స్వాతంత్య్ర సమరంలో ఆఖరి ఘట్టానికి చేరుకున్నారు నరసింహారెడ్డి. మార్చి మొదటి వారం నుంచి మళ్లీ సమర శంఖం పూరిస్తారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘సైరా: ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’. సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ నిర్మాత. నయనతార, తమన్నా కథానాయికలు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మార్చిలో మొదలు కానుంది. ఇదే ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ అట. అయితే ఇది కాకుండా నాలుగు రోజులు ముఖ్య తారాగణమంతా కలిసి చేసే సన్నివేశాలు షూట్ చేయడమే మిగిలి ఉందని సమాచారం. దాంతో సినిమా షూటింగ్ పూర్తి కావచ్చినట్టే. ఆగస్ట్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు.
Comments
Please login to add a commentAdd a comment