తాతా–మనవడు | Amitabh Bachchan and grandson Agastya Nanda hit the gym workouts | Sakshi
Sakshi News home page

తాతా–మనవడు

Published Sat, May 23 2020 6:00 AM | Last Updated on Sat, May 23 2020 8:55 AM

Amitabh Bachchan and grandson Agastya Nanda hit the gym workouts - Sakshi

మనవడు అగస్త్య నందాతో అమితాబ్‌ బచ్చన్‌

తాతకు మనవడు దగ్గులు నేర్పించకూడదు కానీ జిమ్‌లో వర్కవుట్‌ ఎలా చేయాలో నేర్పించవచ్చు. ఇక్కడ ఫొటోలో ఉన్నది అదే. 77 ఏళ్ల అమితాబ్‌ బచ్చన్‌ ఈ వయసులో కూడా ఆరోగ్యానికి ముఖ్య ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇంట్లో ఉన్న జిమ్‌లో వ్యాయామాలు తప్పక చేస్తారు. లాక్‌డౌన్‌ వేళ అందరూ బద్దకంగా ఉండకుండా వ్యాయామాలు చేయమని పిలుపు ఇచ్చారాయన. ఇప్పుడు తన మనవడు అగస్త్య నందాతో వ్యాయామం చేస్తూ అద్దంలో తామిద్దరి ప్రతిబింబాన్ని చూస్తూ సెల్ఫీ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అంతేకాదు ‘ఫిట్‌నెస్‌ కోసం ఫైట్‌ చేద్దాం... ఫైట్‌ చేసి ఫిట్‌నెస్‌ సాధిద్దాం’ అని క్యాప్షన్‌ రాశారు. తాత స్లీవ్‌లెస్‌ టీ షర్ట్‌ ధరించి ఉంటే మనవడు తన టీ షర్ట్‌ను తాతకు సమానంగా భుజాల దగ్గర మడిచాడు. శ్వేతాబచ్చన్‌ నందా– నిఖిల్‌ నందాల కుమారుడు అగస్త్య. శేతా బచ్చన్‌కు నవ్య అనే కుమార్తె కూడా ఉంది. ఇక కొడుకు అభిషేక్‌– కోడలు ఐశ్వర్యల ద్వారా అమితాబ్‌కు మనవరాలు ఆరాధ్య ఉన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement