పెళ్లి పీటలెక్కని రవిశాస్త్రి ఫస్ట్‌ లవ్‌! | Ravi Shastri Got engaged to Amrita Singh Why Did Not Marry Her | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 4 2018 10:21 AM | Last Updated on Tue, Sep 4 2018 10:40 AM

Ravi Shastri Got engaged to Amrita Singh Why Did Not Marry Her - Sakshi

రవిశాస్త్రి, అమ్రితా సింగ్‌

ముంబై: మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ-షర్మిల ఠాగుర్‌తో మొదలైన బాలీవుడ్‌-క్రికెటర్ల ప్రేమాయణాలు నేటి విరుష్క జంట వరకు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా భారత హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ల మధ్య ప్రేమ చిగురించిందని, గత రెండేళ్లుగా వీరు డేటింగ్‌ చేస్తున్నారనే వార్తలు హాట్‌టాపిక్‌ అయ్యాయి. గతంలోనే పెళ్లి అయ్యిన 56 ఏళ్ల రవిశాస్త్రికి  సంతానం కూడా ఉంది. అయితే గత కొన్నేళ్లుగా భార్య రితూ సింగ్‌కు రవిశాస్త్రి దూరంగా ఉంటున్నట్లు, విడాకులు తీసుకున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే భారత హెడ్‌కోచ్‌, నిమ్రత్‌ కౌర్‌ ప్రేమ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో రవిశాస్త్రి 1980 నాటి ప్రేమ కథల మరోసారి చర్చనీయాంశమైంది.

బాలీవుడ్‌ నటి అమ్రితా సింగ్‌తో రవిశాస్త్రి తొలిసారి ప్రేమలో పడ్డారు. ఓ మ్యాగజైన్‌ కవర్‌ ఫొటోకు వీరిద్దరు ఫోజివ్వడంతో దేశం మొత్తం వీరి గురించే గుసగుసలాడింది. 1986లో వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఈ జంట పెళ్లి పీటలెక్కలేకపోయింది. వారి పెళ్లి ఓ కలగానే మిగిలిపోయింది. ఓ సందర్భంలో.. ’ఓ నటిని నేను భార్యగా కోరుకోను. నేను ఆవేశపరుడిని. నా సతీమణికి తన ఇళ్లే తొలి ప్రాధాన్యంగా ఉండాలి.’  అని రవిశాస్త్రి వ్యాఖ్యానించగా.. దీనికి అమ్రితా సింగ్‌ బదులిస్తూ.. ’ప్రస్తుత తరుణంలో నా కెరీర్‌తో బిజీగా ఉన్నాను. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ మంచి భార్యగా, తల్లిగా మారుతానని’ తెలిపారు. అనంతరం కొన్నిరోజులకే వారి ప్రేమకు ఎండ్‌కార్డ్‌ పడింది. 1990లో రవిశాస్త్రి రితూను పెళ్లి చేసుకోగా.. 1991లో అమ్రితాను సైఫ్‌ అలిఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement