
చిరంజీవి నెక్ట్స్ సినిమా ఏమిటంటే..!
దాదాపు దశాబ్దం తర్వాత ’ఖైదీ నంబర్ 150’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద మరింత సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కొడుకు రాంచరణ్ నిర్మాణసారథ్యంలోనే తన 151 సినిమాలో నటించబోతున్నాడు. చరణ్ ప్రారంభించిన కొణిదేల ప్రొడక‌్షన్స్ బ్యానర్‌లోనే దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ ఏడాది మార్చ్‌లో ఈ సినిమా పనులు ప్రారంభం అవుతాయని తెలుస్తోంది.
చరణ్ సొంతంగా ప్రారంభించిన ప్రొడక‌్షన్ హౌస్‌లోనే ఖైదీ నంబర్ 150 సినిమా తీసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన తండ్రితో కలిసి నటించడం తన జీవితకాల ధ్యేయమని చరణ్ ప్రకటించాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించే 151వ సినిమాలో ఈ కల నెరవేరే అవకాశం కనిపిస్తోంది. నిజానికి చిరు ఇప్పటికే చరణ్ సినిమాలు మగధీర, బ్రూస్‌లీలో అతిథి పాత్రల్లో కనిపించారు. చిరు తాజా సినిమాలోని ఓ పాటలో కాసేపు చరణ్ నర్తించిన సంగతి తెలిసిందే.