స్విమ్మింగ్‌ పూల్‌లో అగస్త్యతో హార్ధిక్‌ పాండ్యా .. | Hardik Pandya With His Son Agastya In Swimming Pool Photos Gone Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌గా మారిన హార్ధిక్‌ పాండ్య,అగస్త్య ఫోటోలు

Published Wed, Feb 10 2021 7:03 PM | Last Updated on Wed, Feb 10 2021 8:11 PM

Hardik Pandya With His Son Agastya In Swimming Pool Photos Gone Viral - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్య, అతని ముద్దుల కొడుకు అగస్త్యతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ మారాయి. హార్ధిక్‌, నటాషా దంపతులకు అగస్త్య గతేడాది మే 30న జన్మించాడు. నాటి నుంచి అగస్త్యకు సంబంధించిన ప్రతి ఫోటో సోషల్‌ మీడియాలో తెగ హల్‌ చల్‌ చేస్తుంది. తాజాగా, హార్ధిక్‌ పాండ్యా అతని కొడుకు అగస్త్యతో కలిసి స్విమ్మింగ్‌ పూల్‌ ఆడుకుంటున్న చిత్రాన్ని అతని భార్య నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

స్విమ్మింగ్‌పూల్‌లో అగస్త్య తొలిసారిగా అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ ఫోటోతో పాటు వీరి కుటుంబానికి సంబంధించిన మరో మూడు ఫోటోలను అమె సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, పాండ్యా గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ తరువాత జరిగిన ఆసీస్‌ పర్యటనలో చివరి సారిగా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 
చదవండి: ఐదుకు పడిపోయిన విరాట్‌ టెస్ట్‌ ర్యాంకింగ్‌‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement