నా కూతుర్ని అసభ్యంగా చూపించొద్దు: నటి తల్లి | Amrita Singh instruct daughter Sara not to hang out with males | Sakshi
Sakshi News home page

నా కూతుర్ని అసభ్యంగా చూపించొద్దు: నటి తల్లి

Published Fri, Aug 4 2017 8:40 PM | Last Updated on Sun, Sep 17 2017 5:10 PM

నా కూతుర్ని అసభ్యంగా చూపించొద్దు: నటి తల్లి

నా కూతుర్ని అసభ్యంగా చూపించొద్దు: నటి తల్లి

ముంబయి: చాలాకాలం సస్పెన్స్ కొనసాగిన తర్వాత బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ బాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వనుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'కేదార్‌నాథ్' మూవీలో సారా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే పటౌడీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్ యువరాణిగా పిలుపుచుకునే ఈ బ్యూటీకి ఆమె తల్లి అమృతాసింగ్ కొన్ని కండీషన్లు పెట్టారట. తొలుత తమ కూతురును ఇండస్ట్రీకి పరిచయం చేయడం లేదని చెప్పిన సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్‌లు ఆపై వారి నిర్ణయం మార్చుకున్నారు.

సినిమా షూటింగ్‌ల పేరుతో హీరోయిలతో, బాయ్‌ఫ్రెండ్స్‌ అంటూ తిరగడం మాత్రం చేయవద్దని కూతురు సారాకు అమృత ఆంక్షలు విధించిందని ఇండస్ట్రీలో టాక్. పనిపై శ్రద్ధ పెట్టి కేవలం సినిమా విషయాలతోనే వార్తల్లో ఉండాలి తప్ప.. ఇతరత్రా పనుల వల్ల ఫొటోలు దిగుతూ, బయట తిరుగుతూ వదంతులకు కారణం అవకూడదని హిత బోధ చేశారని సమాచారం. కూతురికి తొలి సినిమా కావడంతో టెన్షన్ పడుతున్న ఆమె తల్లి డైరెక్టర్ అభిషేక్ కపూర్‌ను కలిశారట. కూతురికి నటనలో కాస్త మెలకువలు నేర్పించాలని కోరారు. అయితే మూవీలో అసభ్యంగా మాత్రం చూపించవద్దని డైరెక్టర్‌కు అమృత విజ్ఞప్తి చేశారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement