leelavathi hospital
-
ఆటో డ్రైవర్‌ను కలిసిన సైఫ్ అలీఖాన్.. ఎంత నగదు ఇచ్చారంటే?
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా తన ఆటోలోనే లీలావత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. సకాలంలో ఆస్పత్రికి చేరుకోవడంతో సైఫ్‌కు ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆటో డ్రైవర్‌ను పలువురు అభినందించారు.ఈనెల 16న సైఫ్ ఇంట్లోకి చోరీకి యత్నించిన వ్యక్తి హీరోపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ అలీ ఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే వెంటనే సైఫ్ ఆస్పత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో సైఫ్‌ను ఆటోలో ముంబయిలోని లీలావతికి తీసుకెళ్లారు భజన్ సింగ్. ఆ సమయంలో అతనెవరో తాను గుర్తు పట్టలేదన్నారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడమే తన లక్ష్యంగా ఆటో నడిపినట్లు భజన్ సింగ్ వెల్లడించారు. అయితే సైఫ్ ప్రాణాలు కాపాడిన భజన్ సింగ్‌కు ముంబయికి చెందిన ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ అందించింది. సైఫ్ ఆర్థిక సాయం..తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు సైఫ్ అలీ ఖాన్ ఆర్థిక సాయమందించారు. తనవంతుగా రూ.50 వేలను భజన్ సింగ్ రానాకు అంద జేశారు. ఈ సందర్భంగా ఆపద సమయంలో తనను రక్షించినందుకు అతనికి సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే అంతకు ముందు తన ఆటోలో వచ్చింది సైఫ్ అలీఖాన్ అని తెలియదని.. వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని భజన్ సింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.నిందితుడి అరెస్ట్.. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందిచతుడి ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహమ్మద్ షరీఫుల్‌గా అతన్ని గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. దీంతో పోలీసులు అతనితో పాటు సైఫ్ ఇంటికి వెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. -
ఆస్పత్రి నుంచి సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్
ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16 న ఆయనపై దొంగతనానికి వచ్చిన వ్యక్తి దాడి చేయడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన సైఫ్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. ఈనెల 16న తెల్లవారు జామున సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. హీరోపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. సైఫ్‌ను పరిశీలించిన వైద్యులు ఆయన సకాలంలో చికిత్స అందించారు. దాదాపు ఐదు రోజుల పాటు సైఫ్ ఆస్పత్రిలోనే ఉన్నారు. నిందితుడి అరెస్ట్..ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్‌గా పోలీసులు గుర్తించారు. ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన షరీఫుల్ తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకుని తిరుగుతున్నారు. కేవలం దొంగతన కోసమే అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు నిందితుడు వెల్లడించారు. పోలీసు కస్టడీ.. నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. -
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న సైఫ్.. బిల్ ఎంతో తెలుసా..?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని లీలావతి ఆసుపత్రి(Lilavati Hospital) వైద్యులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 తర్వాత ఆయన డిశ్చార్జ్ అవుతారని వారు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలిపారు. దాడిలో భాగంగా సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయం అయింది. దీంతో సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు.సైఫ్‌పై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను విచారించిన పోలీసులు క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు. ఫోరెన్సిక్ అధికారులు కూడా సైఫ్ ఇంటికి వెళ్లి దాడి జరిగిన ప్రదేశంలో నిందితుడి వేలిముద్రలు గుర్తించారు. ఇదే విషయాన్ని ఒక అధికారి కూడా ప్రకటించారు. ఇంట్లోని కిటికీలతో పాటు లోపలికి వచ్చేందుకు ఉపయోగించిన నిచ్చెనపై కూడా నిందితుడి వేలిముద్రలు ఉన్నాయన్నారు.(ఇదీ చదవండి: ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ప్రముఖ దర్శకుడు)ఈ నెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన నిందితుడు మహ్మద్ షరీఫుల్ బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు ప్రకటించారు. దాడి తర్వాత తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పట్టుకున్నట్లు వారు తెలిపారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సైఫ్ పూర్తి ఆసుపత్రి బిల్ రూ. 40 లక్షలు దాటినట్లు తెలుస్తోంది. అయితే, ఆయనకు ఇన్సూరెన్స్ ఉండటం వల్ల సదరు కంపెనీ వాళ్లు ఇప్పటి వరకు రూ.25 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది.సైఫ్‌పై దాడి జరిగిన సమయంలో అతన్ని ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా ఆ సమయంలో తండ్రితో పాటు ఉన్నాడు. అయితే, ఆటో డ్రైవర్ వారి నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపారు. కానీ, సైఫ్‌ను రక్షించినందుకు అతనికి ముంబయిలోని ఓ సంస్థ రూ.11 వేల రివార్డ్ ప్రకటించింది. సైఫ్ నేడు డిశ్చార్జ్ అయిన తర్వాత తనకు ఏమైనా సాయం చేయవచ్చని తెలుస్తోంది. -
ఆసుపత్రిలో కన్నీళ్లు పెట్టుకున్న నవనీత్, ఓదార్చిన భర్త.. వైరల్ వీడియో
ముంబై: తన భార్య నవనీత్ కౌర్ రాణా అనారోగ్య సమస్యల గురించి ఫిర్యాదు చేసినా బైకుల్లా జైలు అధికారులు కనీసం పట్టించుకోలేదని ఎంపీ రవి రాణా ఆరోపించారు. తలోజా జైలు నుంచి గురువారం రవిరాణా విడుదలయ్యారు. రవిరాణా విడుదలకు రెండుగంటల ముందు బైకుల్లా మహిళా జైలునుంచి ఆయన భార్య నవనీత్ కౌర్ రాణా విడుదలయ్యారు. గత నెల 23న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ వద్ద హనుమాన్ చాలీసా పఠిస్తామన్న వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో వీరిద్దరినీ ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, వీరిద్దరికీ బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గురువారం కొన్ని గంటల వ్యవధిలో విడుదలయ్యారు.అనంతరం నవనీత్ రాణా అనారోగ్య సమస్యలతో సబ్ అర్బన్ బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. రవిరాణా విడుదలైన వెంటనే నేరుగా లీలావతి ఆస్పత్రికి వెళ్లి భార్యను పరామర్శించారు. చదవండి: ఈ చిలుకను పట్టిస్తే రూ.5 వేలు.. ‘దయచేసి ఇచ్చేయండి ప్లీజ్’ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..గత ఆరు రోజుల నుంచి నవనీత్ ఆరోగ్యం బాగోలేదని బైకులా జైలు అధికారులకు ఫిర్యాదు చేసిందని, అయితే కనీసం జైలు అధికారులెవరూ ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వెళ్లిన వారిలో రవిరాణాతో పాటు బీజేపీ నేత కృతి సోమయ్య వెంట ఉన్నారు. కాగా, వార్డులో నవనీత్‌రాణా కంటతడి పెడుతండగా.. ఆమెను పట్టుకుని ఓదారుస్తూ రవిరాణా ఏడుస్తున్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. pic.twitter.com/0Al31eJkCy — Navneet Ravi Rana (@navneetravirana) May 5, 2022 -
అభిషేక్‌కు గాయాలు.. హాస్పిటల్‌కు రాని ఐశ్వర్యరాయ్?
ముంబై : ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గాయాలపాలైనట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట ఓ సినిమా షూటింగ్లో జరిగిన ప్రమాదంలో ఆయన చేతికి గాయమైంది. తాజాగా ఆ గాయం మరోసారి తిరగబడటంతో ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా కూతురు శ్వేతా బచ్చన్‌తో కలిసి అమితాబ్ బచ్చన్ లీలావతి హాస్పిటల్‌కు వెళ్లారు. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అభిషేక్ బచ్చన్ మరోవైపు అభిషేక్‌ను పరామర్శించడానికి ఐశ్వర్య హాస్పిటల్‌కు రాకపోవడం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆమె మణిరత్నం డైరెక్షన్లో పొన్నియన్ సెల్వం అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ఉన్న ఐశ్వర్య ఆదివారం రాత్రి ముంబైకి చేరుకుంది. కాగా ప్రస్తుతం అభిషేక్ బాబ్ బిస్వాస్, దాస్వి చిత్రాల్లో నటిస్తున్నారు. చదవండి: 'ఓ హీరోను టార్గెట్ చేసి బెదిరించడం కరెక్ట్ కాదు' షాకింగ్: నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో లీక్, స్పందించిన నటి -
నటుడు దిలీప్‌కుమార్ సోదరుడు మృతి
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ సోదరుడు అస్లాంఖాన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కరోనా సోకడంతో పాటు ఇంతకుముందే బీపీ, షుగర్, గుండెజబ్బు లాంటి అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి మరణించారు. గతవారం దిలీప్‌కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్లు కోవిడ్ లక్షణాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ కరోనా ఉన్నట్లు నిర్దారణ కావడంతో వెంటనే కరోనా వార్డుకు తరలించి చికిత్స అందించారు. అప్పటికే శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో పాటు వారి ఆక్సిజన్ లెవల్స్ కూడా 80% కంటే తక్కువగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించామని, వయసు పైబడటం, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి అస్లాం ఖాన్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇషాన్ ఖాన్ వయసు 90 సంవత్సరాలు కాగా, అస్లాం ఆయన కంటే చిన్నవాడని తెలిపారు. (రియా, మహేష్ భట్ల వాట్సాప్ చాట్ వైరల్) -
ప్లాస్మా చికిత్స ఫెయిల్.. వ్యక్తి మృతి
ముంబై : మహారాష్ట్రలో తొలిసారిగా ప్లాస్మా చికిత్స ప్రయోగించిన 53 ఏళ్ల వ్యక్తి బుధవారం అర్థరాత్రి మరణించారు. వివరాల ప్రకారం.. కరోనా కారణంగా ఓ వ్యక్తి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరగా, ప్లాస్మా చికిత్స అందించారు. కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన 200 మి.లీ. ప్లాస్మాను అందించి ట్రీట్మెంట్ కొనసాగించారు. మొదట్లో కోలుకుంటున్నట్లు అనిపించినా, తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. 24 గంటల్లోనే పరిస్థితి విషమించి ఆ వ్యక్తి చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఇది వరకే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి ప్రకారమే ప్లాస్మా చికిత్స చేశామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌తోపే తెలిపారు. బివైఎల్ నాయర్ ఆసుపత్రిలో మరో కరోనా రోగికి ప్లాస్మా చికిత్స చేస్తున్నామని, అది విజయవంతమవుందని ఆశిస్తున్నట్లు వెల్లడించిన కొద్ది గంటల్లోనే మొదటి ప్లాస్మా చికిత్స తీసుకుంటున్న వ్యక్తి మరణించడం గమనార్హం. అయితే ప్లాస్మా చికిత్స ప్రయోగిస్తున్న ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో సత్పలితాలు వస్తున్నాయి. కాబట్టి మరికొంత మందిపై ప్రయోగాల కోసం ఐసీఎంఆర్‌ను అనుమతి కోరిన సంగతి తెలిసిందే. కోవిడ్ నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులైన వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. అది కూడా వారి ఇష్టప్రకారం అయితేనే. 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని నిర్ధారణ అయితేనే వారి నుంచి ప్లాస్మా సేకరిస్తారు. కేవలం ప్లాస్మా కణాలు మాత్రమే సేకరించడం వల్ల దాతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారి శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ను చంపే యాంటిబాడీస్ ప్లాస్మాలో పుష్కలంగా ఉంటాయి. ఒక దాత నుంచి 400 నుంచి 800 ఎంఎల్ ప్లాస్మా కణాలు సేకరించే అవకాశం ఉంది. వీటి ద్వారా కనీసం నలుగురు కరోనా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. (కనికా కపూర్ సంచలన నిర్ణయం ) -
నటి లీలావతి ఆస్పత్రికి తాళం
కర్ణాటక, దొడ్డబళ్లాపురం : దక్షిణ భారత సీనియర్ నటి లీలావతి పేదల కోసం నిర్మించిన ఉచిత ఆస్పత్రిని టీహెచ్ఓ మౌలిక సదుపాయాలు లేవనే సాకుతో మూసివేసిన సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. సీనియర్ నటి లీలావతి, ఆమె కుమారుడు, కన్నడ సినీ హీరో నోద్రాజ్ ఇద్దరూ కలిసి నెలమంగల సమీపంలోని సోలదేనహళ్లి వద్ద 2009లో పేద ప్రజల కోసం సొంత స్థలంలో సొంత నిధులతో ఉచిత ఆస్పత్రిని నిర్మించారు. అయితే అప్పటి ప్రభుత్వం ఆస్పత్రి నిర్వహణ చూసుకుంటామని స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఈ ఆస్పత్రి వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దూర ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు వెళ్లే బాధ తప్పడంతోపాటు, దగ్గరలోనే ఉచిత వైద్యం లభించింది. అయితే నెలమంగల టీహెచ్ఓ హరీష్ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు లేవనే కారణం చూపి గురువారం ఆస్పత్రికి తాళంవేసి మూసివేయించడంతోపాటు ప్రభుత్వం నియమించిన వైద్యులు, వైద్య సిబ్బందిని వెనక్కు తీసుకున్నారు. సమాచారం అందుకున్న వినోద్‌రాజ్.. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కరిగౌడను కలిసి ఆస్పత్రిని తిరిగి తెరవాలని కోరారు. పేదల కోసం తన తల్లి లీలావతి ఎంతో శ్రమతో ఆస్పత్రిని కట్టించారన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిపోయి ఆస్పత్రి మూసివేయడం బాధాకరమని వినోద్‌రాజ్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. -
కుదుటపడ్డ దిలీప్‌కుమార్.. నేడు డిశ్చార్జి
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ (93) ఆరోగ్యం కుదుటపడింది. శ్వాసకోశ సమస్యలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన ఆయనను బుధవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నారు. ఏప్రిల్ 15న ఆయన ఆస్పత్రిలో చేరారు. సాయంత్రం 4 గంటలకు ఆయనను డిశ్చార్జి చేస్తామని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ జలీల్ పార్కర్ తెలిపారు. ట్రాజెడీ కింగ్‌గా పేరున్న దిలీప్‌కుమార్ తీవ్రమైన జ్వరం, ఛాతీలో ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన భార్య, అలనాటి హీరోయిన్ సైరా బాను అంతకుముందు చెప్పారు. దిలీప్ కుమార్ అసలుపేరు యూసుఫ్ ఖాన్. ఆయన ఆరు దశాబ్దాల పాటు బాలీవుడ్ తెరను ఏలారు. చిట్టచివరగా 1998లో ఖిలా సినిమాలో నటించారు. 1994లో దాదాసాహెబ్ ఫాల్కే, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి.