నా భర్త మొదటి భార్య అంటే అభిమానం: కరీనా కపూర్ | Kareena Kapoor Said She Is A Fan Of Saif Ali Khan First Wife Amrita Singh, Deets Inside | Sakshi
Sakshi News home page

Kareena Kapoor: సైఫ్ మొదటి భార్య అంటే చాలా గౌరవం

Published Tue, Aug 6 2024 7:18 PM | Last Updated on Tue, Aug 6 2024 7:30 PM

Kareena Kapoor said she is a fan of Saif ali khan First wife Amrita Singh

బాలీవుడ్ మోస్ట్ పాపులర్ జంటల్లో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఒకరు. కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2012లో ముంబయిలో వివాహం చేసుకున్నారు.  ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే గతంలో కరీనా కపూర్‌.. తన భర్త మొదటి భార్యపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను అమృతా సింగ్‌కు అభిమానిని అని తెలిపింది. అంతేకాకుండా సైఫ్‌తో స్నేహం చేయాలని ఆమె కోరుకున్నట్లు వెల్లడించింది. సైఫ్‌ జీవితంలో అమృతకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చింది.

గతంలో కరీనా మాట్లాడుతూ..'సైఫ్‌కు ఇంతకు ముందే వివాహం అయిందని నాకు తెలుసు. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతన్ని కుటుంబాన్ని నేను గౌరవిస్తా. నేను కూడా ఆయన మొదటి భార్య అమృతా సింగ్‌కి అభిమానినే. నేను ఆమెను ఎప్పుడూ కలవలేదు. కానీ నాకు ఆమె గురించి సినిమాల ద్వారా తెలుసు. ఆమెకు ఎప్పుడు సైఫ్ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఆమె కేవలం మొదటి భార్యనే కాదు.. అతని పిల్లలకు తల్లి కూడా. సైఫ్‌లాగే  నేను ఆమెను గౌరవిస్తా. ఇది నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నా.' అని అన్నారు.

కాగా.. సైఫ్ అలీ ఖాన్  మొదట నటి అమృతా సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు 2004లో విడిపోయారు. వీరిద్దరి కూడా సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. కరీనా, సైఫ్ అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు.  వీరికి తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్ అకా జెహ్ అనే కుమారులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement