బాయ్‌ఫ్రెండ్‌తో చిల్ అవుతోన్న హార్ధిక్ పాండ్యా మాజీ భార్య! | Natasa Stankovic Car Ride in Mumbai with Boyfriend Aleksandar Ilac | Sakshi
Sakshi News home page

Natasa Stankovic: బాయ్‌ఫ్రెండ్‌తో హార్ధిక్ పాండ్యా మాజీ భార్య.. వీడియో వైరల్!

Published Thu, Sep 12 2024 2:13 PM | Last Updated on Thu, Sep 12 2024 2:13 PM

Natasa Stankovic Car Ride in Mumbai with Boyfriend Aleksandar Ilac

ఇటీవలే భారత క్రికెటర్‌ హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న నటి, మోడల్ నటాసా స్టాంకోవిచ్ ప్రస్తుతం ముంబయిలో చిల్ ‍అవుతోంది. విడాకుల తర్వాత సెర్బియా వెళ్లిపోయిన నటాషా దాదాపు రెండు నెలల తర్వాత ఇండియాకు వచ్చింది. అయితే ఆమెతో పాటు బాయ్‌ ఫ్రెండ్‌ అలెగ్జాండర్ ఇలాక్‌ కూడా ఉన్నారు. వీరిద్దరు కారులో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

కాగా.. అంతకుముందే తాను ముంబయికి వచ్చిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తన కుమారుడు అగస్త్యతో పాటు ఇండియాక వచ్చినట్లు తెలిపింది. ఇటీవల తన కొడుకు పుట్టినరోజును సెర్బియాలో తన కుటుంబం, బంధుమిత్రులతో కలిసి జరుపుకుంది. బర్త్‌ డేకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

కాగా.. నటాసా స్టాంకోవిచ్‌ మొదట యాడ్స్‌లో నటించడం ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత ప్రకాష్ ఝా తెరకెక్కించిన సత్యాగ్రహం మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ చిత్రంలో ప్రత్యేక సాంగ్‌లో మెరిసింది. అంతేకాకుండా డిష్కియావూన్, యాక్షన్ జాక్సన్, 7 అవర్స్ టు గో, జీరో వంటి చిత్రాల్లో కనిపించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement