సారాకు సినిమాలపై ఆసక్తి లేదు! | Sara Ali Khan not interested in films: Kareena Kapoor | Sakshi
Sakshi News home page

సారాకు సినిమాలపై ఆసక్తి లేదు!

Published Mon, Jul 28 2014 4:38 PM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM

సారాకు సినిమాలపై ఆసక్తి లేదు!

సారాకు సినిమాలపై ఆసక్తి లేదు!

ముంబై: సైఫ్ ఆలీ ఖాన్ కూతురు సారా ఖాన్ సినిమాల్లో నటించనున్నట్టు వస్తున్న వార్తలన్ని నిరాధారమేనని బాలీవుడ్ నటి కరీనా కపూర్ అన్నారు. సారాకు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపడం లేదు. కొలంబియాలో చదువుకుంటోంది. చదువు పూర్తికావడానికి మరో ఐదేళ్లు పడుతుంది. 
 
బాలీవుడ్ లో ప్రవేశించే ప్లాన్స్ లేవు. రూమర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్ధం కావడం లేదు అని  కరీనా అన్నారు. ప్రస్తుతం తాను సింగం రిటర్న్ అనే చిత్రంలో నటిస్తున్నానని.. ఆ చిత్రం ఘనవిజంయ సాధిస్తుందనే ఆశాభావాన్ని కరీనా వ్యక్తం చేశారు. 
 
అమృతాసింగ్, సైఫ్ దంపతులకు సారా, ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమృతా సింగ్ కు విడాకులిచ్చిన సైఫ్ కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement