ముంబయిలోని లీలావతి ఆస్పత్రి నుంచి సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయ్యారు. ఈనెల 16 న ఆయనపై దొంగతనానికి వచ్చిన వ్యక్తి దాడి చేయడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజులు పాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన సైఫ్ ఇంటికి చేరుకున్నారు.
కాగా.. ఈనెల 16న తెల్లవారు జామున సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగింది. ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. హీరోపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. సైఫ్‌ను పరిశీలించిన వైద్యులు ఆయన సకాలంలో చికిత్స అందించారు. దాదాపు ఐదు రోజుల పాటు సైఫ్ ఆస్పత్రిలోనే ఉన్నారు.
నిందితుడి అరెస్ట్..
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్‌గా పోలీసులు గుర్తించారు. ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించిన షరీఫుల్ తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకుని తిరుగుతున్నారు. కేవలం దొంగతన కోసమే అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించినట్లు నిందితుడు వెల్లడించారు.
పోలీసు కస్టడీ..
నిందితుడిని అరెస్ట్ చేసిన కోర్టులో హాజరు పరచగా పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఐదు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment