akhil akkineni agent movie new poster released - Sakshi
Sakshi News home page

Agent: 'ఇది జస్ట్‌ బిగినింగ్‌ .. మీకు ముందు ముందు ఉంది పండుగ'

Published Sun, Jul 11 2021 12:43 PM | Last Updated on Sun, Jul 11 2021 6:15 PM

Akhil Akkineni Agent Loading New Poster Released - Sakshi

సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో అఖిల్‌ నటిస్తున్న సినిమా ఏజెంట్‌. ఫుల్‌ యాక్షన్‌ మూవీగా తయారయ్యే  ఈ సినిమాలో ఓ అండర్‌కవర్‌ ఆపరేషన్‌ చేసే ఏజెంట్‌ పాత్రలో అఖిల్‌ కనిపించనున్నాడు. అఖిల్‌ నటిస్తున్న ఈ 5వ చిత్రంలో అతడు సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. అఖిల్‌ లుక్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. ఇందులో అఖిల్‌ లుక్‌ కంప్లీట్‌గా మారిపోయింది. కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న అఖిల్‌ ఫోటోను రిలీజ్‌ చేస్తూ..'ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఉంది పండగ' అంటూ ఓ పోస్టర్‌ను వదిలారు. ముఖ్యంగా అఖిల్‌ లుక్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

ఈ ఫోటోలో అఖిల్‌ బాడీపై కొమ్ములు కలిగిన మేక టాటూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. 'ఏజెంట్‌ లోడింగ్‌. వైల్డ్‌ రైడ్‌కు మీరు సిద్ధంగా ఉన్నారా?' అంటూ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ఇక ఈ సినిమా కోసం అఖిల్‌ చాలా కష్టపడుతున్నట్లు లుక్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతవరకు ఎప్పుడు చూడనంతగా రఫ్‌ లుక్‌లో అఖిల్‌ కనిపించాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేసింది. ఇక ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి రెగ్యులర్‌ షూటింగ్‌ ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement