
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా తన ఆటోలోనే లీలావత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో సైఫ్‌కు ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆటో డ్రైవర్‌ను పలువురు అభినందించారు.
ఈనెల 16న సైఫ్ ఇంట్లోకి చోరీకి యత్నించిన వ్యక్తి హీరోపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే సైఫ్ ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో సైఫ్‌ను ఆటోలో ముంబయిలోని లీలావతికి తీసుకెళ్లారు భజన్ సింగ్. ఆ సమయంలో అతనెవరో తాను గుర్తు పట్టలేదన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడమే తన లక్ష‍్యంగా ఆటో నడిపినట్లు భజన్ సింగ్ వెల్లడించారు. అయితే సైఫ్ ప్రాణాలు కాపాడిన భజన్ సింగ్‌కు ముంబయికి చెందిన ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ అందించింది.
సైఫ్ ఆర్థిక సాయం..
తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు సైఫ్ అలీ ఖాన్ ఆర్థిక సాయమందించారు. తనవంతుగా రూ.50 వేలను భజన్ సింగ్ రానాకు అంద జేశారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో తనను రక్షించినందుకు అతనికి సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంతకు ముందు తన ఆటోలో వచ్చింది సైఫ్ అలీఖాన్ అని తెలియదని.. వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని భజన్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.
నిందితుడి అరెస్ట్..
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందిచతుడి ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ షరీఫుల్‌గా అతన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో పోలీసులు అతనితో పాటు సైఫ్ ఇంటికి వెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment