Agastya
-
నాన్న దగ్గరగా లేడు.. పెదనాన్న, తమ్ముడితో అగస్త్య (ఫొటోలు)
-
గణేశుడి సేవలో పెదనాన్నతో అగస్త్య: హార్దిక్ లేకుండానే (ఫొటోలు)
-
మరో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ బోల్డ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమాలు క్యూ కడుతున్నాయి. కొన్ని చిత్రాలు ఏకంగా నెల రోజుల్లోపే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. తాజాగా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న మాయలో చిత్రం మరో ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. బోల్డ్ రొమాంటిక్ మూవీగా థియేటర్లలోకి వచ్చిన మాయలో చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే మాయలో మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా శుక్రవారం నుంచి ఆహాలో అందుబాటులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టులేకపోయింది. ఈ చిత్రానికి మేఘామిత్ర పేర్వార్ దర్శకత్వం వహించారు. -
Bapatla MP: తెరపై బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ బయోపిక్
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖుల జీవిత కథల నేపథ్యంలో పలు భాషల్లో సినిమాలు రూపొందుతున్నాయి. ఈ లిస్ట్‌లో ఇప్పుడు బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ చేరారు. ఆయన జీవిత కథ ఆధారంగా ‘బాపట్ల ఎంపీ’అనే సినిమా తెరకెక్కుతుంది. అగస్త్య , నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురేఖ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందిగం వెంకట్ నిర్మిస్తున్నారు. నానాజీ మిరియాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాపట్ల ఎంపీ నందిగగం సురేశ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ఈ చిత్ర నిర్మాతల కుమారులు దేవన్, ప్రిన్స్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. (చదవండి: సెప్టెంబర్‌లో ఇన్ని చిత్రాలా?.. వీటిలో ఎన్ని బ్లాక్ బస్టర్ అవుతాయో?) అనంతరం నిర్మాత నందిగం వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తమ్ముడు(నందిగం సురేశ్) నాతో చేసిన జర్నీ, తరువాత యూత్ ప్రెసిడెంట్ గా ఎదిగిన వైనం.. కొన్ని దుష్టశక్తులు కలిసి చేయలేని, చేయకూడని సంఘటనలో ఇరికించాని చూడడం, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి మద్దతుగా నిలవడం, ఆయన సపోర్ట్‌తో ఎలా ఎంపీ ఆయ్యాడనేదే ఈ సినిమా కథాంశం అన్నారు. ఈ కథ చెప్పడం కంటే తెరపై చూస్తేనే బాగుంటుంది అని అన్నారు. చిత్ర దర్శకుడు నానాజీ మిరియాల మాట్లాడుతూ.. ఇది బాపట్ల ఎం పి నందిగం సురేష్ లైఫ్ స్టోరీ. అరిటాకులు కొసుకొని బ్రతికే ఒక సామాన్య వ్యక్తి తన నిజాయితీ ని నమ్ముకొని, తను నమ్మిన సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ నిజాయితీగా ఉంటే. కొందరు వ్యక్తులు ఇతను చెయ్యని తప్పును ఇతను మీద రుద్దుతూ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బంది పెట్టినపుడు వైఎస్ జగన్ గారు చేరదీసీ, ఆయన సిద్దాంతాలు నచ్చి ఒక గొప్ప నాయకుడగా తీర్చిదిద్దారు. సురేష్ అనే ఒక సామాన్య వ్యక్తికి వైఎస్ జగన్ ఏ విధమైన సపోర్ట్ ఇచ్చారు?. ఈ వ్యక్తి లైఫ్ లో ఎంత స్ట్రగుల్ పడ్డాడు అనేదే ఈ కథ.ప్రతి సామాన్యుడు చూడాల్సిన సినిమా ఇది. ఏ పని చేసినా నిజాయితీగా చేస్తే కచ్చితంగా ఎదుగుతాడు అనేది ఇందులో చూపించడం జరిగింది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’అన్నారు. ‘ఈ సినిమా కథను నానాజీ చెప్పినప్పుడు పొలిటికల్ స్టోరీ అని బయపడ్డాను. అయితే ఇందులో అదేమీ లేకుండా సామాన్యుడు అయిన తను ఎదగడానికి ఎంత కష్టపడ్డాడు అనే స్టోరీ నాకు నచ్చింది’అని హీరో అగస్త్య అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని హరోయిన్ నక్షత్ర అన్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. -
స్విమ్మింగ్ పూల్‌లో అగస్త్యతో హార్ధిక్ పాండ్యా ..
టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్య, అతని ముద్దుల కొడుకు అగస్త్యతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. హార్ధిక్, నటాషా దంపతులకు అగస్త్య గతేడాది మే 30న జన్మించాడు. నాటి నుంచి అగస్త్యకు సంబంధించిన ప్రతి ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. తాజాగా, హార్ధిక్ పాండ్యా అతని కొడుకు అగస్త్యతో కలిసి స్విమ్మింగ్ పూల్ ఆడుకుంటున్న చిత్రాన్ని అతని భార్య నటాషా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. స్విమ్మింగ్‌పూల్‌లో అగస్త్య తొలిసారిగా అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ ఫోటోతో పాటు వీరి కుటుంబానికి సంబంధించిన మరో మూడు ఫోటోలను అమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, పాండ్యా గతేడాది ఐపీఎల్ సీజన్ తరువాత జరిగిన ఆసీస్ పర్యటనలో చివరి సారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: ఐదుకు పడిపోయిన విరాట్ టెస్ట్ ర్యాంకింగ్ View this post on Instagram A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) -
ఈ విజయం తనకే అంకితం: హార్దిక్
దుబాయ్: దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించి అయిదో సారి ట్రోపీని తన ఖాతాలో వేసుకుంది. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఘన విజయాన్ని తన కొడుకు అగస్త్యకు అంకితమిచ్చాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు సాధించి గెలిచింది. మ్యాచ్ అనంతరం.. హార్దిక్ ‘ఇది నీకోసమే.. అగస్త్య’ అంటూ ట్రోఫీని లిఫ్ట్ చేస్తున్న ఫోటో పెట్టి ట్వీట్ చేశాడు. కాగా.. హార్దిక్ పాండ్య, భార్య నటాషా దంపతులకు జులై 30న అగస్త్య జన్మించిన సంగతి తెలిసిందే. అయితే.. హార్దిక్ ఈ సీజన్లో 14 మ్యాచ్‌లలో 281 పరుగులు చేసి 178.98 స్ట్రైక్‌రేట్‌తో అద్భుత ప్రదర్శన కనపరిచాడు. అందులో 25 సిక్సర్లు బాదడం విశేషం. ముంబై ఇండియన్స్ విజయంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. గాయం కారణంగా బౌలింగ్‌కి దూరమైనా, తన బ్యాటింగ్‌తో ముంబైని విజయతీరాలకి చేర్చాడు. (నేను అలాంటి వాడిని కాదు: రోహిత్) మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బౌల్ట్ ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే స్టొయినిస్ వెనుదిరగ్గా, అజింక్య రహానే, శిఖర్ ధావన్ అదే బాట పట్టారు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ అర్ధ సెంచరీలతో జట్టు స్కోర్ 156కి చేరింది. 157 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబైకి డికాక్ శుభారంభాన్ని అందించగా, రోహిత్ శర్మ దానిని కొనసాగించాడు. తర్వాత అనవసరపు సింగిల్ కోసం ప్రయత్నించిన రోహిత్‌ను రనౌట్ నుంచి రక్షించేందుకు సూర్యకుమార్ తన వికెట్‌ను త్యాగం చేశాడు. అనంతరం క్రీజ్‌లో అడుగుపెట్టిన ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడటంతో ముంబై లక్ష్యం వైపు దూసుకుపోయింది. మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ముంబై లక్ష్యాన్ని ఛేదించి అయిదో సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. (ముంబై ఇండియన్స్ పాంచ్ పటాకా) -
నటషా పోస్ట్: హార్ధిక్ పాండ్యా 2.o
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా ఆతడి కాబోయే భార్య, నటి నటసా స్టాంకోవిక్ తరచూ వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను పంచుకుంటూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. గత జులైలో ఈ జంటకు పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి వారి కుమారుడు ఆగస్త్యకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తుంటూరు ఈ జంట. తాజాగా నటషా తన కుమారుడు ఆగస్త్యతో ఆడుకుంటున్న వీడియోను సోమవారం షేర్ చేశారు. ఇందులో ఆగస్త్యతో నటషా మాట్లాడుతూ ఉండే తన ముక్కపై పదే పదే కొడుతున్న వీడియోను రెడ్ హర్ట్ ఎమోజీ క్యాప్షన్‌తో పంచుకున్నారు. (చదవండి: రెండు నెలల అగస్త్యుడు: నటషా) View this post on Instagram ❤️ A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Oct 25, 2020 at 5:14am PDT ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ‘ఆగస్త్య చాలా ముద్దుగా ఉన్నాడు’,‘హార్ధిక్ పాండ్యా 2.o’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నటషా-హార్ధిక్ పాండ్యాలు ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ జంటకు జులై 30న ఆగస్త్య జన్మించాడు. ఇటీవల ఆగస్త్యకు రెండు నెలల నిండాయి అంటూ ఈ జంట వారి ముద్దుల తనయుడు ఫొటోలను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: నటాషా, అగస్త్య ఫోటో షేర్ చేసిన పాండ్యా) -
రెండు నెలల అగస్త్యుడు: నటషా
టిమిండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా కుమారుడు అగస్త్యాకు బుధవారం(సెప్టెంబర్ 30)తో రెండు నెలలు నిండాయి. అగస్త్యాకు రెండులు నెలలు నిండిన సందర్భంగా అతడి తల్లి, హార్థిక్ భార్య నటసా తన కుమారుడి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘రెండు నెలల అగస్త్యుడు’ అనే క్యాప్షన్‌తో నటషా పోస్టు చేశారు. అదే ఐపీఎల్ నేపథ్యంలో దుబాయ్‌లో ఉన్న హార్థిక్ కూడా తన ముద్దుల తనయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ముంబై ఇండియన్ జెర్సీపై (హ్యాపీ 2 మంథ్స్ అగస్త్యా’ అని రాసి ఉన్న షాట్ ఫొటోను పోస్టు చేశాడు. (చదవండి: నటాషా, అగస్త్య ఫోటో షేర్ చేసిన పాండ్యా) దీనికి ‘నా కుమారుడికి రెండు నెలలు’ అంటూ తన పోస్టును పంచుకున్నాడు. కాగా జులై 30న హార్థిక్ తాను తండ్రినయ్యాను అంటూ సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నటషా పోస్టుకు టిమిండియా బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్‌తో పాటు టిమిండియా ఆటగాళ్లంతా అగస్త్యకు ఎమోజీలతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎల్ 2020కి హార్థిక్ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఆడిన 3 మ్యాచ్‌లో రెండు పరాజయం పొందింది. View this post on Instagram #2months 💙 Agastya 💙 A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on Sep 30, 2020 at 6:06am PDT -
నటాషా, అగస్త్య ఫోటో షేర్ చేసిన పాండ్యా
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, భార్య నటాషా స్టాంకోవిచ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటూ పలు ఆసక్తికరమైన అంశాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్యూట్ జంట జూలై 30న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన తన కుమారుడికి అగస్త్య అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని హార్ధిక్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. (కెరీర్లో ఇలాంటి గాయాలు సహజమే : హార్దిక్) ప్రస్తుతం ఐపీఎల్ ప్రారంభం కావడంతో హార్ధిక్ దుబాయ్ పయనమయ్యాడు. పాండ్యా ముంబై ఇండియన్స్ టీంలో ఆడుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ముంబై ఇండియన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను హార్ధిక్ భార్య నటాసా, బేబీబాయ్ టీవీలో తిలకిస్తున్న ఫోటోను హార్ధిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ముంబై ఇండియన్స్‌ను ఉత్సాహపరిస్తున్న ఈ ఫోటోలో నటాసా, అగస్త్యా ముంబై ఇండియన్స్ టీ షర్టులు ధరించి టీవీలో ఐపీఎల్ చూస్తున్నారు. కాగా.. పాండ్యా ఈ పోస్ట్‌కి క్వీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్.. కోల్‌కత్తాపై 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్ విజయం సాధించడం హర్ధిక్‌కు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చింది. (పాండ్యా, నటాషా ఫోటోను తొలగించిన ఇన్స్టాగ్రామ్) -
తాతా–మనవడు
తాతకు మనవడు దగ్గులు నేర్పించకూడదు కానీ జిమ్‌లో వర్కవుట్ ఎలా చేయాలో నేర్పించవచ్చు. ఇక్కడ ఫొటోలో ఉన్నది అదే. 77 ఏళ్ల అమితాబ్ బచ్చన్ ఈ వయసులో కూడా ఆరోగ్యానికి ముఖ్య ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇంట్లో ఉన్న జిమ్‌లో వ్యాయామాలు తప్పక చేస్తారు. లాక్డౌన్ వేళ అందరూ బద్దకంగా ఉండకుండా వ్యాయామాలు చేయమని పిలుపు ఇచ్చారాయన. ఇప్పుడు తన మనవడు అగస్త్య నందాతో వ్యాయామం చేస్తూ అద్దంలో తామిద్దరి ప్రతిబింబాన్ని చూస్తూ సెల్ఫీ తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు ‘ఫిట్నెస్ కోసం ఫైట్ చేద్దాం... ఫైట్ చేసి ఫిట్నెస్ సాధిద్దాం’ అని క్యాప్షన్ రాశారు. తాత స్లీవ్‌లెస్ టీ షర్ట్ ధరించి ఉంటే మనవడు తన టీ షర్ట్‌ను తాతకు సమానంగా భుజాల దగ్గర మడిచాడు. శ్వేతాబచ్చన్ నందా– నిఖిల్ నందాల కుమారుడు అగస్త్య. శేతా బచ్చన్‌కు నవ్య అనే కుమార్తె కూడా ఉంది. ఇక కొడుకు అభిషేక్– కోడలు ఐశ్వర్యల ద్వారా అమితాబ్‌కు మనవరాలు ఆరాధ్య ఉన్న సంగతి తెలిసిందే. -
అగస్త్య పసిడి గురి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జీవీ మావలంకార్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర షూటర్ కె. అగస్త్య సాయికుమార్ సత్తా చాటాడు. గుజరాత్‌లోని ఖాన్పూర్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ (టీఆర్ఏ)కు ప్రాతినిధ్యం వహించిన అగస్త్య, 50మీ. పురుషుల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో చాంపియన్‌గా నిలిచాడు. అతను ఫైనల్లో 567 పాయింట్లు స్కోర్ చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తొలుత నీలింగ్ పొజిషన్లో 183 పాయింట్లు స్కోర్ చేసిన అగస్త్య ప్రోన్ కేటగిరీలో 197 పాయింట్లు సాధించాడు. చివరగా స్టాండింగ్ పొజిషన్లో 187 పాయింట్లను స్కోర్ చేసి విజేతగా నిలిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంస్కార్ హవి ల్లా 560 పాయింట్లతో రజత పతకాన్ని దక్కించుకోగా... పంజాబ్ షూటర్ పంకజ్ ముఖీజా 558 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా టీఆర్ఏ అధ్యక్షుడు అమిత్ సంఘీ జాతీయ స్థాయిలో చాంపియన్‌గా నిలిచిన అగస్త్యను అభినందించారు. -
అక్కలాగే తమ్ముడూనూ...
11 ఏళ్లకే ఇంటర్ ఫైనల్ రాసిన ఆగస్త్య జైస్వాల్ హైదరాబాద్: అతిచిన్న వయసులోనే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసి చరిత్ర సృష్టించాడు కాచిగూడ ప్రాంతానికి చెందిన ఆగస్త్య జైస్వాల్. గురువారం నుంచి ప్రారంభమైన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 11 ఏళ్ల ఆగస్త్య హాజరై పరీక్షలు రాశాడు. 2015లో పదవ తరగతి పరీక్షలు రాసి అతిచిన్న వయసులో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర చరిత్రలోనే తొలి విద్యార్థిగా రికార్డు సృష్టించాడు. గత సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని శ్రీ చైతన్య కాలేజీ సెంటర్లో ఇంటర్ ఫైనల్ ఇయర్ పరీక్షలకు హాజరవుతున్నాడు ఆగస్త్య జైస్వాల్. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని సెయింట్‌మేరీ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ సీఇసీ గ్రూపు చదువుతున్నాడు. ఆగస్త్య అక్క నైనా జైస్వాల్ 15 ఏళ్లకే పీజీ పరీక్షలు రాసి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ఎన్నో అవార్డులను నైనా సొంతం చేసుకుంది. తండ్రి అశ్విన్‌కుమార్, తల్లి భాగ్యలక్ష్మి ప్రోత్సాహం ఎంతో ఉండడంతో ఆ ఇంట్లో అక్కాతమ్ములు అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఇతర విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. -
అగస్త్యుడు
జ్యోతిర్మయం చెట్లు కాసే తీయని పళ్లలా, నదులు మోసుకొచ్చే చల్ల ని నీళ్లలా, సజ్జనుల సంపదలన్నీ పరోపకారం కోసమే. జనావాసాలకు దూరంగా కొండల్లో, కోనల్లో, ఆశ్రమా లలో నిరాడంబరంగా జీవిస్తూ తపస్సు చేసుకొనే మహర్షుల తపోబలం కూడా లోకోపకారం కోసమే. ఉదాహరణగా అగస్త్య మహర్షి అద్భుత చరిత్రను చూపవచ్చు. వాతాపీ, ఇల్వలుడూ అనే రాక్షస సోదరులు కామరూపులు. అరణ్యమార్గంలో వెళ్లే బ్రాహ్మణులను భోజనం మిషతో ఆకర్షించి తెచ్చేవారు. వాతాపి మేక రూపం ధరించితే, ఇల్వలుడు ఆ మేక మాంసం బ్రాహ్మణులకు వడ్డించేవాడు. భోజనమైన తర వాత ఇల్వలుడు ‘వాతాపీ, ఇక బయటకు రా!’ అని కేక వేయ గానే వాతాపి బ్రాహ్మణుడి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇలా వాళ్లు ఎందరో బ్రాహ్మణులను చంపారు. వాళ్ల దుర్మార్గం అణచేందు కు, ఒకనాడు అగస్త్యుడు వాళ్ల అతిథిగా వెళ్లాడు. తన కు వడ్డించిన వాతాపిని జీర్ణం చేసేసుకొన్నాడు. భోజ నం తర్వాత, ఇల్వలుడు ఎంత అరిచినా లాభం లేకపో యింది. ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అని అగస్త్యుడు పొట్ట నిమురుకోటంతో వాతాపి కథ ముగిసింది. కాలకేయ గణాలు అనే రాక్షసులు పగలంతా కన బడకుండా సముద్రంలో దాక్కొని, రాత్రి వేళల్లో తప స్వుల మీద పడి చంపేస్తూ ఉండేవాళ్లు. దేవతలు అగ స్త్యుడిని ప్రార్థిస్తే, ఆయన సముద్రాన్నంతా ఆపోశన పట్టి చుక్క మిగలకుండా తాగేశాడు. కాలకేయ గణా లకు దాక్కొనేందుకు చోటు మిగలలేదు. దాంతో దేవ తలు వాళ్లను సంహరించగలిగారని పురాణ గాథ. వనవాసం చేస్తున్న శ్రీరాముడు అగస్త్యాశ్రమం దర్శించి మహర్షిని సేవించాడు. అగస్త్యుడు రాముడికి వైష్ణవ ధనుస్సు, అక్షయ తూణీరం, దివ్య ఖడ్గాలు బహూకరించి, సమీపంలో ఉన్న పంచవటిలో కుటీరం కట్టుకొని నివాసం చేయమని సూచన చేశాడు. అనం తరం, రామరావణ యుద్ధంలో అగస్త్యుడు రణరంగా నికి వెళ్లి రాముడికి శుభదాయకమైన ఆదిత్య హృద యాన్ని బోధించి ఉత్సాహపరిచాడు. ఇంద్ర పదవి పొంది కళ్లు నెత్తికెక్కి సప్తర్షులను పల్లకీ బోయీలుగా నియమించిన నహుషుడిని క్షణకాలంలో కొండచిలు వగా మార్చి కళ్లు తెరిపించింది అగస్త్యుడే. వింధ్య పర్వతం అహంకరించి మితిలేకుండా పెరిగిపోతుంటే, దేవతల ప్రార్థన మేరకు అగస్త్యుడు తనకు ప్రాణంతో సమానమైన కాశీ క్షేత్రాన్ని వదిలి దక్షిణా పథానికి బయలుదేరాడు. ఆయనకు కొండెక్కే శ్రమ కలగకూడదని వింధ్య పర్వతం వినమ్రతతో ఒంగక తప్పలేదు. ‘నాయనా, నేను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండు!’ అని ఆదేశించి అగస్త్యుడు ముందుకు సాగాడు. ఆయన తిరిగి వెళ్లకనే పోవటంతో వింధ్య ఔద్ధత్యం శాశ్వతంగా అణగారిపోయింది. ఇలాంటి పరోపకార పరాయణులైన మహనీయుల స్ఫూర్తి దా యకమైన చరిత్రలు మానవాళికి నిత్యస్మరణీయాలు. ఎం. మారుతిశాస్త్రి