ఓ తీపికబురు చెప్పిన హీరో | Saif Ali Khan confirms wife Kareena Kapoor pregnancy | Sakshi
Sakshi News home page

ఓ తీపికబురు చెప్పిన హీరో

Published Sat, Jul 2 2016 3:22 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

ఓ తీపికబురు చెప్పిన హీరో

ఓ తీపికబురు చెప్పిన హీరో

బాలీవుడ్ స్టార్‌ దంపతులు సైఫ్‌ ఆలిఖాన్, కరీనా కపూర్ ఖాన్ ఓ తీపికబురు చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా తాము ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపారు. కరీనా కపూర్ గర్భవతి అయిన విషయాన్ని కన్ఫర్మ్ చేసిన సైఫ్‌.. ‘నేను, నా భార్య ఇద్దరం కలిసి ఈ విషయం చెప్దామనుకున్నాం. డిసెంబర్‌లో మాకు తొలిబిడ్డ పుట్టబోతున్నాడు. మాకు మద్దతుగా ఉండి, ఆశీస్సులు అందించిన మా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా ఈ విషయంలో సంయమనంగా ఉన్న మీడియాకు కూడా థాంక్స్‌’ అంటూ ఓ ప్రకటనలో తెలిపారు.

కరీనా, సైఫ్‌ ఇటీవల లండన్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్‌లో కరీనా ఫొటోలు చూసిన తర్వాత.. ఆమె గర్భవతి అయి ఉండవచ్చునని కథనాలు వచ్చాయి. లండన్‌ నుంచి తిరిగొచ్చాక ఈ విషయం గురించి మీడియా కరీనాను అడుగగా ఆమె సున్నితంగా తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో ఊహాగానాలకు తెరదించుతూ సైఫ్ అధికారిక ప్రకటన విడుదల చేశాడు.

మాజీ క్రికెటర్‌ టైగర్ పటోడీ, షర్మిలా టాగోర్ తనయుడైన సైఫ్‌ 2012 అక్టోబర్‌లో కరీనాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదటి భార్య అమృతాసింగ్‌తో సైఫ్‌కు ఇద్దరు పిల్లలు- కూతురు సరా, కొడుకు సరా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement