పొందారు. ఆయన మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారు. కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆయన టిఆర్ఎస్లో చేరిపోవడం విశేషం. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇ.రవీంద్ర రెడ్డి నాలుగుసార్లు గెలిచిన నేతగా నమోదయ్యారు. రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన 2004లో టీఆర్ఎస్ పక్షాన గెలిచి, ఉద్యమంలో బాగంగా 2008లో పార్టీ ఆదేశాల ప్రకారం పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేశారు. కాన ఓటమి చెందారు. ఆ తర్వాత 2009లో తిరిగి గెలిచారు. మళ్లీ ఉద్యమంలో 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. 2014 సాదారణ ఎన్నికలలో కూడా గెలుపొందినా, 2018లో ఓటమి చెందారు. ఎల్లారెడ్డిలో ఆరుసార్లు రెడ్డి నేతలు గెలుపొందితే, మరో ఆరుసార్లు బిసిలు గెలిచారు. వారిలో నలుగురు మున్నూరు కాపు వర్గం వారు కాగా, ఇద్దరు గౌడ వర్గం వారు. మూడుసార్లు ఎస్. సిలు ప్రాతినిధ్యం వహించారు. 1983 తరువాత ఒకే ఒక ఉప ఎన్నికలో 2018లో కాంగ్రెస్ ఐ గెలిచింది. మిగిలిన అన్నిసార్లు టిడిపి, టిఆర్ఎస్లు విజయం సాధించాయి. టిఆర్ఎస్ 2004లో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉంటే, 2009లో టిడిపికి మిత్రపక్షం అయింది. 2014 నుంచి ఒంటరిగానే పోటీచేస్తోంది. ప్రముఖ దళితనేత టి.ఎన్.సదాలక్ష్మి ఒకసారి ఇక్కడ, మరోసారి కామారెడ్డిలో గెలిచారు. ఎల్లారెడ్డిలో రెండుసార్లు విజయం సాధించిన జె.ఈశ్వరీబాయి, మాజీ మంత్రి గీతారెడ్డి తల్లీ, కూతుళ్లు, 1978లో ఇక్కడ గెలిచిన బాలాగౌడ్ కొంత కాలం జడ్పి ఛైర్మన్‌గా, నిజామాబాద్ ఎమ్.పిగా కూడా పనిచేశారు. ఇక్కడ గెలిచినవారిలో టిఎన్ సదాలక్ష్మి గతంలో నీలం, కాసు మంత్రివర్గాలలో పనిచేస్తే, బాలాగౌడ్ 1981 తరువాత అంజయ్య, భవనం క్యాబినెట్లలో ఉన్నారు. నేరెళ్ల ఆంజనేయులు కొద్దికాలం చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఎల్లారెడ్డిలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
రన్ రాజా రన్ ! హాఫ్ మారథాన్ !!
మెదక్: ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా సిద్దిపేట ముందుకు సాగుతోంది. మనిషి జీవన ప్రమాణాలతోపాటు ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వస్తున్నాయి. బిజీ ప్రపంచంలో శారీరక శ్రమలేక ఎన్నో అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం సిద్దిపేట వేదిక అవుతోంది. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్, జిల్లా పోలీస్ శాఖ సమన్వయంతో ఆగస్టు 6న హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. అందులో 5, 10, 21 కిలో మీటర్ల విభాగాలు ఏర్పాటు చేశారు. అందుకోసం ఇప్పటికే ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హాఫ్ మారథాన్ అంటే.. మారథాన్ అంటే 42.195 కిలో మీటర్లు(26.385 మైళ్లు), హాఫ్ మారథాన్ అంటే 21.0975 కిలో మీటర్లు(13.192 మైళ్లు) అంటారు. ఇలాంటి రన్లను అరుదుగా నిర్వహిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరంలో సుమారుగా 800 పైగా జరుగుతున్నాయి. 2021 సంవత్సరంలో ఉగాండాకు చెందిన జాకబ్ కిప్లిమో హాఫ్ మారథాన్‌ను 57.31నిమిషాల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించగా, మహిళల విభాగంలో 1.02గంటలో హాఫ్ మారథాన్‌ను ఇథియోపియాకు చెందిన లెటెన్బెట్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. రంగనాయకసాగర్ వేదికగా.. హాఫ్ మారథాన్‌కు సిద్దిపేటలోని రంగనాయకసాగర్ వేదిక కాబోతుంది. ఆగస్టు 6(ఆదివారం)న ఉదయం 5.30గంటలకు హాఫ్ మారథాన్(21.0975 కిలో మీటర్లు) సిద్దిపేట పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ప్రారంభమై రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట పైన రన్ సాగనుంది. అదే రోజు ఉదయం 5:30 గంటలకు 5, 10 కిలో మీటర్ల పరుగు పందెం రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట పై జరగనుంది. ఈ రన్లో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సినీ నటులు, ప్రముఖ క్రీడాకారులు పాల్గొననున్నారు. గెలుపొందిన వారికి నగదు పురస్కారాలు హాఫ్ మారథాన్‌లో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలు అందించనున్నారు. పురుషులు, మహిళలకు వేరువేరు విభాగాలుగా విభజించి అందించనున్నారు. హాఫ్ మారథాన్ విజేతలకు ప్రథమ బహుమతి రూ.50వేలు, ద్వితీయ రూ.25వేలు, తృతీయ రూ.10వేల నగదును, పది కిలోమీటర్ల పందెంలో ప్రథమ రూ.25వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ బహుమతి రూ.10వేలు, 5కిలోమీటర్లలో ప్రథమ రూ.15వేలు, ద్వితీయ రూ.10వేలు, తృతీయ రూ.5వేల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికను అందించనున్నారు. ఇలా మొత్తంగా నగదు పురస్కారాలు రూ3.30లక్షలను అందించనున్నారు. ఈ నెల 25తో ముగియనున్న ఎంట్రీలు హాఫ్ మారథాన్ రన్లో పాల్గొనే వారు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే 5కిలోమీటర్ల రన్‌కు సంబంధించిన ఎంట్రీ గడువు ముగిసింది. జ్ట్టి ఞట://టజిఝ23.జ్ఞీ301.ఛిౌఝ లింక్‌ను ఓపెన్ చేసి వివరాలను నమోదు చేయాలి. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు హాఫ్ మారథాన్, 10 కిలో మీటర్ల రన్‌కు 14 సంవత్సరాలు నిండిన వారు అర్హులు, 5కిలో మీటర్ల రన్లో 10 సంవత్సరాలు నిండిన వారు పాల్గొనేందుకు అర్హులు. పోస్టర్ ఆవిష్కరణ చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు ఎంపీడీఓ కార్యాలయంలో హాఫ్ మారథాన్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం సిద్దిపేట ఏసీపీ సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్ చార్జీలు 5కే రన్‌కు రూ.200, 10కే రన్‌కు రూ.300, 21కే రన్‌కు రూ.500 చెల్లించి ఆన్లైన్లో పేరు నమోదు చేయించుకోవాలన్నారు. -
ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే
అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్‌పై మరో కన్ఫ్యూజన్ వచ్చి పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. చదవండి: షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్‌ఖాన్‌కు గాయాలు అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసింది. థియేటర్ రిలీజ్‌కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్ కూడా లేకపోవడంతో మరో వారం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. మే26న ఏజెంట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Were is #Agent OTT RELEASE MAY 19 @SonyLIV @SonyLIVHelps pic.twitter.com/gLANHasQ1S — OTTGURU (@OTTGURU1) May 19, 2023 -
ఏజెంట్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ సినిమా...
-
ఏజెంట్ కోసం అఖిల్ కష్టాలు.. తెలిస్తే షాక్ అవుతారు ...
-
‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటెట్ మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి ‘అయ్యగారి’కి పక్కా హిట్ వస్తుందని అక్కినేని అభిమానులు ఆశపడ్డారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. తొలిరోజు ఈ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు తక్కువ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం ఫస్ట్‌డే ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 7 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. అందులో తెలుగు రాష్ట్రాలలోనే రూ.4 కోట్లు వసూలు చేయడం గమనార్హం. (చదవండి: కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని) ఇక ప్రాంతాల వారిగా చూస్తే నైజాంలో 1.33 కోట్లు, సీడెడ్ - రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్ర - రూ. 54 లక్షలు, ఈస్ట్ - రూ. 29 లక్షలు, వెస్ట్ - రూ. 30 లక్షలు, గుంటూరు - రూ. 52 లక్షలు, కృష్ణా - రూ. 22 లక్షలు, నెల్లూరు - రూ. 16 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.అఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్(సుమార్ రూ.80 కోట్లు)తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వైడ్‌గా రు. 37 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు. 38 కోట్ల షేర్ వస్తేనే అఖిల్ బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కుతాడు. (చదవండి: బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..) కానీ తొలి రోజే ఇంత తక్కువ వసూళ్లను రాబట్టిందంటే.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే అఫీషియల్‌గా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు రాకపోయినా, ఈ రిపోర్ట్స్ చూస్తే మాత్రం నిజంగానే అఖిల్ కెరీర్లో ఏజెంట్ అతిపెద్ద డిజాస్టర్‌గా కాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ కాగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. -
వారి ప్రేమ, అభిమానం గొప్పవి
‘‘అక్కినేని ఫ్యాన్స్ ప్రేమ, ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పవి. అభిమానుల ఆదరణ లేకుంటే సినిమాలు హిట్ కావు. అఖిల్‌కి చిన్నప్పటి నుంచి కష్టపడే స్వభావం ఉంది. తనలో ఎంతో ఎనర్జీ ఉంది.. ‘ఏజెంట్’ సినిమాతో ఆ ఎనర్జీని సురేందర్ రెడ్డి బయటకు తీశాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది’’ అని హీరో నాగార్జున అన్నారు. అఖిల్, సాక్షీ వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన ‘ఏజెంట్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘పోరాటాలకు అడ్డా... వీరత్వానికి ఇంటి పేరు వరంగల్. ఓ సినిమా బ్లాక్ బస్టర్ కావాలంటే ఏం కావాలో అవి సమకూర్చుకోవడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు పొందారు. ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా తెరకెక్కించడంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర రాజీ పడలేదు. ‘ఏజెంట్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సాక్షీ వైద్యకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మూవీలో నటించేందుకు నటుడు మమ్ముట్టి ఒప్పుకోవడం గొప్ప విషయం. మా చిత్రం హిట్ చేస్తే మంత్రి దయాకర్రావుగారు చెప్పినట్లు మా ప్రతి సినిమా వేడుకకు తప్పకుండా వరంగల్‌కు వస్తాం. తెలుగు ప్రేక్షకులు గొప్పవాళ్లు.. మంచి సినిమాలను తప్పకుండా హిట్ చేస్తారు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ– ‘‘షూటింగ్.. ఆడియో రిలీజ్.. ప్రీ రిలీజ్.. ఇలా ఏదో ఒక కార్యక్రమం వరంగల్‌లో నిర్వహించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటున్న ‘ఏజెంట్’ కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘నా మైండ్‌లో ఒకటే ఉంది. ‘ఏజెంట్’ ని ఇంత హైలో పనిచేసిన తర్వాత నెక్ట్స్ ఏం చేయాలనే ప్రశ్న నాలో కలుగుతోంది’’ అన్నారు. ఈ వేడుకలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, సాక్షీ వైద్య, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. -
Akhil Akkineni : పెళ్లిపై స్పందించిన అఖిల్
-
Agent trailer: ‘ఏజెంట్’ ట్రైలర్ రివ్యూ
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన స్పై యాక్షన్ ఫిల్మ్ ‘ఏజెంట్’. మమ్ముట్టి కీలక పాత్ర పోషించారు. సాక్షివైద్య హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రబృంది. ట్రైలర్ యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయింది. ‘నువ్వెందుకు ఏజెంట్ అవ్వాలనుకుంటున్నావు’అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. సిండికేట్‌కి ఒక పవర్ హౌస్ ఉంది. దాని పేరు గాడ్. దాన్ని ట్రేస్ చేయగలిగితే మొత్తం నెట్వర్క్ని నాశనం చేయొచ్చు. ఈ మిషన్ కోసం మమ్ముట్టి టీమ్ అఖిల్‌ని రంగంలోకి దించుతుంది. ‘సింహం బోనులోకి వెళ్లి తిరిగొచ్చేది కోతి మాత్రమే’అని మమ్ముట్టి చెప్పే డైలాగ్‌తో అఖిల్ పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. (చదవండి: నా బెడ్రూమ్లో ఇప్పటికీ ఆయన పోస్టర్స్ ఉంటాయి: ఖుష్బూ) కోతిలాంటి బిహేవియర్ ఉన్న అఖిల్ ఏజెంట్‌గా మారతాడు. అయితే ఒకానొక దశలో అఖిల్‌నే చంపేయాలని మమ్ముట్టి తన టీమ్ సభ్యులను ఆదేశిస్తాడు. అసలు మమ్ముట్టి అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆ మిషన్‌ని పూర్తి చేసే క్రమంలో అఖిల్‌కు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు ఆ మిషన్ ఎలా సక్సెస్ అయింది? అనేదే ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ తరహా యాక్షన్ అఖిల్‌కి కొత్త కానీ ఆడియన్స్‌కి కాదు. గతంలో వచ్చిన స్పై యాక్షన్ ఫిల్మ్స్ మాదిరే ఇందులో కూడా గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించడం, అదిరిపోయే స్టంట్స్ ఉన్నాయి. ఇక కేజీయఫ్ తర్వాత పెద్ద గన్‌తో క్లైమాక్స్‌ని సెట్ చేయడం ఆనవాయితీగా మారింది. విక్రమ్ నుంచి మొన్నటి పఠాన్ వరకు ప్రతి యాక్షన్ సినిమాలో పెద్ద గన్‌తో బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏజెంట్ ట్రైలర్ చివర్లో కూడా ఇలాంటి సీన్ ఒకటి పెట్టారు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. హిప్ హాప్ తమిళ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సినిమాకు భారీ ఖర్చు చేసినట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. మొత్తం మీద అఖిల్ పెద్ద సాహసమే చేశాడు. అది ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది ఏప్రిల్ 28న తెలుస్తుంది. -
రూమర్స్‌కి చెక్ పెట్టిన అఖిల్ అక్కినేని.. కొత్త పోస్ట్‌తో క్లారిటీ
అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. సురేంద్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడింది. ఇటీవలె ఈ సినిమాను ఈనెల 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి హడావిడి లేదు. అయితే రిలీజ్ డేట్ విషయంలో డైరెక్టర్‌కి, నిర్మాతకి మధ్య విబేధాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఏజెంట్ మళ్లీ వాయిదా పడనున్నట్లు టాక్ వినిపించింది. కానీ అవన్నీ అవాస్తవాలే అని మేకర్స్ తేల్చేశారు. రేపు(శనివారం)అఖిల్ బర్త్‌డే సందర్భంగా ఓ కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇందులో ముందుగా అనౌన్స్ చేసినట్లుగా ఏప్రిల్ 28నే సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. The Advance celebrations begin 💥 Team #AGENT wishes the WILD ONE, @AkhilAkkineni8 a blockbuster birthday 😎 More surprises awaiting ahead🤘#HBDAkhilAkkineni ❤️#AGENTonApril28th 🔥@mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 @hiphoptamizha @Laharimusic pic.twitter.com/SZSDtTTUGq — AK Entertainments (@AKentsOfficial) April 7, 2023 -
అఖిల్ 'ఏజెంట్' మూవీ ఆగిపోయిందా? ట్వీట్‌తో క్లారిటీ
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఏజెంట్'. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వంటి హిట్టు మూవీ తర్వాత అఖిల్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: చై-సామ్ విడాకుల తర్వాత.. ఫస్ట్ గ్రూప్ ఫోటో ఇదే! నిర్మాత అనిల్ సుంకరతో ఏర్పడిన అభిప్రాయ బేధాల వల్ల డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, దీంతో సినిమా ఆగిపోయిందంటూ కూడా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.తాజాగా ఈ వార్తలపై నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. 'ఏజెంట్ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే మనాలీలో ప్రారంభమవుతుంది. త్వరలోనే టీజర్ అప్డేట్ ఇస్తాం. దయచేసి అఫీషియల్ ట్వీట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. రూమర్స్ గురించి పట్టించుకోవద్దు' అంటూ స్పష్టతనిచ్చారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టినట్లయ్యింది. చదవండి: 'షూటింగ్ ఆపేశారు.. నన్ను వాష్‌రూంలో పెట్టి బంధించారు' #AGENT schedule starting in Manali. An update abt teaser will be given shortly. Please only follow verified twitter handles for updates. Ignore all the rumours please. 🙏🙏🙏 — Anil Sunkara (@AnilSunkara1) May 16, 2022 -
బ్యాడ్ న్యూస్.. అక్కినేని ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన నిర్మాత
యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న యాక్షన్ మూవీ ఏజెంట్. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక శుక్రవారం(ఏప్రిల్8)న అఖిల్ బర్త్‌డే . ఈ సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయవచ్చని అంతా భావించారు. కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ మేకర్స్ ఓ పోస్టర్‌తో సరిపెట్టేశారు. 'ఈరోజు టీజర్ విడుదల చేయలేకపోతున్నాం. అక్కినేని అభిమానులందరికీ సారీ. మేము మీకు బెస్ట్‌నే అందించాలని అనుకుంటున్నాం. మీ నిరీక్షణకు తగినట్లుగా నాణ్యమైన టీజర్‌ను త్వరలోనే విడుదల చేస్తాం' అంటూ నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. దీంతో బర్త్‌డే టీజర్ లేనట్లేనంటూ ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. For all Akkineni fans a big SORRY for not giving the teaser today. We want to give the best and it will be worth your wait. We promise to give a highest quality theatrical teaser in May. — Anil Sunkara (@AnilSunkara1) April 7, 2022 WWM 🔥 #AGENT ⚡️ Many more updates exploding soon💥#HBDAkhilAkkineni @AkhilAkkineni8 #AgentOnAugust12 pic.twitter.com/xZeS44aFM2 — AK Entertainments (@AKentsOfficial) April 8, 2022 -
ఒంటిపై మేక టాటూ.. కంప్లీట్‌గా మారిపోయిన అఖిల్ లుక్
సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ నటిస్తున్న సినిమా ఏజెంట్. ఫుల్ యాక్షన్ మూవీగా తయారయ్యే ఈ సినిమాలో ఓ అండర్‌కవర్ ఆపరేషన్ చేసే ఏజెంట్ పాత్రలో అఖిల్ కనిపించనున్నాడు. అఖిల్ నటిస్తున్న ఈ 5వ చిత్రంలో అతడు సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అఖిల్ లుక్కు సంబంధించి ఓ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో అఖిల్ లుక్ కంప్లీట్‌గా మారిపోయింది. కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న అఖిల్ ఫోటోను రిలీజ్ చేస్తూ..'ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఉంది పండగ' అంటూ ఓ పోస్టర్‌ను వదిలారు. ముఖ్యంగా అఖిల్ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ ఫోటోలో అఖిల్ బాడీపై కొమ్ములు కలిగిన మేక టాటూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. 'ఏజెంట్ లోడింగ్. వైల్డ్ రైడ్‌కు మీరు సిద్ధంగా ఉన్నారా?' అంటూ ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నట్లు లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతవరకు ఎప్పుడు చూడనంతగా రఫ్ లుక్‌లో అఖిల్ కనిపించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. This is just the beginning...Meeku mundu mundu undi pandaga!!@AkhilAkkineni8 @AnilSunkara1 @MusicThaman @VamsiVakkantham@AKentsOfficial @S2C_Offl pic.twitter.com/trOj5shejN — SurenderReddy (@DirSurender) July 11, 2021 -
‘ఏజెంట్’ ఫస్ట్‌లుక్.. సూపర్ స్టైలీష్‌గా అఖిల్
సీక్రెట్ ఏజెంట్‌గా అఖిల్ ఓ మిషన్‌ను టేకప్ చేయనున్నారట. అఖిల్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం జరిగాయి. గురువారం ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ నేడు అఖిల్ బర్త్‌డే సందర్భంగా ‘ఏజెంట్’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో అఖిల్ చేతిలో సిగరేట్తోదర్శనమించి అందిరికి షాక్ ఇచ్చాడు ఈ లవర్ బాయ్. కాగా ఫుల్ యాక్షన్ మూవీగా తయారయ్యే ఈ సినిమాలో ఓ అండర్‌కవర్ ఆపరేషన్ చేసే ఏజెంట్ పాత్రలో అఖిల్ కనిపిస్తారట. ఈ సినిమాకు ‘ఏజెంట్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రస్తుతం యంగ్ హీరో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో బిజీగా ఉన్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఏ జిందగీ’ అంటూ ఓ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 'ఆకాశమంతా ఆనందమై తెల్లారుతోందే నాకోసమై..ఆలోచనంతా ఆరాటమై..అన్వేషిస్తోందే'.. ఈ రోజుకై అంటూ సాగే ఈ మెలోడియస్ సాంగ్ ఆకట్టుకుంటుంది. చదవండి: 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మెలోడీ సాంగ్ విన్నారా? -
స్టయిలిష్ డెరెక్టర్‌తో అఖిల్ తర్వాతి సినిమా
కరోనా కారణంగా బ్రేక్ పడిన సినిమా షూటింగులు ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నాయి. పెద్ద సినిమాలు సైతం చిత్రీకరణలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ కెరియర్లో 5వ సినిమా ఎవరితో చేయనున్నారు అనే సస్పెన్‌ను తెరదించుతూ సినిమా వివరాలను అఖిల్ అనౌన్స్ చేసేశాడు. సైరా’తో సూపర్‌హిట్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించనున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభిస్తారని సమాచారం. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతవరకూ సరైన హిట్ ఖాతాలో వేసుకోలేకపోయిన అఖిల్.. తన ఐదవ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ('భీష్మ' డైరెక్టర్‌కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన నితిన్) స్టయిలిష్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో సురేందర్ రెడ్డి స్పెషలిస్ట్. ఇటీవలే ‘సైరా’తో చారిత్రాత్మక సినిమాతోనూ హిట్ సాధించి తన సత్తా చాటారు. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా కాబట్టి మంచి స్టయిలిష్ సినిమానే రాబోతుందన్నమాట. ఇక బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం దసరాకు విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. (రాదే ఓటీటీలోకి రాదు) It’s time ! Announcing my next with @DirSurender and @AnilSunkara1. This one is extremely special to me 🙏🏻. Fully pumped to start soon. Energy all the way 💪🏻 @AKentsOfficial @S2C_Offl #Akhil5 pic.twitter.com/fCF25tR3qJ — Akhil Akkineni (@AkhilAkkineni8) September 9, 2020 -
రిటైర్డ్ అడిషనల్ ఎస్పీని ముప్పుతిప్పలు పెట్టిన నాగరాజు
సాక్షి, హైదరాబాద్ : కోటి 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కీసర తహసీల్దార్ నాగరాజు అక్రమాలు తవ్వినకొద్ది బయటకు వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సామాన్య ప్రజలనే కాకుండా పోలీసు అధికారులను సైతం లంచం డిమాండ్ చేసి ముప్పు తిప్పలు పెట్టారు. ఆయన బాధితుల్లో తాను ఒకడినని రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సురేందర్ రెడ్డి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. లీగల్‌గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడని వాపోయారు. (చదవండి : 1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్) ‘నేను రిటైర్మెంట్ అయిన తర్వాత 2018లో సర్వేనెంబర్ 614లో నాలుగు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాను. లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పట్టా పాస్ బుక్ ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టాడు. గతంలో నాగరాజుపై చీఫ్ సెక్రెటరీకి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్, ఆర్డీవో కు ఫిర్యాదు చేశాను. అధికారులను మభ్యపెడుతు తన పదవిని కాపాడుకుంటున్నాడు. ఒక పోలీస్ అధికారిగా ఉన్న నన్నే లంచం డిమాండ్ చేశాడంటే.. ఇక సామాన్య రైతుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో కుమ్మక్కై దందాలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుండా ఒక్క పని కూడా చేయడు.న్యాయస్థానం కూడా నాగరాజు వ్యవహారంలో సీరియస్ అయింది. ఇలాంటి వ్యక్తి ని కఠినంగా శిక్షించాలి’అని సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. (చదవండి : నాగరాజు ఇంటిలో కొనసాగుతున్న సోదాలు) -
రెండోసారి
అఖిల్ హీరోగా నితిన్ మరో సినిమా నిర్మించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కిస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంలో నటిస్తున్నారు అఖిల్. ఈ సినిమా తర్వాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించబోతున్నారట. ఈ సినిమాను హీరో నితిన్ నిర్మించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే అఖిల్ హీరోగా, నితిన్ నిర్మాతగా రెండోసారి కలువనున్నారన్నమాట. అఖిల్ హీరోగా పరిచయమైన ‘అఖిల్: ది పవర్ ఆఫ్ జువ్వా’ (2015) చిత్రానికి నితిన్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
కాంబినేషన్ సై?
స్టయిలిష్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో సురేందర్ రెడ్డి స్పెషలిస్ట్. ఇటీవలే ‘సైరా’తో చారిత్రాత్మక సినిమాతోనూ హిట్ సాధించి తన సత్తా చాటారు. మరి సురేందర్ రెడ్డి నెక్ట్స్ ఏంటి? అంటే ప్రభాస్‌తో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రభాస్‌కు సరిపోయే పాయింట్ సురేందర్‌రెడ్డి వద్ద ఉందని, త్వరలోనే కథకు సంబంధించిన చర్చలు కూడా జరగనున్నాయని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ కుదిరితే మాత్రం మంచి స్టయిలిష్ సినిమాని ఊహించవచ్చని ఫిల్మ్‌నగర్ టాక్. మరి.. సురేందర్ రెడ్డి చెప్పనున్న కథ నచ్చి ప్రభాస్ ‘సై’ అంటే... ఈ కొత్త కాంబినేషన్ షురూ అయినట్లే. -
‘సైరా’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. జాతీయ స్థాయి నటీనటులతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర టైలర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, తమన్నా, సుధీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
ఫ్యాన్సీ రేటుకు ‘సైరా’ రైట్స్
టాలీవుడ్లో అత్యంత భారీ ఎత్తున, ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సైరా. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. లేడీ సూపర్‌స్టార్ నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి సౌత్ స్టార్లు యాక్ట్ చేస్తున్న ఈ చిత్రం గురించి ఓ అప్డేట్ సిని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దాదాపు అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ క్యాస్టింగ్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ హిందీ డిజిటర్ రైట్స్‌ను ఎక్సెల్ సంస్థ భారీగా చెల్లించి తమ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే కేజీఎఫ్‌ను హిందీలో రిలీజ్ చేసి మంచి లాభాలను సొంతం చేసుకున్న ఈ సంస్థ తాజాగా సైరా హక్కులను చేజిక్కించుకుందని సమాచారం. రామ్‌చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. -
సైరా.. ముందే వస్తోన్న మెగాస్టార్?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ కావటంతో మెగా ఫ్యామిలీ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా దసరా సందర్భంగా రిలీజ్ చేయాలని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం సైరాను కాస్త ముందుగానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దసరాకు కాకుండా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సైరాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. గాంధీ జయంతి రోజు విడుదల చేస్తే లాంగ్ వీకెండ్‌తో పాటు దసరా సెలవులు కలిసి వస్తాయని భావిస్తున్నారట. అయితే గ్రాఫిక్స్ వర్క్ చాలా ఉండటంతో అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అవుతాయా.. లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరుకు జోడిగా నయనతార నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, అనుష్క, జగపతి బాబు, సుధీప్, విజయ్ సేతుపతిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ..నరసింహారెడ్డి గురువుగా అతిథి పాత్రలో కనిపించనున్నారు. -
మార్చిలో ముగించేస్తారు
స్వాతంత్య్ర సమరంలో ఆఖరి ఘట్టానికి చేరుకున్నారు నరసింహారెడ్డి. మార్చి మొదటి వారం నుంచి మళ్లీ సమర శంఖం పూరిస్తారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘సైరా: ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’. సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మాత. నయనతార, తమన్నా కథానాయికలు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మార్చిలో మొదలు కానుంది. ఇదే ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ అట. అయితే ఇది కాకుండా నాలుగు రోజులు ముఖ్య తారాగణమంతా కలిసి చేసే సన్నివేశాలు షూట్ చేయడమే మిగిలి ఉందని సమాచారం. దాంతో సినిమా షూటింగ్ పూర్తి కావచ్చినట్టే. ఆగస్ట్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు. -
‘సైరా నరసింహా రెడ్డి’ టీజర్ విడుదల