security increased
-
చిరాగ్ పాశ్వాన్‌కు జెడ్– కేటగిరీ భద్రత
న్యూఢిల్లీ/పాట్నా: ఎన్డీయే కీలక భాగస్వామి, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆయనకు జెడ్– కేటగిరీ భద్రత కల్పించింది. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు ఇప్పటిదాకా శశస్త్ర సీమాబల్‌కు చెందిన చిన్న బృందం రక్షణ కల్పించేది. 41 ఏళ్ల చిరాగ్ పాశ్వాన్.. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు కూడా. లోక్ జనశక్తి బిహార్‌లో బీజేపీ, జేడీయూలతో పొత్తుపెట్టుకొని పోటీచేసిన ఐదు లోక్‌సభ స్థానాలను నెగ్గిన సంగతి తెలిసిందే. -
హైడ్రా దూకుడు.. కమిషనర్ ఏవీ రంగనాథ్ భద్రత పెంపు
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. మధురానగర్ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు. నగరంలో చెరువులు, కుంటల్లో అక్రమ కట్టడాల తొలగింపును వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయనకు ఏమైనా ముప్పు ఏర్పడవచ్చనే అనుమానంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.కాగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలను కూల్చివేస్తూ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది హైడ్రా. అక్రమ నిర్మాణదారులంతా ఎక్కడ బుల్డోజర్ తమ వైపునకు వస్తుందోనని భయంతో హడలెత్తిపోతున్నారు నగరంలో అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కూల్చివేతల్లో వెనక్కి తగ్గని హైడ్రా అధికారులు.. సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూడా నేలమట్టం చేశారు. మరోవైపు హైడ్రా చేస్తున్న పనుల మీద దుమారం కూడా రేగుతోంది. -
లోపభూయిష్టంగా జగన్ భద్రత.. అంగీకరించిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి,అమరావతి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భద్రత విషయంలో లోపభూయిష్టంగా వ్యవహరించిన విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకుంది. ఆయనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించింది.తన భద్రతా కుదింపుపై జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. ఉదయం వాదనలు జరగ్గా.. జగన్ భద్రత విషయంలో రాజీ పడొద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే.. మధ్యాహ్నాం తిరిగి వాదనల సమయంలో అడ్వొకేట్ జనరల్ వివరణ ఇస్తూ.. ‘‘స్పేర్ పార్ట్స్ కు ఆర్డర్ ఇచ్చాం అవి ఇంకా రాలేదు. కాబట్టి ఆయన కోసం మరొక వాహనాన్ని ఏర్పాటు చేస్తాం. ఎక్కడ రిమోట్ కంట్రోల్ ద్వారా జగన్మోహన్రెడ్డికి ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉంటుందో గుర్తించి.. అక్కడ జామర్లు ఏర్పాటు చేస్తాం’’ అని పేర్కొన్నారు.దీంతో రెండు వారాల్లో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశించిన న్యాయస్థానం.. మూడు వారాల్లో పిటిషనర్‌ను కూడా రీజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించింది.అంతకు ముందు ఈ ఉదయం విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాన మంత్రులకు ముఖ్యమంత్రులకు ఏ విధమైన భద్రత కల్పిస్తారో అదే విధంగా మాజీ సీఎం అయిన జగన్‌కు భద్రత కల్పించేట్టు చూడాలని, భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారాయన. ‘‘వైఎస్ జగన్‌కు మంచి బుల్లెట్ ఫ్రూఫ్ వాహనం ఇవ్వొచ్చు కదా.. ఎందుకు ఇవ్వడం లేదు. జామర్ ఏర్పాటుపై మధ్యాహ్నం లోపు స్పష్టత ఇవ్వాలి. భద్రతపై అధికారులతో మాట్లాడి వివరణ ఇవ్వాలి’’ అని అడ్వకేట్ జనరల్‌ను ఆయన ఆదేశించారు. -
‘మివాకీ’ కన్వెన్షన్‌కు ట్రంప్.. అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్న రిపబ్లికన్ పార్టీ
వాషింగ్టన్: కాల్పుల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్కాన్సిన్లోని మివాకీ పట్టణానికి చేరుకున్నారు. మివాకీలో సోమవారం(జులై 15) నుంచి నాలుగు రోజుల పాటు రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ జరగనుంది. ఈ సమావేశాల్లోనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ను అధికారికంగా నామినేట్ చేస్తారు. కాల్పుల నేపథ్యంలో మివాకీ సమావేశాల వేదిక వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పెన్సిల్వేనియాలో శనివారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి బుల్లెట్ తగిలి రక్తం చిందింది. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌ను అక్కడినుంచి తరలించారు. దుండగుడిని కాల్చి చంపారు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
59th Raising Day : పాక్, బంగ్లా సరిహద్దుల్లో పటిష్ట భద్రత
హజారీబాగ్: భారత్–పాకిస్తాన్, భారత్–బంగ్లాదేశ సరిహద్దుల్లో అత్యంత పటిష్టమైన భద్రత కల్పించబోతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో సరిహద్దులను దుర్భేద్యంగా మార్చబోతున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో అసంపూర్తిగా ఉన్న 60 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. శుక్రవారం జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) 59వ రైజింగ్ డే వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. జవాన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదేళ్లలో భారత్–పాకిస్తాన్, భారత్–బంగ్లాదేశ సరిహద్దుల్లో 560 కిలోమీటర్ల మేర కంచె నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన కంచెలో అక్కడక్కడా ఖాళీలు ఉండేవని, ఆ ఖాళీల గుండా చొరబాటుదారులు, స్మగ్లర్లు సులభంగా మన దేశంలోకి ప్రవేశించేవారని గుర్తుచేశారు. ఆ ఖాళీల్లోనూ కంచె నిర్మాణం పూర్తయ్యిందని, తూర్పు, పశి్చమ సరిహద్దుల్లో మరో 60 కిలోమీటర్లే కంచె ఏర్పాటు చేయాల్సి ఉందని వివరించారు. -
చైనా, పాక్ సరిహద్దుల్లో హెరాన్ మార్క్–2 డ్రోన్లు మోహరింపు
న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయడానికి భారత వాయుసేన పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన అత్యంత శక్తిమంతమైన హెరాన్ మార్క్–2 సాయుధ డ్రోన్లు నాలుగింటిని ఉత్తర సెక్టార్ సరిహద్దు స్థావరాల్లో మోహరించింది. హెరన్ మార్క్–2 డ్రోన్లు సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే సామర్థం్య కలిగిన క్షిపణులు, ఇతర ఆయుధ సంపత్తిని మోసుకుపోగలవని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్ల మోహరింపుతో సరిహద్దుల్లో నిఘా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ‘హెరాన్ మార్క్ 2 డ్రోన్లు అత్యంత శక్తిమంతమైనవి. గంటల తరబడి గాల్లో ఎగిరే సామర్థ్యం, సుదూర ప్రాంతాల్లో ఏం జరుగుతోందో పసిగట్టే టెక్నాలజీ ఉండడం వల్ల పాక్, చైనా సరిహద్దుల్లో నిఘా మరింత పటిష్టం కానుంది’ అని డ్రోన్ స్క్వాడ్రన్ వింగ్ కమాండర్ పంకజ్ రాణా చెప్పారు. ప్రత్యేకతలు ఇవీ ► ప్రతికూల వాతావరణ పరిస్థితులు న్నప్పటికీ హెరెన్ మార్క్–2 డ్రోన్లు ఏకబిగిన 36 గంటలు ప్రయాణం చేయగలవు. అంటే ఈ డ్రోన్లు ఒకేసారి పాకిస్తాన్, చైనాలను కూడా చుట్టేసి రాగలవు. ► డ్రోన్లలో ఉండే లేజర్ సుదూర ప్రాంతంలో ఉండే శత్రు దేశాల లక్ష్యాలను గుర్తించగలవు. దీంతో మన క్షిపణులు వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. ► ఎంత దూరంలోనున్న లక్ష్యాలనైనా గుర్తించడం, సుదీర్ఘంగా గాల్లో ఎగిరే సామర్థ్యం ఉండడం వల్ల ఇవి ఎక్కడికైనా వెళ్లి ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగలవు. ► ఈ డ్రోన్లు ఉపగ్రహంతో అనుసంధానం అయి ఉండడం వల్ల ఎక్కడ నుంచైనా వీటిని ఆపరేట్ చేసే సదుపాయం ఉంది. -
TTD: తిరుమల నడకమార్గంలో హైఅలర్ట్ జోన్ ప్రకటన
సాక్షి, తిరుమల: తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతిచెందిన బాలిక ఘటనపై టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్‌ను ప్రకటించింది. భక్తులకు భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది టీటీడీ. తిరమలకు వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ 100 మంది భక్తుల గుంపుని మాత్రమే అనుమాతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. భక్తులకు ముందువైపు, వెనుకవైపు రోప్‌లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు పైలట్‌గా సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నారు. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని అన్నారు. అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నడకమార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. టీటీడీ నుంచి రూ.5లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక, బాలికపై చిరుత దాడి ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. నడకదారి భక్తులకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. చిరుత కోసం అటవీశాఖ అధికారులు నడకదారిలో మూడు బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కుకునే ప్రాంతాలను అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. ఇది కూడా చదవండి: అయ్యా పవనూ.. ఊహించలే.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? -
కంప్యూటర్ల దిగుమతిపై నియంత్రణ
న్యూఢిల్లీ: దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు, భద్రతాపరమైన కారణాల రీత్యా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు అలాగే కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్రం గురువారం నియంత్రణలు విధించింది. చైనా, కొరియా వంటి దేశాల నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. నియంత్రణలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇకపై ఈ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు దిగుమతిదారులు ప్రభుత్వం నుంచి అనుమతి, లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నియంత్రణల విధింపునకు పలు కారణాలు ఉన్నప్పటికీ పౌరుల భద్రతను పరిరక్షించడం అన్నింటికన్నా ప్రధానమైనదని ఆయన వివరించారు. ఆంక్షలు విధించడమనేది దిగుమతులను పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో తీసుకున్నది కాదని, వాటిని నియంత్రించడం మాత్రమే లక్ష్యమని చెప్పారు. దీనివల్ల దేశీయంగా ధరలేమీ పెరగబోవని తెలిపారు. కొన్ని మినహాయింపులు ఉంటాయి.. ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్–ఇన్–వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా చిన్న స్థాయి కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే నియంత్రణలు అమల్లోకి వస్తాయి‘ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. ఆగస్టు 3 కన్నా ముందుగానే లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసిన కన్సైన్మెంట్లను దిగుమతి చేసుకోవచ్చని వివరించింది. ఆగస్టు 4 నుంచి దిగుమతిదారు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే ఆర్అండ్డీ, టెస్టింగ్, రిపేర్ అండ్ రిటర్న్ తదితర అవసరాల కోసం కన్సైన్మెంట్కు 20 ఐటమ్‌ల వరకు దిగుమతి చేసుకునేందుకు లైసెన్సు తీసుకోనక్కర్లేదని వివరించింది. ఈ–కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుగోలు చేసే ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పీసీ, లేదా అల్ట్రా స్మాల్ ఫారం ఫ్యాక్టర్ కంప్యూటర్లకు కూడా మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, వాటికి వర్తించే సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతులపై ఆంక్షల వల్ల దేశీయంగా ఆయా ఉత్పత్తుల రేట్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. బిలియన్ డాలర్ల కొద్దీ దిగుమతులు.. 2022–23లో భారత్ 5.33 బిలియన్ డాలర్ల విలువ చేసే పర్సనల్ కంప్యూటర్లు .. ల్యాప్‌టాప్‌లను, 553 మిలియన్ డాలర్ల విలువ చేసే ప్రత్యేక డేటా ప్రాసెసింగ్ మెషీన్లను దిగుమతి చేసుకుంది. భారత్‌లో ఎక్కువగా హెచ్‌సీఎల్, డెల్, ఎల్జీ ఎల్రక్టానిక్స్, లెనొవొ, యాపిల్, హెచ్‌పీ, శాంసంగ్ తదితర ఎల్రక్టానిక్ దిగ్గజాల ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. భారత్ ఈ తరహా ఉత్పత్తులను ఏటా 7–8 బిలియన్ డాలర్ల మేర దిగుమతి చేసుకుంటోంది. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం భారత్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వాటిల్లో 65 శాతం వాటా ఎల్రక్టానిక్స్, యంత్రాలు, ఆర్గానిక్ రసాయనాలు ఉంటున్నాయి. రోజువారీ ఉపయోగించే మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, సోలార్ సెల్ మాడ్యూల్స్ మొదలైన వాటి కోసం ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి ఉంటోంది. దీన్ని తగ్గించుకునే దిశగా దేశీయంగా ఎల్రక్టానిక్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. -
ఈటల, అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: తెలంగాణలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజురాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఈటల రాజేందర్‌కు కేంద్రం వై ప్లస్, అర్వింద్‌కు వై కేటగిరి సెక్యూరిటీ కేటాయించింది. ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కూడా భద్రత కల్పించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్‌కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి సీఆర్పీఎఫ్ అధికారులు చేరుకున్నారు. కేంద్రం భద్రత పెంపుపై అర్వింద్ స్పందిస్తూ.. వై కేటగిరీ సెక్యురిటీ కేటాయింపుపై సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తనకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. తనపైపై పదే పదే దాడులు జరిగిన తర్వాత రిటైర్డ్ ఎన్ఎస్జీతో ప్రైవేట్ సెక్యురిటీ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. భద్రత లోపలపై అధికారులు తన వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కాగా ఇప్పటికే ఈటల రాజేందర్‌కు తెలంగాణ సర్కార్ వై ప్లస్ భద్రత కల్పించిన విషయం తెలిసిందే ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన హత్యకు ప్లాన్ జరుగుతోందంటూ వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. చదవండి: ఆ ఫలితం నమ్మితే మోదీ భ్రమపడ్డట్టే! కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసే ‘బండి’ తొలగింపు ఎందుకు? -
ఈటల నివాసానికి పోలీసులు.. భద్రతపై చర్చ
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి డీసీసీ సందీప్ రావు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఈటల భద్రత అంశంపై ఆయనతో సమావేశమై అరగంట పాటు చర్చించారు. అనంతరం, ఈటల ఇంటి నుంచి డీసీపీ వెళ్లిపోయారు. ఇక, వీరి భేటి నేపథ్యంలో ఈటల భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్‌కు నివేదిక ఇవ్వనున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ చెప్పిన అంశాలను డీజీపీ వివరిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఈటల ఇంటి పరిసరాలను అధికారులు నిన్న(బుధవారం) పరిశీలించారు. అయితే, ఈటల భద్రతను సమీక్షించాలని మంత్రి కేటీఆర్.. డీజీపీని ఆదేశించారు. దీంతో, రాజేందర్ భద్రత పెంపుపై డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సమీక్ష జరిగింది. మరోవైపు.. తన హత్యకు కుట్ర జరుగుతోందని, ప్రాణహాని ఉందని ఈటల ఇప్పటికే తెలిపారు. ఈ క్రమంలో ఈటలకు కేంద్రం వై కేటగిరి భద్రత పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇది కూడా చదవండి: ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్ -
సౌరవ్ గంగూలీకి భద్రత పెంపు
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి భద్రత పెంచాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. గంగూలీకి ప్రస్తుతమున్న 'వై' కేటగిరీ భద్రత పదవీకాలం మే 16తో ముగియడంతో మమతా సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదా భద్రతను 'వై' నుంచి 'జెడ్' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు మమతా సర్కార్ నిన్న అధికారికంగా వెల్లడించింది. వై కేటగిరీ భద్రత ప్రకారం గంగూలీ నివాసం వద్ద ముగ్గురు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారులు, ముగ్గురు లా ఎన్‌ఫోర్సర్స్ (చట్టాన్ని అమలు చేసేవారు) ఉండేవారు. జెడ్ కేటగిరీ భద్రత ప్రకారం ఇకపై గంగూలీ భద్రత దళం సంఖ్య ఎనిమిది నుండి పది మంది పోలీసు అధికారులతో (24 గంటల పాలు) కూడినది ఉండనుంది. గంగూలీ ప్రస్తుతం ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, గంగూలీ సేవలందిస్తున్న ఢిల్లీ జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రదర్శనను కనబరుస్తూ అధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ సీజన్ ప్రారంభానికి ముందు రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో అతని స్థానంలో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా నియమించారు. వార్నర్ వ్యక్తిగతంగా రాణించినా.. మిగతా ఆటగాళ్లంతా విఫలం కావడంతో డీసీకి ఈ గతి పట్టింది. చదవండి: నీకు బౌన్సర్లు వేయడం మాత్రమే వచ్చా? నాపై రాహుల్ సీరియస్ అయ్యాడు: సిరాజ్ -
యూపీ సీఎం యోగి ఇంటి వద్ద హైఅలర్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఫేక్ ప్రచారం కలకలం సృష్టించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద బాంబు ఉందంటూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. పోలీసులు హై అలర్ట్ అయ్యారు. సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వివరాల ప్రకారం.. ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేసి సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారిక నివాసం వద్ద బాంబు ఉందని తెలిపాడు. దీంతో, వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబు నిర్వీర్య స్క్వాడ్‌తో రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బాంబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. బాంబు దొరక్కపోయినప్పటికీ పోలీసులు.. సీఎం యోగి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతరం, ఫోన్ కాల్ చేసిన ఆగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. Security upped outside UP CM Yogi Adityanath's Lucknow residence after bomb scare pic.twitter.com/vWpSmxqe8n — Times No1 (@no1_times) February 17, 2023 -
తమిళనాడు: అన్నామలైకు జెడ్ కేటగిరి భద్రత
సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు జెడ్‌కేటగిరి భద్రతకు కేంద్రం ఆదేశించింది. ఆయనకు ఇద్దరు ప్రత్యేక భద్రతాధికారులతో పాటు పది మంది సీఆర్పీఎఫ్ బృందంతో ప్రత్యేక భద్రతకు చర్యలు చేపట్టారు. ఈయన కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ 2019లో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత సూపర్‌స్టార్ రజనీకాంత్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపించారు. అయితే పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని రజనీకాంత్ విరమించుకోవడంతో వ్యవసాయం చేసుకుంటానని అన్నామలై ప్రకటించారు. చివరకు బీజేపీలో చేరారు. తొలుత కరూర్ జిల్లా రాజకీయాలకు పరిమితమయ్యారు. 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయన్ను వరించింది. అప్పటి నుంచి దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు. సొంత పారీ్టలోనూ అన్నామలైకు వ్యతిరేకత ఉన్నా, వాటిని ఏ మాత్రం ఖాతరు చేయకుండా బలోపేతం లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. సీనియర్లందరిని పక్కన పెట్టి, యువతరానికి పెద్ద పీట వేస్తున్నారు. అధికార డీఎంకే, వారి మిత్రపక్షాలతో వైర్యం పెంచుకోవడమే కాకుండా నిత్యం మాటల తూటాలను పేల్చుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల పరిణామాలతో భద్రత పెంపు ఇటీవల బీజేపీతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అన్నామలైకు భద్రత కల్పించాల్సిన అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఆయనకు జెడ్ కేటగిరి భద్రత కల్పించే విధంగా కేంద్రం శుక్రవారం ఆదేశించింది. ఆయనకు భద్రతగా ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించేందుకు నిర్ణయించింది. అలాగే, పది మంది సీఆర్పీఎఫ్ బృందం నిత్యం భద్రతా విధుల్లో ఉండబోతోంది. ఇకపై తుపాకీ నీడలో అన్నామలై పర్యటనలు జరగనున్నాయి. ఆయన భద్రతను కేంద్రం పర్యవేక్షించనుంది. -
తెలంగాణ భవన్ వద్ద పోలీస్ బందోబస్తు
-
తగ్గేదేలే అంటున్న బీజేపీ.. తెలంగాణభవన్ వద్ద హైటెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. పొలిటికల్ నేతలు, కార్యకర్తల దాడులు, ఆరోపణలతో పాలిటిక్స్ వేడెక్కాయి. దీంతో, దాడి చేసిన వారిపై బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. టీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డితో పాటు మరో 8 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. కాగా, బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ సిద్దమైంది. టీఆర్ఎస్ దాడిని సీరియస్‌గా తీసుకున్న బీజేపీ ఆందోళనలు చేపట్టింది. టీఆర్ఎస్ దాడులను తిప్పికొట్టాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. కాగా, బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ భవన్ ముట్టడించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేసి భద్రతను పెంచారు. మరోవైపు.. దాడి ఘటన అనంతరం ఎంపీ అరవింద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీనియర్ నేత బీఎల్ సంతోష్ ఫోన్ చేసి మాట్లాడారు. దాడి ఘటన గురించి ఆరా తీశారు. మరోవైపు.. తెలంగాణలో పలుచోట్లు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కవిత డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్లకార్డులను మంటల్లో కాల్చివేశారు. -
HYD: మోదీ పర్యటన.. ఫేస్బుక్లో పోస్ట్ కలకలం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా పాతబస్తీలో మాజిద్ అట్టర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, నుపుర్ శర్మ ఘటనపై అట్టర్.. ఫేసుబుక్‌లో పోస్ట్ పెట్టడం కలకలం సృష్టించింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలకు ఆర్ఎస్ఎస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలని మాజిద్ డిమాండ్ చేశాడు. లేకపోతే నిరసనలకు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని సోషల్ మీడియా పోస్టులో రాసుకొచ్చాడు. దీంతో, రంగంలోకి దిగిన మొఘల్‌పురా పోలీసులు మాజిద్ అట్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసులు నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు. ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఆంక్షలు విధించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. నోవాటెల్, పరేడ్ గ్రౌండ్, రాజ్‌భవన్ పరిసరాల్లో నో ఫ్లైయింగ్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌పై నిషేధం విధించారు. ఇదిలా ఉండగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ జూలై 2న సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా సమావేశం జరిగే హెచ్ఐసీసీ ప్రాంగణానికి వస్తారు. సమావేశం తర్వాత పక్కనే ఉన్న నోవాటెల్ హోటల్లో బసచేస్తారు. బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం 1వ తేదీ నుంచి 3వ తేదీ దాకా ఈ హోటల్ మొత్తాన్ని బుక్ చేశారని హోటల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇది కూడా చదవండి: నోవాటెల్‌లోనే మోదీ బస! -
‘యాంటీలియా ఎక్కడ ఉంది’.. అంబానీ ఇంటికి భద్రత పెంపు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ఇల్లు ‘యాంటీలియా’కు అధికారులు సోమవారం భద్రతను పెంచారు. తన కారు ఎక్కిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారని, ఉర్దూ భాషలో మాట్లాడుతూ యాంటీలియా చిరునామా కోసం తనను అడిగారని, వారి వద్ద రెండు బ్యాగులు ఉన్నాయని ఓ ట్యాక్సీ డ్రైవర్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన ఆజాద్ మైదాన్ పోలీసులు అతడి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. దక్షిణ ముంబైలో అల్టామౌట్ రోడ్డులోని ముఖేష్ నివాసం వద్ద భద్రతను పటిష్టం చేశారు. ఇక్కడ మరిన్ని బారీకేడ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. సీనియర్ అధికారి ఒకరు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. (చదవండి: ముఖేష్ అంబానీ కొత్త ఇల్లు..! ఎంతకు కొనుగోలు చేశారో తెలుసా..!) ఈ ఏడాది ఫిబ్రవరిలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనం యాంటీలియా ఎదుట పార్కు చేసి ఉండడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన అప్పటి పోలీసు అధికారి సచిన్ వాజేను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. చదవండి: ఇల్లు కోసం కొనలేదు.. హెరిటేజ్ ప్రాపర్టీగా! -
బెంగాల్లో హింస: కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చెలరేగిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. బెంగాల్లో హింసకు సంబంధించి నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖ బెంగాల్ గవర్నర్‌ను ఆదేశించింది. ఇప్పటికే కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో చెలరేగిన హింస దృష్ట్యా కేంద్ర హోంశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటుచేయనుంది. 77 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలో ప్రతిపక్షనేతగా ఎన్నికైన సువేందు అధికారికి జెడ్ కేటగిరీ భద్రతను కొనసాగించే అవకాశం ఉంది. చదవండి: Tamil Nadu: పెత్తనం.. పళనిదే! -
మాతోశ్రీని పేల్చేస్తాం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం ‘మాతోశ్రీ’ని పేల్చేస్తామంటూ ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్‌కాల్స్ కలకలం రేపాయి. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడినని చెప్పుకుంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి చేసిన ఫోన్ కాల్స్‌తో మహారాష్ట్ర పోలీసులు సీఎం ఉద్ధవ్ నివాసానికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ‘బాంద్రా కాలానగర్‌లో ఉన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఓ ఆగంతకుడు రెండు సార్లు ఫోన్ చేశాడు. తనెవరో చెప్పలేదు. దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం తరఫున ఫోన్ చేస్తున్నట్లు మాత్రమే చెప్పుకున్నాడు. దావూద్ సీఎం ఉద్ధవ్‌తో మాట్లాడాలనుకుంటున్నాడని అన్నాడు. అయితే, సీఎం నివాసంలోని టెలిఫోన్ ఆపరేటర్ ఈ కాల్స్‌ను ముఖ్యమంత్రికి ఫార్వార్డ్ చేయలేదు’అని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..ఆ ఫోన్ కాల్స్ దుబాయ్ నుంచేనా మరేదైనా ప్రాంతం నుంచి వచ్చాయా అనేది దర్యాప్తు చేస్తున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల విషయమై చర్చించేందుకు ఆదివారం భేటీ అయిన రాష్ట్ర కేబినెట్..బెదిరింపు కాల్స్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఘటనపై నేర విభాగం దర్యాప్తు చేస్తుందని రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే, ముఖ్యమంత్రి నివాసాన్ని పేల్చేస్తామంటూ ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని రవాణా శాఖ మంత్రి అనిల్ పరబ్ అన్నారు. -
‘కాళేశ్వరం’పై పోలీసుల నజర్!
సాక్షి, కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులపై పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లాలో మావోయిస్టులు పట్టు కోసం ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో రాత్రీపగలు గోదావరి తీర ప్రాంతాలు, అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. పల్లెలతో పాటు ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులు విచారించి వదిలేస్తున్నారు. వాహనాల తనిఖీలు కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన మీదుగా మహారాష్ట్ర–తెలంగాణకు వస్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కాళేశ్వరం, మహాదేవపూర్, పలిమెల ఎస్సైలు అభినవ్, అనిల్, శ్యాంరాజ్ ఆధ్వర్యాన తనిఖీలు సాగుతున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసులు తెలంగాణ వైపు మహదేవపూర్, పలిమెల మండలాల్లో గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశించకుండా అప్రమత్తమయ్యారు. మహదేవపూర్, పలిమెల మండలంలోని రేవులపై ప్రత్యేక దృష్టిని సారించారు. గోదావరిలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రోడ్డు మార్గాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఇక మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డలోని లక్ష్మీ, అన్నారంలోని సరస్వతీ బ్యారేజీ, కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్, గ్రావిటీ కాల్వల వద్ద నిఘా తీవ్రం చేశారు. జిల్లా ఇన్చార్జి ఎస్సీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐ నర్సయ్య ఆధ్వర్యంలో బ్యారేజీలపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలిసింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, డిస్ట్రిక్ గార్డులు, సివిల్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
సచిన్ భద్రత కుదింపు.. ఆదిత్యకు పెంపు
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కి ప్రభుత్వం భద్రత తగ్గించింది. శివసేన ఎమ్మెల్యే, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్యకు భద్రత పెంచారు. ఆయనను జడ్ కేటగిరీకి పెంచి నట్లు బుధవారం ఒక అధికారి చెప్పారు. ఆయా వ్యక్తులకు పొంచివున్న ప్రమాదాలపై మహారాష్ట్ర ప్రభుత్వ కమిటీ సమీక్ష చేపట్టిన అనంతరం భద్రతా పరిధిలో మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. సచిన్, ఆదిత్యతో పాటు మరో 90 మందికి పైగా ప్రముఖుల భద్రతను ఇటీవల జరిగిన సమావేశంలో కమిటీ సమీక్షించినట్లు తెలిపారు. సచిన్‌కు ఎక్స్ కేటగిరీ భద్రత ఉండేది. ఎక్స్ కేటగిరీ కింద, ఒక పోలీసు సచిన్‌కు 24 గంటలూ రక్షణ కల్పించేవారు. ఇకపై ఆయన తన ఇంటి నుండి బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడల్లా పోలీసు ఎస్కార్ట్ మాత్రం ఇస్తారని తెలిపారు. ఆదిత్య ఠాక్రేకు జెడ్ సెక్యూరిటీ భద్రత కల్పించారు. ఇప్పుడు మరింత ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణగా ఉంటారు. అంతకు ముందు ఆదిత్యకు వై ప్లస్ భద్రత ఉండేది. సామాజిక కార్యకర్త అన్నా హజారే భద్రతను వై ప్లస్ కేటగిరీ నుంచి జడ్ కేటగిరీకి పెంచినట్లు వెల్లడించారు. బీజేపీ మొదటిదఫా ప్రభుత్వంలోని మంత్రులకు భద్రతా స్థాయిలను తగ్గించే అవకాశాలు ఉన్నాయని అధికారి చెప్పారు. -
ఇక తహసీల్దార్లకు భద్రత
సాక్షి, ఆదిలాబాద్ : మండల కార్యాలయాల్లో పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రస్థా యి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండడంతో ఈ మేరకు చర్యలు చేపట్టింది. అయితే జిల్లాలో జనాలు ఎక్కువగా వెళ్లే మం డల కార్యాలయాలపై ఇది వరకే ఓ కన్నేసి ఉంచి న పోలీసు యంత్రాంగం ఇక నుంచి ఆ నిఘాను పటిష్టం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద పోలీస్ బుక్ పాయింట్‌ను ఏర్పాటు చేసి భద్రత పటిష్టం చేయనున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి ఘటన నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగుల్లో అభద్రత భావం నెలకొన్న విషయం తెలిసిందే. విజయారెడ్డి మృతికి సంతాపంగా వారంరోజుల పాటు నిరసనలు చేపట్టిన ఉద్యోగులు బుధవారం నుంచి విధుల్లో చేరారు. అయితే స్ట్రైక్ నుంచి విధుల్లో చేరిన మొదటిరోజు నుంచే భద్రత చర్యలు ప్రారంభం కావడం మంచి పరిణామం. కార్యాలయాల వద్ద బుక్ పాయింట్ జిల్లాలో 17 గ్రామీణ మండలాలు, ఒక అర్బన్ మండలం ఉన్నాయి. ఆదిలాబాద్ అర్బన్ మండల రెవెన్యూ కార్యాలయం కలెక్టరేట్ భవనంలో ఉంది. అయితే కలెక్టరేట్ ముందు, లోపల, వెనకాల, ఎప్పుడూ పోలీసుల నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది. జనాలు కూడా అధిక సంఖ్యలో కలెక్టరేట్‌కు వస్తుంటారు. 17 గ్రామీణ మండలాల్లోనూ రెవెన్యూ కార్యాలయాలు, అంతే మోతాదులో పోలీసు స్టేషన్లు ఉన్నాయి. రెవెన్యూ ఆఫీసుల్లో జరుగుతున్న సంఘటనలపై ఆ మండల పోలీస్‌స్టేషన్, దాని పరిధిలో పని చేసే పోలీసు అధికారులు దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. మండల కార్యాలయాల్లో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే తక్షణమే అక్కడున్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించే సౌకర్యం ఉంది. సమాచారం అందుకున్న సదరు పోలీస్‌స్టేషన్ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పరిష్కరిస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. రెవెన్యూ కార్యాలయాల వద్ద ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలు, సభలు జరిగినప్పుడు తప్పా.. ప్రతివారం రెవెన్యూ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు, ఆఫీసు పర్యవేక్షణ బృందాలు, స్పెషల్ టీంల పరిశీలన అంటూ ఏమీలేవని చెప్పవచ్చు. కానీ ఇప్పుడలా కాకుండా మండల రెవెన్యూ ఆఫీసుల వద్ద పోలీస్ బుక్ పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. బ్లూకోట్స్, పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు ప్రతి సోమవారం ఐదారుసార్లు రెవెన్యూ కార్యాలయాలను పరిశీలన చేసి బుక్పాయింట్లో సంతకం పెడతారు. దీంతో ఈ మండలాన్ని ఎవరెవరూ ఎప్పుడెప్పుడు పరిశీలన చేశారన్న విషయం ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు మండలాలను విజిట్ చేసినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఫలితంగా ఆఫీసులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పోలీసు శాఖ భావిస్తోంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు మండలాలు, గ్రామాలను రాత్రి, పగలు జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. జనాలు ఎక్కువగా వెళ్లే ఆఫీసులపై... ఒక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సూపరింటెండెంట్, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆ మండల పరిధిలోని వివిధ రెవెన్యూ గ్రామాలకు చెందిన వీఆర్వోలు, టైపిస్టు, అటెండర్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. అయితే వివిధ పనుల నిమిత్తం రైతులు, విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, సంస్థల ప్రతినిధులు, తదితరులు అనునిత్యం మండలాఫీసులకు వస్తుంటారు. అయితే ఏ మండల కార్యాలయానికి జనాలు ఎక్కువగా వెళ్తున్నారో ఆ మండలాఫీసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సదరు మండలంలో బుక్ పాయింట్ నిర్వహించడంతో పాటు ఆ మండల పరిధిలోని పోలీస్ స్టేషన్ అధికారులు కూడా నిఘా ఉంచనున్నారు. ఎదైనా సంఘటన జరిగితే తక్షణమే స్పందించి సమస్యను అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటారు. రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, మండలాఫీసుల వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేపట్టాలని రెవెన్యూ ఉద్యోగులు నిరసనలో భాగంగా సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిఘా మరింత పెంచుతాం జనాలు ఎక్కువగా వెళ్లే రెవెన్యూ కార్యాలయాలపై నిఘా మరింత పెంచుతాం. బుక్ పాయింట్లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేపడుతాం. బ్లూ కోట్స్, పెట్రోలింగ్‌లో పాల్గొనేవారు రెవెన్యూ కార్యాలయాలను పరిశీలిస్తారు. కలెక్టరేట్‌తో పాటు మండలాల్లోని కార్యాలయాలు, పాఠశాలలు, వివిధ చోట్ల భద్రత ఇప్పటికే ఉంది. దీనిని మరింత పటిష్టం చేస్తాం. – విష్ణు ఎస్ వారియర్, ఎస్పీ, ఆదిలాబాద్ భద్రత మంచిదే మండల కేంద్రాల్లో రెవెన్యూ ఉద్యోగులకు భద్రత ఏర్పాటు చేయడం మంచిదే. బుధవారం పోలీసు సిబ్బంది మా కార్యాలయానికి వచ్చి పరిశీలించి వెళ్లారు. విధుల్లో ఉన్న ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా నిఘా ఉంచడం సంతోషమే. రెవెన్యూ ఉద్యోగులు మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు ముందుకు వస్తారు. – సి.రాజమనోహర్‌రెడ్డి, తహసీల్దార్, ఆదిలాబాద్ రూరల్ రెవెన్యూ కార్యాలయాలపై నిఘా ఇలా.. ► ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌లో పోలీసుల నిఘా. ► పరిశీలన చేసిన పోలీసు అధికారులు సంతకం చేసేలా బుక్ పాయింట్ ఏర్పాటు. ► పిటిషనర్లు రెవెన్యూ అధికారులకు అసౌకర్యం, ఇబ్బంది కల్గించకుండా చూస్తారు. ► అనుమానం ఉన్న సదరు పిటిషనర్‌ను లోనికి వెళ్లనివ్వరు. ► తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రతివ్యక్తిపై నిఘా -
సీఆర్పీఎఫ్ ఇక మరింత బలోపేతం
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో జవాన్ల భద్రతా చర్యల్లో భాగంగా కీలక ముందడుగు పడింది. వారి భద్రత కోసం మందుపాతర రక్షిత వాహనాలను (ఎమ్‌పీవీ), 30 సీటర్ బస్సులను సమకూర్చనున్నట్లు భద్రతా దళాధికారి ఒకరు తెలిపారు. అలాగే కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి భద్రతల విధులను నిర్వహిస్తున్న 65 బెటాలియన్లలో బాంబులను గుర్తించే, నిర్వీర్యం చేసే స్క్వాడ్ బృందాలను పెంచాలని కూడా పారామిలిటరీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై పేలుడు పరికరం ఉపయోగించి చేసిన బాంబు దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్లో ఈ మేరకు చర్యలు చేపట్టారు. ‘కశ్మీర్లో మాకున్న ప్రతికూలతల నివారణకు చర్యలు చేపడుతున్నాం. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, ఎక్కువ మొత్తంలో ఎమ్‌పీవీలను సేకరిస్తున్నాం. పెద్ద బస్సులకు భద్రత కష్టంగా ఉంటుంది. అందుకే 30 మంది మాత్రమే కూర్చోడానికి వీలుండే బస్సులను సమకూరుస్తున్నాం’అని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఆర్.భట్నాగర్ పేర్కొన్నారు. -
తెరుచుకున్న శబరిమల దేవాలయం
శబరిమల: భారీ భద్రత నడుమ మకర సంక్రాంతి(మకరవిలక్కు) వేడుకల కోసం శబరిమల అయ్యప్ప దేవాలయం ఆదివారం తెరుచుకుంది. ప్రధాన పూజారి వీఎన్ వాసుదేవన్ నంబూద్రి ఆలయ తలుపులు తెరిచి పూజలు చేశా రు. తొలి రోజే భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. మకర సంక్రాంతి జనవరి 15న జరుగుతుంది. ఆలయాన్ని తిరిగి జనవరి 21న మూసివేస్తారు. 41 రోజుల పాటు జరిగిన మండల పూజ అనంతరం 27న ఆలయాన్ని మూసివేశారు. అన్ని వయసుల మహిళల్ని ఆలయంలోనికి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేరళ ప్రభుత్వం భద్రతను పటిష్టం చేసింది. -
నిఘా నీడన భారత్ బంద్
సాక్షి, న్యూఢిల్లీ : కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్న పలు సంఘాలు మంగళవారం భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన క్రమంలో వివిధ రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలనూ కోరింది. బంద్ నేపథ్యంలో రాజస్ధాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించారు. ఏప్రిల్ 10న బంద్‌కు సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో మెసేజ్‌లు వెల్లువెత్తడంతో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 2న దళిత సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్ బంద్ నిరసనల సందర్భంగా పది మంది మరణించగా, పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని దళిత సంఘాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు ఆందోళనలు చేస్తున్న వారు తమ తీర్పును పూర్తిగా చదవలేదని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొనగా, దళితుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడిఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ భారత్ బంద్‌కు పిలుపు ఇవ్వడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.