
హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ అనుకోకుండా దర్శకుడు కొరటాల శివను కలిశారు. త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన 152వ సినిమాని కొరటాల శివ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శివ కార్యాలయానికి అలా వెళ్లివచ్చానని రాంచరణ్ శుక్రవారం ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ‘శివగారి ఆఫీస్‌కు వెళ్లి వచ్చాను. ఆయన ఎనర్జీ ఎంతగానో నచ్చింది. చిరంజీవి 152వ సినిమాకు ఆల్‌ది బెస్ట్’ అని రాంచరణ్ తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చార్లీ చాప్లిన్ ఫొటో ఎదుట తాను, శివతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసుకున్నారు.
చారిత్రక నేపథ్యంతో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటు రాంచరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’. సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. రాంచరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment