బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముంబైలోని ఆయన స్వగృహంలో ఈ నెల 16న సైఫ్‌పై దుండగుడు దాడి చేసి, కత్తితో గాయపరచిన సంగతి తెలిసిందే. అదే రోజు అక్కడి లీలావతి హాస్పిటల్‌లో చేరిన సైఫ్ కోలుకోవడంతో వైద్యులు మంగళవారం డిశ్చార్జ్ చేశారు. వారంరోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. ప్రస్తుతం జరిగిన సంఘటనల దృష్ట్యా సైఫ్ కుటుంబం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సైఫ్‌పై దాడి చేసిన బంగ్లాదేశ్‌కి చెందిన దుండగుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు.
(ఇదీ చదవండి: చిత్ర పరిశ్రమలో ఉండటం ఇష్టం లేదు.. కారణం ఇదే: నిత్య మేనన్)
సైఫ్ అలీఖాన్ రక్షణ కోసం బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ (Ronit Roy) ఎంట్రీ ఇచ్చారు. కొన్నేళ్లుగా ముంబైలో ఆయన సెక్యూరిటీ ఏజెన్సీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సైఫ్‌ఫై దాడి జరిగిన తర్వాత వారు వెంటనే తమ కుటుంబానికి రక్షణగా వ్యక్తిగత సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సైఫ్ కుటుంబం పూర్తిగా రోనిత్ రాయ్ సెక్యూరిటీలో ఉంది. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మేం కొద్దిరోజులుగా సైఫ్‌తోనే ఉన్నాం.. ఆయన ఆరోగ్యం కుదుటపడింది. ఎలాంటి ఇబ్బంది లేదు' అని తెలిపారు.
రోనిత్ రాయ్ నటుడు మాత్రమే కాదు వ్యాపారవేత్త కూడా.. బాలీవుడ్‌లో సుమారు 50కి పైగా చిత్రాల్లో నటించిన రోనిత్ తెలుగులో కూడా పలు సినిమాల్లో కీలకపాత్రలలో కనిపించాడు. ఎన్టీఆర్ ‘జై లవకుశ’, విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాల్లో ఆయన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్‌లో 2018 థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రంలో చివరగా ఆయన కనిపించాడు. డైరెక్టర్ పూరి కోరిక మేరకు 2022లో లైగర్ సినిమాలో ఆయన నటించాడు.
జనవరి 16న సైఫ్ ఇంట్లోకి బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30) చొరబడిన సంగతి తెలిసిందే. అతడిని అడ్డుకునేందుకు సైఫ్ ప్రయత్నించగా అతనికి ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి. ఆయన చేతికి, మెడకు, వెన్నుకు తీవ్రమైన కత్తిపోటు గాయాలయ్యాయి. రక్తపు గాయాలను లెక్కచేయకుండా తన వెన్నులోకి దిగిన కత్తి ముక్కతోనే లీలావతి ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు శస్త్రచికిత్స ద్వారా ఆ కత్తిని తొలగించారు. దొంగను సైఫ్ గట్టిగా బంధించడం వల్లే కత్తితో దాడి చేసినట్లు ఒక పోలీసు అధికారి వెళ్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment