చరణ్‌తో సారా!? | Saif Ali Khan's daughter Sarah Ali Khan to make her South Indian | Sakshi
Sakshi News home page

చరణ్‌తో సారా!?

Published Tue, Aug 15 2017 11:58 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

చరణ్‌తో సారా!?

చరణ్‌తో సారా!?

సారా అంటే... సారా అలీఖాన్‌! హిందీ హీరో సైఫ్‌ అలీఖాన్, నటి అమృతా సింగ్‌ల కుమార్తె. త్వరలో ఈ అమ్మాయి తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానున్నారట. అదీ రామ్‌చరణ్‌ సినిమాతో! దీనికి దర్శకుడు ఎవరంటే... మణిరత్నం. ఎప్పట్నుంచో రామ్‌చరణ్‌ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. కానీ, అంతకు మించి ఆ సినిమా ముందుకు కదలడం లేదు. తాజా ఖబర్‌ ఏంటంటే... ‘రంగస్థలం’ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోనే చరణ్‌ సినిమా చేస్తారట.

 అందులో కథానాయికగా సారా అలీఖాన్‌ను కన్ఫర్మ్‌ చేశారట. తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో బైలింగ్వల్‌గా ఈ సినిమా తీయాలని మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారని చెన్నై టాక్‌. తమిళంలో డబ్‌ చేసే ప్లానులో ఉన్నారు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల తరహాలో కాకుండా మణిరత్నం స్టైల్‌లో డిఫరెంట్‌ స్టోరీతో ఈ సినిమా రూపొందనుందట!! ఈ సంగతి పక్కనపెడితే... సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement