వారి ప్రేమ, అభిమానం గొప్పవి | Akkineni Nagarjuna Speech At Agent Prerelease | Sakshi
Sakshi News home page

వారి ప్రేమ, అభిమానం గొప్పవి

Apr 24 2023 5:42 AM | Updated on Apr 24 2023 5:42 AM

Akkineni Nagarjuna Speech At Agent Prerelease - Sakshi

అనిల్‌ సుంకర, సాక్షీ వైద్య, నాగార్జున, అఖిల్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆరూరి రమేష్, సురేందర్‌ రెడ్డి

‘‘అక్కినేని ఫ్యాన్స్‌ ప్రేమ, ప్రేక్షకుల అభిమానం ఎంతో గొప్పవి. అభిమానుల ఆదరణ లేకుంటే సినిమాలు హిట్‌ కావు. అఖిల్‌కి చిన్నప్పటి నుంచి కష్టపడే స్వభావం ఉంది. తనలో ఎంతో ఎనర్జీ ఉంది.. ‘ఏజెంట్‌’ సినిమాతో ఆ ఎనర్జీని సురేందర్‌ రెడ్డి బయటకు తీశాడు. ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుంది’’ అని హీరో నాగార్జున అన్నారు. అఖిల్, సాక్షీ వైద్య జంటగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్‌’.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్‌ రెడ్డి 2 పతాకాలపై అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన ‘ఏజెంట్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ–‘‘పోరాటాలకు అడ్డా... వీరత్వానికి ఇంటి పేరు వరంగల్‌.

ఓ సినిమా బ్లాక్‌ బస్టర్‌ కావాలంటే ఏం కావాలో అవి సమకూర్చుకోవడంలో దర్శకుడు సురేందర్‌ రెడ్డి పేరు పొందారు.  ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా తెరకెక్కించడంలో అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర రాజీ పడలేదు. ‘ఏజెంట్‌’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న సాక్షీ వైద్యకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ మూవీలో నటించేందుకు నటుడు మమ్ముట్టి ఒప్పుకోవడం గొప్ప విషయం. మా చిత్రం హిట్‌ చేస్తే మంత్రి దయాకర్‌రావుగారు చెప్పినట్లు మా ప్రతి సినిమా వేడుకకు తప్పకుండా వరంగల్‌కు వస్తాం.

తెలుగు ప్రేక్షకులు గొప్పవాళ్లు.. మంచి సినిమాలను తప్పకుండా హిట్‌ చేస్తారు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ– ‘‘షూటింగ్‌.. ఆడియో రిలీజ్‌.. ప్రీ రిలీజ్‌.. ఇలా ఏదో ఒక కార్యక్రమం వరంగల్‌లో నిర్వహించిన సినిమాలన్నీ హిట్‌ అయ్యాయి. ప్రీ రిలీజ్‌ వేడుక జరుపుకుంటున్న ‘ఏజెంట్‌’ కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు.

అఖిల్‌ మాట్లాడుతూ– ‘‘నా మైండ్‌లో ఒకటే ఉంది. ‘ఏజెంట్‌’ ని ఇంత హైలో పనిచేసిన తర్వాత నెక్ట్స్‌ ఏం చేయాలనే ప్రశ్న నాలో కలుగుతోంది’’ అన్నారు. ఈ వేడుకలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్, సాక్షీ వైద్య, సురేందర్‌ రెడ్డి, అనిల్‌ సుంకర, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement