అయ్యగారు ఈసారైనా ఓటీటీలోకి వస్తారా..? | Akhil Akkineni's Agent Movie OTT Release Date Confirmed | Sakshi
Sakshi News home page

అయ్యగారు ఈసారైనా ఓటీటీలోకి వస్తారా..?

Published Sun, Jan 7 2024 8:52 PM | Last Updated on Mon, Jan 8 2024 10:54 AM

Akhil Agent Movie OTT Release Date Confirmed - Sakshi

టాలీవుడ్ ​యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్​ రోల్​లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్‌ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా  యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్‌లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ  ఓటీటీ రిలీజ్​కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు.  అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు ఇదొక  గుడ్​న్యూస్ అనే చెప్పవచ్చు.

ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఉన్న చిక్కులు అన్నీ తొలగిపోయాయని తెలుస్తోంది. దీంతో జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా 'ఏజెంట్‌' చిత్రాన్ని 'సోని లివ్' ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా వల్ల సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఏజెంట్‌ చిత్రాన్ని ఓటీటీ సంస్థలు కూడా తీసుకునేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ పలు మార్లు వార్తలు వచ్చాయి.

కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ బ్రేక్‌ పడుతూ వచ్చింది.  ఈసారైనా జనవరి 26న ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందా..? అంటూ సోషల్‌మీడియాలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను తొలగించి.. మంచి సన్నివేశాలను జోడించి కొత్త వెర్షన్‌ను విడుదల చేయాలనే ఉద్దేశంలో మేకర్స్‌ ఉన్నారట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement