మెగా సంక్రాంతి వేడుకలు.. చిరు ఫామ్​హౌజ్ ధర ఎంతో తెలుసా? | Chiranjeevi's Family Sankranthi Celebrations In Bangalore Farm House, Do You Know Price? | Sakshi
Sakshi News home page

మెగా సంక్రాంతి వేడుకలు.. ఫామ్​హౌజ్ ధర, ఎక్కడో తెలుసా?

Published Thu, Jan 18 2024 3:27 PM | Last Updated on Thu, Jan 18 2024 3:52 PM

Chiranjeevi Family Sankranthi Celebrations In Farm House Do You Know - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి ముగిసింది. కానీ పండుగ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి షేర్‌ చేసిన ఒక ఫోటో ఇప్పటికీ నెట్టింట వైరల్‌ అవుతుంది. మెగా కుటుంబ సభ్యులు అందరూ ఒక్కచోటకు చేరి గ్రాండ్‌గా ఈ పండగని సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో వారందరూ సంక్రాంతిని ఎక్కడ సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆ ప్రేదేశం ప్రత్యేకత ఏంటని చాలామంది ఆరాదీస్తున్నారు.

మెగాస్టార్ ఫ్యామిలీ 2024 సంక్రాంతి సంబరాలను బెంగళూరులోని చిరంజీవికి ఎంతో ఇష్టమైన తన సొంత ఫామ్​హౌజ్​లో జరుపుకున్నారు. ఈ సంబరాల్లో చిరంజీవి, అల్లు అరవింద్‌, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌తో సహా వారి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. దీంతో వారందరూ ఉన్న ఫోటోపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మెగాఫ్యామిలీ సంక్రాంతి సంబరాలు చేసుకున్న ఆ ఫామ్​హౌజ్ గురించి నెటిజన్లు తెగ ఆరాతీస్తున్నారు. ఇంతకు ఆ ఫామ్​హౌజ్ ఎక్కడ ఉంది..? ఎవరిది..?  దాని ఖరీదు ఎంత..? అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే ఆ ఫామ్‌హజ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి సంబంధించినదే... అది బెంగళూరుకు దాదాపు 30 కీమీ దూరంలో ఉన్న దేవనహళ్లిలో ఉంది. వారి ఫామ్‌హౌజ్‌కు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కూడా దగ్గర్లోనే ఉంటుంది. అయితే ఈ ఫామ్​హౌజ్ ధర దాదాపు రూ.30 కోట్లకు పైమాటే  ఉండవచ్చని తెలుస్తోంది. అక్కడ ఆచార్య సినిమా షూట్‌ కూడా జరిగింది. మెగా కుటుంబానికి  సంబంధించి చాలా వేడుకలు ఇక్కడే జరిగాయి. ఇందులో భాగంగానే ఈ సంక్రాంతి వేడుకలు కూడా అక్కడ వారందరూ ఘనంగా జరుపుకున్నారు.

ఆ సమయంలో వారు గ్రూప్‌గా తీసుకున్న ఫోటోను చిరంజీవి తన అభిమానుల కోసం షేర్‌ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఇదే సమయంలో చిరంజీవి కొత్త సినిమా టైటిల్‌ 'విశ్వంభర' అని ప్రకటించారు. ఈ సినిమా టైటిల్‌ విజువల్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టకుంటుంది. అల్లు అర్జున్ పుష్ప-2​, రామ్​ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement