
దిలీప్‌కుమార్ సోదరుడు అస్లాంఖాన్
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ సోదరుడు అస్లాంఖాన్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కరోనా సోకడంతో పాటు ఇంతకుముందే బీపీ, షుగర్, గుండెజబ్బు లాంటి అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి మరణించారు. గతవారం దిలీప్‌కుమార్ సోదరులు అస్లాంఖాన్, ఇషాన్ ఖాన్‌లు కోవిడ్ లక్షణాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ కరోనా ఉన్నట్లు నిర్దారణ కావడంతో వెంటనే కరోనా వార్డుకు తరలించి చికిత్స అందించారు.
అప్పటికే శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో పాటు వారి ఆక్సిజన్ లెవల్స్ కూడా 80% కంటే తక్కువగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించామని, వయసు పైబడటం, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉండటంతో పరిస్థితి విషమించి అస్లాం ఖాన్ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇషాన్ ఖాన్ వయసు 90 సంవత్సరాలు కాగా, అస్లాం ఆయన కంటే చిన్నవాడని తెలిపారు. (రియా, మహేష్ భట్‌ల వాట్సాప్ చాట్ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment