
వాషింగ్టన్: కాల్పుల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్కాన్సిన్‌లోని మివాకీ పట్టణానికి చేరుకున్నారు. మివాకీలో సోమవారం(జులై 15) నుంచి నాలుగు రోజుల పాటు రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ జరగనుంది. ఈ సమావేశాల్లోనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ను అధికారికంగా నామినేట్ చేస్తారు.
కాల్పుల నేపథ్యంలో మివాకీ సమావేశాల వేదిక వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పెన్సిల్వేనియాలో శనివారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి బుల్లెట్ తగిలి రక్తం చిందింది. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌ను అక్కడినుంచి తరలించారు. దుండగుడిని కాల్చి చంపారు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment