మాస్కో: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పుతిన్ అవునని సమాధానం ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు విడుదల తర్వాత గురువారం రష్యాలోని సోచిలో ఓ అంతర్జాతీయ సదస్సు జరిగింది. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌తో చర్చలు జరపడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
అదే సమయంలో ఏడాది జులైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నంపై స్పందించారు. హత్యాయత్నం జరిగిన అనంతరం ట్రంప్ చూపించిన తెగువ, ధైర్యం తనను ఆకట్టుకుందన్నారు.
పుతిన్‌తో మాట్లాడలేదు
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తాను 70 మంది దేశాది నేతలతో మాట్లాడానని ట్రంప్ తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను గెలిపించాలని పిలుపున్చిన పుతిన్‌తో తాను మాట్లాడలేదని ట్రంప్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment