
లాక్‌డౌన్ కారణంగా జనాలు అందరు ఇళ్లకే పరిమితమయ్యారు. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు అందరి జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆఫీస్‌కు వెళ్లే పని లేదు.. షూటింగ్‌లు లేవు. దాంతో ఫిట్‌నెస్ ప్రేమికులు కూడా కొన్ని రోజుల పాటు శరీరానికి రెస్ట్ ఇచ్చారు. పాపం రామ్ చరణ్ కూడా అలానే చేశారంట. ఇన్ని రోజులు గ్యాప్ రావడంతో ప్రస్తుతం జిమ్ చేయాలంటే శరీరం సహకరించడం లేదు. బద్దకం ఎక్కువయ్యింది అంటున్నారు చెర్రి. ఈ క్రమంలో ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు రామ్ చరణ్. ‘బుర్ర జిమ్ చేయమంటోంది.. మనసు మాత్రం వద్దంటోంది’ అంటూ చెర్రి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపసనా, మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో వంట చేయడంతో పాటు ఇతర ఇంటి పనులను చేస్తూ తనను తాను బిజీగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు చెర్రి. (ఒకేసారి ఆ మార్క్‌ను అందుకున్న చిరు, చరణ్)
Head say gym💪 &
— Ram Charan (@AlwaysRamCharan) July 10, 2020
Heart says 🤔hmmmm... pic.twitter.com/zoNNHz6Sxt
ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చెర్రి కీల పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.