ముంబై : ప్రముఖ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ గాయాలపాలైనట్లు సమాచారం. కొన్ని రోజుల కిందట ఓ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో ఆయన చేతికి గాయమైంది. తాజాగా ఆ గాయం మరోసారి తిరగబడటంతో ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.
ఇదిలా ఉండగా కూతురు శ్వేతా బచ్చన్‌తో కలిసి అమితాబ్ బచ్చన్ లీలావతి హాస్పిటల్‌కు వెళ్లారు. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో అభిషేక్ బచ్చన్ మరోవైపు అభిషేక్‌ను పరామర్శించడానికి ఐశ్వర్య హాస్పిటల్‌కు రాకపోవడం ఏంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ఆమె మణిరత్నం డైరెక్షన్‌లో పొన్నియన్ సెల్వం అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్న ఐశ్వర్య ఆదివారం రాత్రి ముంబైకి చేరుకుంది. కాగా ప్రస్తుతం అభిషేక్ బాబ్ బిస్వాస్, దాస్వి చిత్రాల్లో నటిస్తున్నారు.
చదవండి: 'ఓ హీరోను టార్గెట్ చేసి బెదిరించడం కరెక్ట్ కాదు'
షాకింగ్: నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో లీక్, స్పందించిన నటి
Comments
Please login to add a commentAdd a comment