
ప్రముఖ బాలీవుడ్ నటి అమృతా సింగ్ ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఈ లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నట్లు తెలుస్తోంది. ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్ విలువ దాదాపు రూ.18 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. కాగా.. అమృతా సింగ్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడారు. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత వీరిద్దరు విడిపోయారు. వీరిద్దరికీ సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.
కాగా.. అమృతా సింగ్ బేతాబ్ (1983) చిత్రంతో అరంగేట్రం చేశారు. ఈ సినిమాతోనే బాలీవుడ్‌లో ఫేమ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మార్డ్, నామ్, చమేలి కి షాదీ, రాజు బన్ గయా జెంటిల్‌మన్ వంటి చిత్రాలతో ప్రశంసలు అందుకున్నారు. కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన ఆమె కలియుగ్, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా వంటి చిత్రాలతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఐనా చిత్రంలో ఆమె నటనకు గానూ ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది, తరువాత ఆమె 2 స్టేట్స్ మూవీలో ఆమె పాత్రకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment