హీరో కూతురి ఫొటోలు మళ్లీ వైరల్ | Sara Ali Khan Made The Spotlight in delhi show | Sakshi
Sakshi News home page

హీరో కూతురి ఫొటోలు మళ్లీ వైరల్

Published Sun, Jul 23 2017 4:32 PM | Last Updated on Tue, Sep 5 2017 4:43 PM

హీరో కూతురి ఫొటోలు మళ్లీ వైరల్

హీరో కూతురి ఫొటోలు మళ్లీ వైరల్

న్యూఢిల్లీ: వెండితెరపై కనిపించక ముందే బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సారా ఫోటోలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్‌ ఈవెంట్‌కి సారా తన తల్లి అమృతా సింగ్‌తో కలిసి హాజరైంది. పింక్‌ కలర్‌ లెహంగా, సిల్వర్‌ కలర్ టాప్‌ తో ఈవెంట్‌లో సారా యువరాణిలా దర్శరమిచ్చి ఆహుతులను ఆకట్టుకుంది. బాలీవుడ్ యువరాణి సారా అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గత కొన్ని రోజులుగా ఆమె తెరంగేట్రంపై నెలకొన్న ఊహాగానాలకు సైఫ్ దంపతులు తెరదించారు. ఆమె నటించడం తమ ఇద్దరికి ఇష్టమేనని సైఫ్ ప్రకటన చేయడంతో నవాబ్ యువరాణిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సారా అలీ ఖాన్ ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి జోడీగా నటిస్తోంది. తల్లి నుంచి అందాన్ని పునికిపుచ్చుకున్న ఈ యంగ్ బ్యూటీ తండ్రి నట వారసత్వాన్ని కొనసాగించాలని పటౌడీ ఫ్యామిలీ ఫ్యాన్స్ అశ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement