Sara Ali Khan Reveals About Her Future Husband Qualities In Live - Sakshi
Sakshi News home page

Sara Ali Khan: కాబోయే భర్తపై హీరోయిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇల్లరికం వస్తేనే పెళ్లి

Published Mon, Jan 3 2022 5:28 PM | Last Updated on Mon, Jan 3 2022 9:02 PM

Sara Ali Khan Said About Her Future Husband Where He Will Live - Sakshi

Sara Ali Khan Said About Her Future Husband Where He Will Live: బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీ ఖాన్‌ నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'కేదరినాథ్‌'తో హీరోయిన్‌గా తెరంగ్రేటం చేసిన సారా 'లవ్‌ ఆజ్‌కల్‌', 'కూలీ నం 1'లో నటించింది. ఇటీవల విడుదలైన 'ఆత్రంగి రే' సినిమాలో తన నటనకు ప్రశంసలు దక్కాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా తన తల్లిదండ్రులు సైఫ్ అలీ ఖాన్‌, అమృతా సింగ్‌ ఇద్దరికీ చాలా సన్నిహితంగా ఉంటుంది. తన తల్లి పెంపకానికి ఎంతగానో అలవాటు పడింది సారా. అయితే ఇటీవల ఆత్రంగి రే సక్సేస్‌ మీట్‌లో పాల్గొన్న సారాకు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది సారా అలీ ఖాన్‌. 

'నాకు మా అమ్మే సర్వస‍్వం. ఆమెతో ఉండటమే నాకు సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో నాకు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం రాదు. ఇప్పటికీ నా తల్లి సహాయం లేకుండా మ్యాచింగ్‌ బ్యాంగిల్స్‌, దుస్తులను వేసుకోలేను. ఇలా ఇంటర్వ‍్యూలకు సైతం అటెండ్‌ కాలేను. నేను ఎక్కడికి వెళ్లినా తిరిగి వచ్చేది మా అమ్మ దగ్గరికే. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆమె చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. తాను ఎప్పుడూ అలాగే ఉంటుందని భావిస్తున్నా. నా తండ్రి బలమైన, అధునాతన మనిషి. భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకుంటే నేను మా అమ్మతో కలిసి జీవించగలిగే వ్యక్తినే వివాహం చేసుకుంటాను (ఇల్లరికం). నేను ఆమెను ఎప్పటికీ విడిచిపెట్టను. ఇల్లరికాన్ని ఒప్పుకునే వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను.' అని సారా తెలిపింది. 



ఇదీ చదవండి: అలియా భట్‌ నవ్వు.. నెటిజన్ల ట్రోలింగు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement