Amrita Singh
-
సైఫ్ అలీఖాన్‌కు తెలీకుండా భార్యనే నిద్రమాత్రలిచ్చింది: చిత్రనిర్మాత
బాలీవుడ్ నటీనటుల వ్యక్తిగత జీవితాలు ఎప్పుడూ టాక్ ఆఫ్ ది కంట్రీగా మారుతూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ మీద జరిగిన హత్యాయత్నం తదనంతర పరిణామాలు సైఫ్ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లోకి ఎక్కించాయి. ప్రస్తుతం నటుడు సైఫ్ అలీఖాన్ భార్య కరీనాకపూర్ అయినప్పటికీ ఆయనకు ఇది తొలి వివాహం కాదు. ఆయన తొలుత సహ నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకుని 13 సంవత్సరాల పాటు దాంపత్య జీవితం గడిపారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా ఈ జంట చివరకు 2004లో విడాకులు తీసుకున్నారు.ఇదిలా ఉంటే గతంలో అమృతా సింగ్ తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చిందనే విషయం చాలా కాలం క్రితమే వెల్లడైనప్పటికీ మరోసారి ఇప్పుడు ఆ విషయం హల్చల్ చేస్తోంది. చిత్రనిర్మాత, సూరజ్ బర్జాత్యా ఒకసారి ఒక చిత్రం షూటింగ్లో ఉన్నప్పుడు సైఫ్ అలీఖాన్ గురించి పలు విషయాలను వెల్లడించారు. అందులో భాగంగానే సైఫ్ అలీఖాన్‌కి అమృతా సింగ్ నిద్రమాత్రలు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయన బయటపెట్టారు.దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ఈ సంఘటన హమ్ సాథ్ సాథ్ హై చిత్రం షూటింగ్ సమయంలో జరిగింది ఈ చిత్రంలో సైఫ్‌తో పాటు కరిష్మా కపూర్, సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే, మోహ్నీష్ బహ్ల్, టబు కీలక పాత్రల్లో నటించారు. హమ్ సాత్ సాథ్ హై సెట్స్‌లో మేకర్స్ ఆశించినట్టుగా ఖచ్చితమైన షాట్‌ను ఖచ్చితంగా చేయడానికి వీలుగా సైఫ్ అలీ ఖాన్ సరైన పరిస్థితిలో లేడు. అతనికి కారణాలేమో తెలీదు కానీ అంతకు ముందు రాత్రి నిద్ర సరిగా లేకపోవడంతో చాలా రీటేక్‌లు ఇవ్వాల్సి వచ్చింది.‘‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ వ్యక్తిగత జీవితం చాలా హెచ్చు తగ్గులు ఎదుర్కొంది. అందుకే ఎప్పుడూ టెన్షన్లో ఉండేవాడు. ఈ చిత్రంలోని ‘సునో జీ దుల్హన్’ పాట షూటింగ్ సమయంలో సైఫ్ అలీఖాన్ పలు మార్లు రీటేక్‌లు తీసుకుంటున్నాడు. ఆ పాత్రను ఎలా పండించాలా అని ఆలోచిస్తూ అతను రాత్రంతా నిద్రపోలేదు. నేను అతని మొదటి భార్యతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు తెలిసింది’’ అంటూ సూరజ్ బర్జాత్యా గుర్తు చేసుకున్నారు.అప్పుడు ఆయన సైఫ్ అలీఖాన్ భార్య అమృతాసింగ్కు ఓ సలహా ఇచ్చాడు. ’’అతను రాత్రంతా నిద్రపోవడం లేదని తెలిసి నేను అమృతకు ఓ సలహా ఇచ్చాను. అదేంటంటే... సైఫ్‌కు తెలియకుండా నిద్రమాత్రలు ఇవ్వాలని. నా సలహా ను అనుసరించి అమృత అతనికి తెలియకుండా నిద్రమాత్రలు ఇచ్చింది’’ అంటూ ఆయన చెప్పారు. దాంతో అతని సన్నివేశాలు చాలా వరకూ ఆ మరుసటి రోజు ఏర్పాటు చేశారట. కేవలం ఒక్క టేక్‌లో పాట చాలా బాగా కంప్లీట్ చేశాడు. దాంతో షూటింగ్లో అందరూ షాక్ అయ్యారు’’ అన్నారాయన.హమ్ సాథ్ సాథ్ హై చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది భారతీయ చలనచిత్రంలో ఐకానిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సైఫ్ అలీ ఖాన్ 2004లో అమృతాసింగ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత, అతను 2012లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. -
నా భర్త మొదటి భార్య అంటే అభిమానం: కరీనా కపూర్
బాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంటల్లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఒకరు. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2012లో ముంబయిలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే గతంలో కరీనా కపూర్.. తన భర్త మొదటి భార్యపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను అమృతా సింగ్‌కు అభిమానిని అని తెలిపింది. అంతేకాకుండా సైఫ్‌తో స్నేహం చేయాలని ఆమె కోరుకున్నట్లు వెల్లడించింది. సైఫ్ జీవితంలో అమృతకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చింది.గతంలో కరీనా మాట్లాడుతూ..'సైఫ్‌కు ఇంతకు ముందే వివాహం అయిందని నాకు తెలుసు. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతన్ని కుటుంబాన్ని నేను గౌరవిస్తా. నేను కూడా ఆయన మొదటి భార్య అమృతా సింగ్‌కి అభిమానినే. నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు. కానీ నాకు ఆమె గురించి సినిమాల ద్వారా తెలుసు. ఆమెకు ఎప్పుడు సైఫ్ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఆమె కేవలం మొదటి భార్యనే కాదు.. అతని పిల్లలకు తల్లి కూడా. సైఫ్లాగే నేను ఆమెను గౌరవిస్తా. ఇది నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నా.' అని అన్నారు.కాగా.. సైఫ్ అలీ ఖాన్ మొదట నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 2004లో విడిపోయారు. వీరిద్దరి కూడా సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. కరీనా, సైఫ్ అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు. వీరికి తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అకా జెహ్ అనే కుమారులు ఉన్నారు. -
'మొదటి భార్యకు విడాకులు.. నన్ను ఇలాగే చావనివ్వండి'
బాలీవుడ్‌లోని ఫేమస్ జంటల్లో సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ జోడీ ఒకరు. అయితే కరీనాను పెళ్లాడటానికంటే ముందు సైఫ్‌కు నటి అమృతా సింగ్‌తో పెళ్లయింది, పిల్లలు పుట్టారు, తర్వాత విడాకులూ తీసుకున్నారు. తాజాగా అతడి పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌గా మారింది. 2005లో అతడు ఆ ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'విడాకులు తీసుకున్నప్పుడు నన్ను, నా తల్లిని, సోదరిని దుర్భాషలాడారు. అవమానించారు. మానసికంగా వేధించారు. అన్నింటినీ భరించాను. అందులో తప్పేముంది? నెమ్మదిగా దాని నుంచి బయటపడ్డాను. తర్వాత నేను మళ్లీ ప్రేమలో పడితే కూడా తప్పేనా? (విడాకుల అనంతరం సైఫ్ నటి రోసాను డేటింగ్ చేశాడు) దానివల్ల ఎవరికి హాని ఉంది? మేము విడిపోయిన తర్వాత కూడా పిల్లలను ఎప్పుడూ పట్టించుకోకుండా వదిలేయలేదు. అలా అని కస్టడీ కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ తనతో పోరాడాలనీ అనుకోలేదు. కానీ ఎప్పుడూ వారికి అండగా ఉన్నాను. అమృతకు రూ.5 కోట్లు భరణం ఇచ్చేందుకు అంగీకరించాను. అందులో సగాన్ని ఆల్రెడీ చెల్లించేశాను. అంత ఆస్తి లేదు దానితోపాటు ఇబ్రహీంకు 18 ఏళ్ల వయసొచ్చేవరకు నెలకు రూ.1 లక్ష చొప్పున ఇస్తానని చెప్పాను. షారుక్ ఖాన్‌లా అంత పెద్ద సంపద నాకు లేదు. అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి వారికి ఇస్తానన్న డబ్బును సమయానికి ఇచ్చేసేవాడిని. యాడ్స్, స్టేజీ షోలు, సినిమాల ద్వారా వచ్చే ప్రతి పైసాను వారికే అంకితం చేశాను. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఇలాగే చావనివ్వండి.. అంతేకానీ, ఒక బంధంలో నుంచి ఇంత ఈజీగా వచ్చేశావేంటంటూ పదేపదే ఎత్తిపొడుపు మాటలతో నన్ను పదే పదే పొడిచి చంపొద్దు ప్లీజ్..' అని చెప్పుకొచ్చాడు. రెండు పెళ్లిళ్లు కాగా సైఫ్- అమృత 1991లో పెళ్లి చేసుకున్నారు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీమ్ అలీ ఖాన్ సంతానం. పెళ్లి తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైన అమృత విడాకుల తర్వాత వెండితెరపై మళ్లీ బిజీ నటిగా మారింది. 2004లో భార్యతో విడిపోయిన తర్వాత సైఫ్ నటి రోసాతో ప్రేమలో పడ్డాడు. కానీ కొంతకాలానికే బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం హీరోయిన్ కరీనా కపూర్‌ను ప్రేమించాడు. 2012లో ఆమెను పెళ్లాడాడు. వీరికి తైమూర్, జే అని ఇద్దరు కుమారులు జన్మించారు. చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన స్టార్ హీరోల సినిమాలు.. సలార్ హిందీ వర్షన్ ఆరోజే రిలీజ్! -
కాబోయే భర్తపై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇల్లరికం వస్తేనే పెళ్లి
Sara Ali Khan Said About Her Future Husband Where He Will Live: బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'కేదరినాథ్'తో హీరోయిన్గా తెరంగ్రేటం చేసిన సారా 'లవ్ ఆజ్కల్', 'కూలీ నం 1'లో నటించింది. ఇటీవల విడుదలైన 'ఆత్రంగి రే' సినిమాలో తన నటనకు ప్రశంసలు దక్కాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా తన తల్లిదండ్రులు సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ ఇద్దరికీ చాలా సన్నిహితంగా ఉంటుంది. తన తల్లి పెంపకానికి ఎంతగానో అలవాటు పడింది సారా. అయితే ఇటీవల ఆత్రంగి రే సక్సేస్ మీట్లో పాల్గొన్న సారాకు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది సారా అలీ ఖాన్. 'నాకు మా అమ్మే సర్వస్వం. ఆమెతో ఉండటమే నాకు సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో నాకు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం రాదు. ఇప్పటికీ నా తల్లి సహాయం లేకుండా మ్యాచింగ్ బ్యాంగిల్స్, దుస్తులను వేసుకోలేను. ఇలా ఇంటర్వ్యూలకు సైతం అటెండ్ కాలేను. నేను ఎక్కడికి వెళ్లినా తిరిగి వచ్చేది మా అమ్మ దగ్గరికే. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆమె చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. తాను ఎప్పుడూ అలాగే ఉంటుందని భావిస్తున్నా. నా తండ్రి బలమైన, అధునాతన మనిషి. భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకుంటే నేను మా అమ్మతో కలిసి జీవించగలిగే వ్యక్తినే వివాహం చేసుకుంటాను (ఇల్లరికం). నేను ఆమెను ఎప్పటికీ విడిచిపెట్టను. ఇల్లరికాన్ని ఒప్పుకునే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను.' అని సారా తెలిపింది. ఇదీ చదవండి: అలియా భట్ నవ్వు.. నెటిజన్ల ట్రోలింగు.. -
ఆమె కోసం షూటింగ్ సెట్స్‌కి వెళ్లేవాడు..రవి శాస్త్రి బ్రేకప్ స్టోరీ
ఆల్‌రౌండర్ రవి శాస్త్రి.. సినిమా హీరోకున్నంత క్రేజ్ సంపాదించుకున్నాడు! అతని ఆటతోపాటు అపియరెన్స్నూ ఆరాధించారు అమ్మాయిలు! అతను బాలీవుడ్ నటి అమృతా సింగ్‌ను ప్రేమించాడు.. ఆమె కూడా రవి శాస్త్రి తోడును కోరుకుంది.. కానీ ఆ ప్రేమ .. పెళ్లి ఆహ్వానాన్ని పంపలేదు..ఆ బ్రేకప్‌కు కారణమేంటో తెలుసుకోవాలంటే ఇంకో బ్రేకప్ దగ్గర మొదలైన ఈ లవ్‌స్టోరీ చదవాలి.. పెళ్లయిందన్న విషయాన్ని దాచిపెట్టి తనతో ప్రేమ నటించిన సన్నీ డియోల్ మోసాన్ని తట్టుకోలేకపోయింది అమృతా సింగ్. కాస్త కటువుగానే అతనితో తెగతెంపులు చేసేసుకుంది. ఆ బాధను, దిగులును మరచిపోవడానికి కెరీర్ మీద ఏకాగ్రతను పెంచుకుంది. ఏ కాస్త వీలు దొరికినా స్నేహితులతో కలసి పార్టీలకు వెళ్లి సేద తీరేది. అలాంటి ఓ సందర్భంలోనే రవి శాస్త్రి పరిచయమయ్యాడు. అప్పటికి రవి శాస్త్రి గురించి కాస్తయినా అమృతాకు తెలుసు కానీ.. అమృతా గురించి ఆ క్రికెటర్‌కు ఏమీ తెలీదు. అయినా అమృతా నచ్చింది అతనికి.. తొలి చూపులోనే. మొదటి పరిచయంలోనే ఇద్దరూ చాలా సన్నిహితులైపోయారు. టెలిఫోన్ నంబర్లూ ఇచ్చిపుచ్చుకున్నారు. తెల్లవారి నుంచి టెలిఫోన్ సంభాషణలూ స్టార్ట్ చేశారు. తీరిక వేళల్లో.. అమృతా సింగ్ నటించిన సినిమాలు చూడకపోయినా.. ఆమె షూటింగ్ సెట్స్‌కి వెళ్లేవాడు రవిశాస్త్రి. అమృతా అంతే.. క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేకపోయినా రవిశాస్త్రి కోసం అతనితో కలసి క్రికెట్ టూరింగ్ చేసింది. కాఫీ డేట్లు, డిన్నర్ మీట్లు సాధారణమయ్యాయి. వీళ్ల తీరుకి అది ప్రేమే అని గ్రహించిన మీడియా కథనాలు రాయసాగింది. అవునని కానీ.. కాదని కానీ కామెంట్ చేయలేదు ఆ జంట. చూసీ చూడనట్టే ఉండిపోయింది. కొన్నాళ్లకు జంటగా ‘సినీ బ్లిట్జ్’ మ్యాగజైన్ కవర్ మీద కనిపించింది ఆ జంట.. తమ మధ్య ప్రేమానుబంధం నిజమే అని ప్రకటిస్తూ! ‘చూశారా మేం చెప్పింది నిజమే’ అంటూ పేజ్‌త్రీ కాలమ్స్ థమ్స్ అప్ చేశాయి. నిశ్చితార్థం కూడా అయిపోయిందని చెప్పాయి. దీని గురించి కూడా మీడియా రాసింది.. ‘న్యూయార్క్‌లోని ఓ హోటల్లో రవిశాస్త్రి.. అమృతాకు ఉంగరం తొడిగాడు.. బహుశా అది ఎంగేజ్మెంట్ రింగ్ కావచ్చు’ అని. ఎవరు చెబితేనేం .. ఆ ఇద్దరి ప్రేమ నిజం.. వాళ్లిద్దరూ ఒక్కింటివాళ్లవ్వబోతున్నది మాత్రం అబద్ధంగా తేలింది. ఎందుకలా? వాళ్ల నిశ్చితార్థం సమయానికి ఇంకా చెప్పాలంటే ఆ జంట ఇష్క్‌లో ఈదుతున్నప్పటికీ వాళ్ల వాళ్ల కెరీర్లో ఉచ్ఛస్థితిలో ఉన్నారు. అమృతా క్యాలెండర్ ఖాళీ లేనంత బిజీ. అదే రవి శాస్త్రికి ఇబ్బంది అనిపించింది. పెళ్లి కానంత వరకు అమ్మాయిలకు ఉద్యోగాలు ఉండొచ్చు కానీ పెళ్లయ్యాక ఇల్లాలికి ఇల్లే ప్రపంచం కావాలనే స్థిరమైన అభిప్రాయం అతనిది. అడిగాడు అమృతాను సినిమాలు మానేయమని. అప్పుడప్పుడే సక్సెస్‌ను.. స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న ఆమెకు అతని డిమాండ్ సమంజసమనిపించలేదు. అందుకే ‘సారీ’ అంది. అతనూ ‘సారీ’ అన్నాడు పెళ్లికి. అలా బ్రేక్ అయిపోయింది ఆ బంధం. ఎవరి దారిలో వారు.. అమృతాను కాదనుకున్నాక 1990లో రీతూ సింగ్‌ను పెళ్లి చేసుకున్నాడు రవి శాస్త్రి. సరిగ్గా ఏడాదికి అంటే 1991లో సైఫ్ అలీ ఖాన్ ఇల్లాలైంది అమృతా సింగ్. అయితే తమ పెళ్లయిన 22 ఏళ్లకు రీతూకు విడాకులిచ్చాడు రవి శాస్త్రి. తమ పెళ్లయిన పదమూడేళ్లకు అంటే 2004లో సైఫ్ అలీ ఖాన్‌తో వివాహబంధాన్ని రద్దు చేసుకుంది అమృతా సింగ్. రీతూ విడిపోయాక.. బాలీవుడ్ నటి.. లంచ్ బాక్స్ ఫేమ్ నిమ్రత్ కౌర్‌తో ప్రేమలో పడ్డాడని సోషల్ మీడియా మాట. దాన్నీ నిజంగా సమర్థించలేదు.. వదంతిగానూ కొట్టి పారేయలేదు ఆ ఇద్దరూ! జీవిత భాగస్వామి విషయంలో నాక్కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కాస్త పురుషాహంకారిని కూడా. పెళ్లయ్యాక భార్యకు ఇల్లే లోకం కావాలని బలంగా నమ్ముతాను. అందుకే సినీ నటిని నా భార్యగా నేనాడూ ఊహించలేదు. – రవి శాస్త్రి క్షణం తీరికలేకుండా కెరీర్ సాగుతున్న టైమ్‌లో దాన్ని వదులుకునేందుకు నేనూ సిద్ధపడలేదు. కొన్నాళ్లు వేచిచూస్తే తెలిసేది.. భార్యగా.. తల్లిగా నేను సిద్ధమో..కాదో! – అమృతా సింగ్ - ఎస్సార్ -
‘ఇది ప్రపంచలోనే చెత్త విషయం’
అమృత సింగ్‌తో విడాకుల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తెలిపారు. ఇప్పటికీ దానిని అసౌకర్యంగా భావిస్తానని తెలిపారు. ప్రస్తుతం జవానీ జనేమాన్ చిత్రంలో నటిస్తున్న సైఫ్ పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో తండ్రి పాత్రలో నటించనున్న సైఫ్.. తన ముగ్గురు పిల్లల (సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్, తైమూరు) గురించి కూడా మాట్లాడారు. అలాగే అమృతతో విడాకులపై కూడా స్పందించారు. అమృతతో విడాకులు తీసుకున్న విషయాన్ని సారా, ఇబ్రహీంలకు ఎలా చెప్పారని ప్రశ్నించగా సైఫ్ స్పందిస్తూ.. ‘ఇది ప్రపంచలోనే చెత్త విషయం. దీన్ని భిన్నమైన విషయంగా భావిస్తున్నాను. ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నానని ఎప్పటికీ అనుకోను. కొన్ని సంఘటనల నుంచి ఎప్పటికీ బయటపడలేమన్నా విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంద’ని భావోద్వేగానికి లోనయ్యారు. ‘కానీ వీలైనంత వరకు దీని నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండటం కోసం ప్రయత్నించాను. అప్పుడు నా వయసు 20 ఏళ్లు మాత్రమే.. కుర్రాడిగా ఉన్నప్పుడే నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. కాబట్టే నేను ఈ విధంగా చేయాల్సివచ్చిందని సమర్థించుకుంటాను. తల్లిదండ్రులు విడిపోయి రెండు కుటుంబాలుగా, వ్యక్తులుగా ఉండడమనే విషయం ఊహించలేనిదని.. అందుకే ఇప్పటికీ నేను అసౌకర్యానికి లోనవుతుంటాను’ అని సైఫ్ తెలిపారు. ఇక ఆధునిక కుటుంబంగా ఉంటూనే ఒకరిపట్ల ఒకరు ఎంతో గౌరవంతో ఎలా ఉండగలుగుతున్నారన్నా మరోప్రశ్నకు.. ‘ఎలాంటి పరిస్థతుల్లో అయినా కుటుంబానికి తోడుగా ఉండాలి. అప్పుడే జీవితం అందంగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ఎప్పుడూ ఫిర్యాదు చేసుకొకుండా అర్థం చేసుకుని మెలగాలి. అయితే ఇద్దరు తల్లిదండ్రులను కలిగి ఉండటమనేది గొప్పవిషయం కాకపోవచ్చు.. కానీ కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ఇలాంటివి చోటు చేసుకుంటాయి’ అని సైఫ్ అన్నారు. స్థిరమైన ఇల్లు, మంచి కుటుంబ వాతావరణాన్ని పిల్లలకు ఇస్తే అదే మోడ్రన్ ఫ్యామిలీ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చదవండి : ఆమెకు ఐదు, ఆయనకు ఆరో పెళ్లి -
పెళ్లి పీటలెక్కని రవిశాస్త్రి ఫస్ట్ లవ్!
ముంబై: మన్సూర్ అలీఖాన్ పటౌడీ-షర్మిల ఠాగుర్‌తో మొదలైన బాలీవుడ్-క్రికెటర్ల ప్రేమాయణాలు నేటి విరుష్క జంట వరకు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌ల మధ్య ప్రేమ చిగురించిందని, గత రెండేళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు హాట్‌టాపిక్ అయ్యాయి. గతంలోనే పెళ్లి అయ్యిన 56 ఏళ్ల రవిశాస్త్రికి సంతానం కూడా ఉంది. అయితే గత కొన్నేళ్లుగా భార్య రితూ సింగ్‌కు రవిశాస్త్రి దూరంగా ఉంటున్నట్లు, విడాకులు తీసుకున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే భారత హెడ్‌కోచ్, నిమ్రత్ కౌర్ ప్రేమ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో రవిశాస్త్రి 1980 నాటి ప్రేమ కథల మరోసారి చర్చనీయాంశమైంది. బాలీవుడ్ నటి అమ్రితా సింగ్‌తో రవిశాస్త్రి తొలిసారి ప్రేమలో పడ్డారు. ఓ మ్యాగజైన్ కవర్ ఫొటోకు వీరిద్దరు ఫోజివ్వడంతో దేశం మొత్తం వీరి గురించే గుసగుసలాడింది. 1986లో వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఈ జంట పెళ్లి పీటలెక్కలేకపోయింది. వారి పెళ్లి ఓ కలగానే మిగిలిపోయింది. ఓ సందర్భంలో.. ’ఓ నటిని నేను భార్యగా కోరుకోను. నేను ఆవేశపరుడిని. నా సతీమణికి తన ఇళ్లే తొలి ప్రాధాన్యంగా ఉండాలి.’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించగా.. దీనికి అమ్రితా సింగ్ బదులిస్తూ.. ’ప్రస్తుత తరుణంలో నా కెరీర్‌తో బిజీగా ఉన్నాను. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ మంచి భార్యగా, తల్లిగా మారుతానని’ తెలిపారు. అనంతరం కొన్నిరోజులకే వారి ప్రేమకు ఎండ్‌కార్డ్ పడింది. 1990లో రవిశాస్త్రి రితూను పెళ్లి చేసుకోగా.. 1991లో అమ్రితాను సైఫ్ అలిఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. -
చరణ్‌తో సారా!?
సారా అంటే... సారా అలీఖాన్! హిందీ హీరో సైఫ్ అలీఖాన్, నటి అమృతా సింగ్‌ల కుమార్తె. త్వరలో ఈ అమ్మాయి తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారట. అదీ రామ్‌చరణ్ సినిమాతో! దీనికి దర్శకుడు ఎవరంటే... మణిరత్నం. ఎప్పట్నుంచో రామ్‌చరణ్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కానీ, అంతకు మించి ఆ సినిమా ముందుకు కదలడం లేదు. తాజా ఖబర్ ఏంటంటే... ‘రంగస్థలం’ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోనే చరణ్ సినిమా చేస్తారట. అందులో కథానాయికగా సారా అలీఖాన్‌ను కన్ఫర్మ్ చేశారట. తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో బైలింగ్వల్‌గా ఈ సినిమా తీయాలని మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారని చెన్నై టాక్. తమిళంలో డబ్ చేసే ప్లానులో ఉన్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో కాకుండా మణిరత్నం స్టైల్లో డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమా రూపొందనుందట!! ఈ సంగతి పక్కనపెడితే... సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. -
నా కూతుర్ని అసభ్యంగా చూపించొద్దు: నటి తల్లి
ముంబయి: చాలాకాలం సస్పెన్స్ కొనసాగిన తర్వాత బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా తెరకెక్కుతోన్న 'కేదార్నాథ్' మూవీలో సారా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే పటౌడీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్ యువరాణిగా పిలుపుచుకునే ఈ బ్యూటీకి ఆమె తల్లి అమృతాసింగ్ కొన్ని కండీషన్లు పెట్టారట. తొలుత తమ కూతురును ఇండస్ట్రీకి పరిచయం చేయడం లేదని చెప్పిన సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌లు ఆపై వారి నిర్ణయం మార్చుకున్నారు. సినిమా షూటింగ్‌ల పేరుతో హీరోయిలతో, బాయ్‌ఫ్రెండ్స్ అంటూ తిరగడం మాత్రం చేయవద్దని కూతురు సారాకు అమృత ఆంక్షలు విధించిందని ఇండస్ట్రీలో టాక్. పనిపై శ్రద్ధ పెట్టి కేవలం సినిమా విషయాలతోనే వార్తల్లో ఉండాలి తప్ప.. ఇతరత్రా పనుల వల్ల ఫొటోలు దిగుతూ, బయట తిరుగుతూ వదంతులకు కారణం అవకూడదని హిత బోధ చేశారని సమాచారం. కూతురికి తొలి సినిమా కావడంతో టెన్షన్ పడుతున్న ఆమె తల్లి డైరెక్టర్ అభిషేక్ కపూర్‌ను కలిశారట. కూతురికి నటనలో కాస్త మెలకువలు నేర్పించాలని కోరారు. అయితే మూవీలో అసభ్యంగా మాత్రం చూపించవద్దని డైరెక్టర్‌కు అమృత విజ్ఞప్తి చేశారని ప్రచారం జరుగుతోంది. -
హీరో కూతురి ఫొటోలు మళ్లీ వైరల్
న్యూఢిల్లీ: వెండితెరపై కనిపించక ముందే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సారా ఫోటోలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్‌కి సారా తన తల్లి అమృతా సింగ్‌తో కలిసి హాజరైంది. పింక్ కలర్ లెహంగా, సిల్వర్ కలర్ టాప్ తో ఈవెంట్లో సారా యువరాణిలా దర్శరమిచ్చి ఆహుతులను ఆకట్టుకుంది. బాలీవుడ్ యువరాణి సారా అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆమె తెరంగేట్రంపై నెలకొన్న ఊహాగానాలకు సైఫ్ దంపతులు తెరదించారు. ఆమె నటించడం తమ ఇద్దరికి ఇష్టమేనని సైఫ్ ప్రకటన చేయడంతో నవాబ్ యువరాణిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సారా అలీ ఖాన్ ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి జోడీగా నటిస్తోంది. తల్లి నుంచి అందాన్ని పునికిపుచ్చుకున్న ఈ యంగ్ బ్యూటీ తండ్రి నట వారసత్వాన్ని కొనసాగించాలని పటౌడీ ఫ్యామిలీ ఫ్యాన్స్ అశ పడుతున్నారు. -
ఆ కథనాలు పూర్తిగా కల్పితం: హీరో
కూతురు సరా అలీఖాన్ సినీ రంగ ప్రవేశంపై తాను, తన మాజీ భార్య అమృతాసింగ్ ఒకే అభిప్రాయంతో ఉన్నామని, ఈ విషయంలో తమ మధ్య ఎలాంటి విభేదాలకు తావు లేదని బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో తనకు, అమృతాసింగ్ మధ్య గొడవ జరిగిందంటూ వచ్చిన కథనాలు బూటకమని ఆయన తెలిపారు. ఇలాంటి పూర్తి కల్పిత కథనాలు మీడియాలో చదవాల్సి రావడం బాధ కలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సైఫ్-అమృతాసింగ్ కూతురు సరా త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, సరా బాలీవుడ్ ఎంట్రీపై తండ్రి సైఫ్ ఆందోళన చెందుతున్నాడని, తల్లి అమృతాసింగ్ సరా సినిమాల్లోకి రావాలని కోరుకుంటుండగా.. ఇందుకు సైఫ్ నిరాకరించారని, దీంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలను ఖండిస్తూ సైఫ్ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘సరా సినీ ప్రవేశంపై నేను, అమృత ఒకే అభిప్రాయంతో ఉన్నాం. ఈ విషయంలో మేం ఎలాంటి సంభాషణ జరుపలేదు. నటించాలన్న సరా అభిమతానికి నేను పూర్తి మద్దతు ఇచ్చాను. ఆమెతో సవివరంగా చర్చించాను. ఓ తండ్రిగా ఆతృతతో, మిశ్రమ భావోద్వేగంతో ఆమె సినీ రంగ ప్రవేశం గురించి ఎదురుచూస్తున్నాను’ అని సైఫ్ పేర్కొన్నారు. సైఫ్, అమృతాసింగ్ దంపతులకు ఇద్దరు పిల్లలు సరా, ఇబ్రహీం ఉన్నారు. వీరు 2004లో వేరయ్యారు. ప్రస్తుతం కరీనా కపూర్‌ను పెళ్లాడిన సైఫ్‌కు తైమూర్ అలీఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. -
యంగ్ హీరోలైతే బెటర్ : సీనియర్ నటి
ముంబై : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, నటి అమృతాసింగ్‌ల కూతురు సారా అలీఖాన్ సినిమా రంగ ప్రవేశంపై బాలీవుడ్ కోడై కూస్తోంది. సారా తొలి చిత్రం గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, సారా స్టార్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో సినిమా ఎంట్రీపై అభిమానుల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, గల్లీ బాయ్ చిత్రాల్లో సారా నటిస్తున్నట్టు పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో నిర్మించబోయే చిత్రంలో కండలవీరుడు హృతిక్ రోశన్ సరసన సారా నటించబోతున్నట్టు గాసిప్పులు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై హృతిక్ స్పందించి..అవన్ని పుకార్లని కొట్టిపారేసి ఓ క్లారిటీ ఇచ్చారు. కానీ, సారా కరణ్ జోహార్ చిత్రంతోనే సినీ ఆరంగేట్రం చేయనుందని సైఫ్ అలీఖాన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం, కరన్ తదుపరి ప్రాజెక్ట్‌లో హృతిక్ నటిస్తుండటంతో గాసిప్పులకు మళ్లీ ఆజ్యం పోసినట్టయింది. కాగా, సారా నిర్ణయంపై తల్లి అమృతా సింగ్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. సారా వయసుకు తగ్గ హీరోతో సినిమాల్లో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అమృత అభిప్రాయపడుతున్నట్టు ఓపెన్ మ్యాగజైన్ పేర్కొంది. సారా తొలి చిత్రంలో యువకుల సరసన హీరోయిన్గా నటిస్తేనే ఎక్కువ కాలం హీరోయిన్గా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని అమృత భావిస్తున్నట్టు తెలుస్తోంది. సన్నీ డియోల్ కుమారులు కరన్ డియోల్, రజ్వీర్ డియోల్లలో ఎవరో ఒకరికి జోడీగా ఆరంగేట్రం చేస్తే బాగుంటుందని అమృతా భావిస్తున్నట్టు సమాచారం. అమృతాసింగ్, సన్నీడియోల్లు ఇద్దరు మంచి స్నేహితులు. అంతేకాకుండా 1983లో బితాబ్ చిత్రంలో సన్నీడియోల్ సరసన హీరోయిన్గా అమృతాసింగ్ తెరంగేట్రం చేసింది. అమృతాసింగ్, సైఫ్ దంపతులకు సారా, ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమృతా సింగ్ కు విడాకులిచ్చిన సైఫ్ కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఓ తీపికబురు చెప్పిన హీరో
బాలీవుడ్ స్టార్ దంపతులు సైఫ్ ఆలిఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఓ తీపికబురు చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా తాము ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపారు. కరీనా కపూర్ గర్భవతి అయిన విషయాన్ని కన్ఫర్మ్ చేసిన సైఫ్.. ‘నేను, నా భార్య ఇద్దరం కలిసి ఈ విషయం చెప్దామనుకున్నాం. డిసెంబర్లో మాకు తొలిబిడ్డ పుట్టబోతున్నాడు. మాకు మద్దతుగా ఉండి, ఆశీస్సులు అందించిన మా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ విషయంలో సంయమనంగా ఉన్న మీడియాకు కూడా థాంక్స్’ అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. కరీనా, సైఫ్ ఇటీవల లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్‌లో కరీనా ఫొటోలు చూసిన తర్వాత.. ఆమె గర్భవతి అయి ఉండవచ్చునని కథనాలు వచ్చాయి. లండన్ నుంచి తిరిగొచ్చాక ఈ విషయం గురించి మీడియా కరీనాను అడుగగా ఆమె సున్నితంగా తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించుతూ సైఫ్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు. మాజీ క్రికెటర్ టైగర్ పటోడీ, షర్మిలా టాగోర్ తనయుడైన సైఫ్ 2012 అక్టోబర్‌లో కరీనాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదటి భార్య అమృతాసింగ్‌తో సైఫ్‌కు ఇద్దరు పిల్లలు- కూతురు సరా, కొడుకు సరా ఉన్నారు. -
సారాకు సినిమాలపై ఆసక్తి లేదు!
ముంబై: సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఖాన్ సినిమాల్లో నటించనున్నట్టు వస్తున్న వార్తలన్ని నిరాధారమేనని బాలీవుడ్ నటి కరీనా కపూర్ అన్నారు. సారాకు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపడం లేదు. కొలంబియాలో చదువుకుంటోంది. చదువు పూర్తికావడానికి మరో ఐదేళ్లు పడుతుంది. బాలీవుడ్ లో ప్రవేశించే ప్లాన్స్ లేవు. రూమర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్ధం కావడం లేదు అని కరీనా అన్నారు. ప్రస్తుతం తాను సింగం రిటర్న్ అనే చిత్రంలో నటిస్తున్నానని.. ఆ చిత్రం ఘనవిజంయ సాధిస్తుందనే ఆశాభావాన్ని కరీనా వ్యక్తం చేశారు. అమృతాసింగ్, సైఫ్ దంపతులకు సారా, ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమృతా సింగ్ కు విడాకులిచ్చిన సైఫ్ కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.