Wisconsin
-
USA Presidential Elections 2024: వైషమ్యాలను పెంచుతారు
వాషింగ్టన్: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ వ్యక్తులను పరస్పరం ఎగదోసి వారిమధ్య వైషమ్యాలు పెంచే రకమంటూ డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ దుయ్యబట్టారు. ట్రంప్ కంటే చాలా మెరుగైన వ్యక్తి మాత్రమే అమెరికాకు నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు. స్వింగ్ రాష్ట్రమైన విస్కాన్సిన్లో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.రాజకీయ ప్రత్యర్థులను, తనకు ఓట్లేయని వారని శత్రువులుగా భావించే ప్రమాదకరమైన మనస్తత్వం ట్రంప్ సొంతమని ఆక్షేపించారు. ఆయన జేబులో రాసిపెట్టుకున్న శత్రువుల జాబితా నానాటికీ పెరిగిపోతూనే ఉందన్నారు. ‘‘మరోవైపు రిపబ్లికన్ల నుంచి కూడా ఒకరికి నా మంత్రివర్గంలో చోటివ్వాలన్న మనస్తత్వం నాది. మా ఇద్దరి మధ్య ఇదే తేడా’’అని చెప్పుకొచ్చారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం రాణిస్తుందన్నారు. -
USA Presidential Elections 2024: వైట్‌హౌస్‌కు దారేది?..7 స్వింగ్ స్టేట్లే కీలకం!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తుది అంకానికి చేరింది. అంతా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పోలింగ్ ప్రక్రియ మంగళవారం జరగనుంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. దాంతో వారిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి! అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే. వీటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. కనుక ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాల్లోనే పోటీ ప్రధానంగా కేంద్రీకృతం అవుతుంటుంది. వాటిని స్వింగ్ స్టేట్స్‌గా పిలుస్తుంటారు. ఈసారి అలాంటి రాష్ట్రాలు ఏడున్నాయి. అవే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా. 93 ఎలక్టోరల్ ఓట్లు వీటి సొంతం. వాటిలో మెజారిటీ ఓట్లను ఒడిసిపట్టే వారే అధ్యక్ష పీఠమెక్కుతారు. ట్రంప్‌కు 51, హారిస్‌కు 44 అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. విజయా నికి కనీసం 270 ఓట్లు రావాలి. 48 రాష్ట్రాల్లో మెజారిటీ ఓ ట్లు సాధించిన అభ్యర్థి తాలూకు పార్టీకే ఆ రాష్ట్రంలోని మొ త్తం ఎలక్టోరల్ ఓట్లు దఖలు పడే (విన్నర్ టేక్స్ ఆల్) విధా నం అమల్లో ఉంది. ఆ లెక్కన సేఫ్ స్టేట్లన్నీ ఈసారి ఆయా పార్టీల ఖాతాలోనే పడే పక్షంలో హారిస్ 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. స్వింగ్ స్టేట్లలో ని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారడానికి కారణమిదే. ట్రంప్ గెలవాలంటే వాటిలో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు చాలు. గత కొద్ది ఎన్నికలుగా ఈ ఏడు స్వింగ్ స్టేట్ల ఓటింగ్ ధోరణి, ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా వాటిలో ఈసారి ఫలితాలు ఎలా ఉండవచ్చన్న దానిపై జోరుగా అంచనాలు, విశ్లేషణలు సాగుతున్నాయి.పెన్సిల్వేనియా కీలకం 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జనాభా వైవిధ్యం విషయంలో కూడా ఆ రాష్ట్రం అచ్చం అమెరికాకు నకలులా ఉంటుంది. డెమొక్రాట్ల ఆధిపత్యం సాగే పెద్ద నగరాలు, రిపబ్లికన్ కంచుకోటలైన గ్రామీణ ప్రాంతాలు పెన్సిల్వేనియా సొంతం. దాంతో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ నెలకొంది.రస్ట్ బెల్ట్–సన్ బెల్ట్ అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాలను రస్ట్ బెల్ట్ రాష్ట్రాలుగా పిలుస్తారు. ఈ మూడింట్లో కలిపి 44 ఓట్లున్నాయి. మిగతా దేశంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలను సన్ బెల్ట్ రాష్ట్రాలంటారు. వీటిలో మొత్తం 49 ఓట్లున్నాయి. → రస్ట్ బెల్ట్ నిర్మాణ రంగానికి నిలయం. దాంతో విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ఓటర్లపై కారి్మక సంఘాల ప్రభావం ఎక్కువే. → ఈ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగుతూ వస్తోంది. ఎంతగా అంటే, గత ఎనిమిది అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఏడుసార్లు ఈ మూడు రాష్ట్రాలూ ఆ పార్టీ ఖాతాలోనే పడ్డాయి. ఒక్క 2016లో మాత్రం వాటిలో పూర్తిగా ట్రంప్ హవా నడిచింది. → ఈసారి కూడా డెమొక్రాట్ల ఆధిపత్యమే సాగితే 44 ఓట్లూ కమల ఖాతాలోనే పడతాయి. అదే జరిగితే తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టిస్తారు. → అలాగాక 2016లో మాదిరిగా ట్రంప్ మరోసారి ఈ మూ డు రాష్ట్రాలనూ నెగ్గినా విజయానికి ఏడు ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడాయన విజయం కోసం కనీసం మరో స్వింగ్ స్టేట్‌ను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. → ఒకవేళ హారిస్ రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా ఆమె గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. → హారిస్ రస్ట్ బెల్ట్‌లో సున్నా చుట్టినా నాలుగు సన్ బెల్ట్ రాష్ట్రాలను స్వీప్ చేస్తే విజయం ఆమెదే. → అయితే ఇందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే 1948 తర్వాత డెమొక్రాట్లు సన్ బెల్ట్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. → రిపబ్లికన్లకు మాత్రం సన్ బెల్ట్‌ను పలుమార్లు క్లీన్‌స్వీప్ చేసిన చరిత్ర ఉంది. ఈసారీ అలా జరిగినా ట్రంప్ విజయానికి అది చాలదు. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ఆయన చేజిక్కించుకోవాలి. లేదంటే 269 ఓట్లకు పరిమితమై ఓటమి పాలవుతారు.రస్ట్ బెల్ట్‌లో విజయావకాశాలు → రస్ట్ బెల్ట్‌లో హారిస్ గెలవాలంటే పట్టణ ఓటర్లు భారీగా ఓటేయాల్సి ఉంటుంది. నల్లజాతీయులు, మైనారిటీలు, విద్యాధికులు, మధ్య తరగతి ఓట్లు, ముఖ్యంగా మహిళలు పోలింగ్ బూత్‌లకు తరలడం తప్పనిసరి. → అలాగాక గ్రామీణ ఓటర్లు భారీగా ఓటేస్తే 2016లో మాదిరిగా మరోసారి రస్ట్ బెల్ట్ ట్రంప్‌దే అవుతుంది. → ఈసారి గ్రామీణులతో పాటు యువ ఓటర్లు కూడా తనకే జైకొడతారని ఆయన ధీమాగా ఉన్నారు. సన్ బెల్ట్‌లో విజయావకాశాలు → ఇక్కడ విజయావకాశాలను అమితంగా ప్రభావితం చేసేది నల్లజాతీయులు, లాటిన్ అమెరికన్ ఓటర్లే. → జార్జియా, నార్త్ కరోలినాల్లో నల్లజాతి ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. అరిజోనా, నెవడాల్లో లాటిన్ అమెరికన్ జనాభా నానాటికీ పెరుగుతోంది. → హారిస్ జమైకన్ మూలాల దృష్ట్యా నల్లజాతీయులు ఆమెవైపే మొగ్గుతారని భావిస్తున్నారు. ఇక ట్రంప్ ర్యాలీలో ప్యూర్టోరీకన్లు, లాటిన్ అమెరికన్లపై వెలువడ్డ వ్యంగ్య వ్యాఖ్యలపై ఆగ్రహంతో వారు కూడా హారిస్‌కే ఓటేస్తారని డెమొక్రాట్లు ఆశిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా విస్కాన్సిన్ స్టేట్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
మాడిసన్: విదేశాల్లో గణనాథుడి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్టం విస్కాన్సిన్ స్టేట్‌లోని సన్ ప్రైరీలో తెలుగు వాళ్లంతా కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించి.. సోమవారం అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో అభిషేక్ సింధుజ, సంతోష్ ప్రణయ, ప్రసాద్ రమ్య, క్రాంతి కవిత, సంతోష్ ఉష తదితరులు పాల్గొన్నారు. -
‘మివాకీ’ కన్వెన్షన్‌కు ట్రంప్.. అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్న రిపబ్లికన్ పార్టీ
వాషింగ్టన్: కాల్పుల తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్కాన్సిన్లోని మివాకీ పట్టణానికి చేరుకున్నారు. మివాకీలో సోమవారం(జులై 15) నుంచి నాలుగు రోజుల పాటు రిపబ్లికన్ పార్టీ కన్వెన్షన్ జరగనుంది. ఈ సమావేశాల్లోనే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్‌ను అధికారికంగా నామినేట్ చేస్తారు. కాల్పుల నేపథ్యంలో మివాకీ సమావేశాల వేదిక వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. పెన్సిల్వేనియాలో శనివారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి బుల్లెట్ తగిలి రక్తం చిందింది. వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్‌ను అక్కడినుంచి తరలించారు. దుండగుడిని కాల్చి చంపారు. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
బాయ్‌ఫ్రెండ్‌పై కోపం.. ఆమె చేసిన పనికి షాక్‌లో లవర్
ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్ మీద కోపంతో దారుణానికి ఒడిగట్టింది. ఈ క్రమంలో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. విస్కాన్సిన్లోని మాడిసన్‌కు చెందిన కెల్లీ హేస్ తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్ మీద కోపంతో అతడి కారుకు నిప్పంటించింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆమె తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఏ మాత్రం లేట్ అయిన ఆమె మంటల్లో చిక్కుకుపోయేది. అయితే, మొదట కారులో ఇంధనం పోసి ఆ తర్వాత లైటర్‌తో మంటలు అంటించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కారు గ్లాస్లో నుంచి మంటలు బయటకు వచ్చాయి. సమయ స్ఫూర్తితో ఆమె మంటలను నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటన అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కెల్లీని వారు అరెస్ట్ చేశారు. This woman nearly k!lls herself setting ex-boyfriend's car on fire pic.twitter.com/dzxilLh0O3 — Snade (@Sw33tSanade) April 27, 2022 -
అమెరికాలో మళ్లీ కాల్పులు
కెనోషా: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేగింది. ఇండియానా రాష్ట్రంలో జరిగిన దాడిని మరువక ముందే విస్కాన్సిన్లో తాజా ఘటన చోటుచేసుకుంది. కెనోషా కౌంటీలో ఆదివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణిం చగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని కౌంటీ షెరిఫ్ డేవిడ్ బెత్ వెల్లడించారు. ఘటనకు ముందుగా నిందితుడు బార్లోనే ఉన్నాడని, అయితే అతన్ని బయటకు పంపడంతో తిరిగి వచ్చి కాల్పులు జరిపినట్లు భావిస్తున్నామన్నారు. ఎవరిని చంపాలో నిందితుడు ముందుగానే నిర్ణయించు కొని వచ్చినట్లు అభిప్రాయపడుతున్నట్లు వెల్లడిం చారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరొకరు కూడా ఉన్నట్లు చెప్పారు. దాడి చేసేందుకు ఒక హ్యాండ్‌గన్‌ను ఉపయోగించారని తెలిపారు. నిందితున్ని పట్టుకోవడానికి స్థానికులు సాయం చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే ప్రధాన రహదారులను మూసేసి తనిఖీలు చేపట్టారు. ఒమహాలోనూ కాల్పులు.. ఒమహాలోని ఓ మాల్లోనూ ఆదివారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఘటనానంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు దాదాపు గంట పాటు మాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలను సేకరించిన అనంతరం తిరిగి మాల్‌లోకి సందర్శకులను అనుమతించారు. నిందితుడు స్పష్టమైన లక్ష్యంతోనే వచ్చి కాల్పులు జరిపాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ కాలికి సైతం గాయమైంది. -
బైడెన్ గెలుపును సర్టిఫై చేసిన ఆరిజోనా
వాషింగ్టన్: యూఎస్‌లో రెండు కీలక రాష్ట్రాలు ఆరిజోనా, విస్కాన్సిన్ సోమవారం డెమొక్రాటిక్ అభ్యర్ధి జోబైడెన్ గెలుపును సర్టిఫై చేశాయి. గత ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు. విస్కాన్సిన్లో బైడెన్ 20,700 ఓట్లతో గెలిచినట్లు గవర్నర్ టోనీ ఎవర్స్ ప్రకటించారు. ఇటీవలే ఈ రాష్ట్రంలోని రెండు కౌంటీల్లో రీకౌంటింగ్ జరిపారు. అయితే ఈ ఫలితాన్ని ట్రంప్ అంగీకరించడం లేదు. మరోవైపు రిపబ్లికన్లకు బాగా పట్టున్న ఆరిజోనాలో బైడెన్ 10వేల ఓట్లతో గెలిచారని గవర్నర్ డగ్ హాబ్స్ తెలిపారు. ప్రస్తుతం బైడెన్‌కు ఎలక్టోరల్ కాలేజీలో 306 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్లకు పట్టున్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఎన్నికల ఫలితాలను తిరస్కరించాలని ట్రంప్ లాయర్ రూడీ గిలియాని కోరారు. కానీ ఆయన డిమాండ్ ఎవరూ పట్టించుకోలేదు. వీరంతా తప్పుడు సర్టిఫికేషన్లు చేస్తున్నారని రూడీ చెప్పుకొచ్చారు. తాజా సర్టిఫికేషన్లను ఛాలెంజ్ చేసేందుకు ట్రంప్‌నకు ఐదు రోజుల సమయం ఉంది. తాను తనకు ఓటేసిన 7.4 కోట్ల మంది తరఫున పోరాడుతున్నానని ట్రంప్ ట్వీట్ చేశారు. ఐరాస చీఫ్‌తో బైడెన్ చర్చలు న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుట్టెరస్తో అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జోబైడెన్ చర్చలు జరిపారు. అమెరికాకు, ఐరాసకు మధ్య బంధం బలోపేతం చేయడం, ప్రపంచ సమస్యలను కలసికట్టుగా ఎదుర్కోవడంపై వీరిద్దరూ సోమవారం ఫోన్లో చర్చించారు. ఎన్నికల్లో తన విజయానికి అభినందనలు తెలిపినందుకుగాను ఆంటోనీకి బైడెన్ కృతజ్ఞతలు చెప్పారు. ఇథియోపియాలో హింస పెరగడంపై బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారని ఐరాస వర్గాలు తెలిపాయి. బైడెన్‌తో చర్చలపట్ల ఆంటోనీ సంతోషం వ్యక్తం చేశారన్నాయి. బైడెన్బృందంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారన్నాయి. ట్రంప్ హయంలో ఐరాసతో యూఎస్ సంబంధాలు పలు అంశాల్లో క్షీణించిన సంగతి తెలిసిందే. పలు కీలక ఐరాస సమాఖ్యలు, సంస్థల నుంచి యూఎస్ వైదొలిగేలా ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నారు. డబ్లు్యహెచ్‌ఓ, పారిస్ ఒప్పందం, యునెస్కో, మానవహక్కుల సంఘం నుంచి యూఎస్ ట్రంప్ హయంలో బయటకు వచ్చింది. కాగా తిరిగి పారిస్ ఒప్పందంలో చేరతామని బైడెన్ ఇటీవల ప్రకటించారు. -
కోర్టుకెక్కిన ట్రంప్ మద్దతుదారులు
వాషింగ్టన్: జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను సవాల్ చేస్తూ ట్రంప్ మద్దతుదారులు కోర్టులో పిటిషన్లు వేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలంటూ ట్రంప్ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానంలో సవాళ్లు ఇవీ.. జార్జియా: ఈ రాష్ట్రంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న జార్జియాలో అత్యంత కీలక రాష్ట్రం కావడంతో ఓట్ల లెక్కింపుని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ అనుచరులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విస్కాన్సిన్: విస్కాన్సిన్లో విజయం సాధించడంతో జో బైడెన్ శ్వేత సౌధానికి మరింత చేరువయ్యారు. 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలని ట్రంప్ వర్గం పిటిషన్ వేసింది. దీనిపై నవంబర్ 17లోగా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెన్సిల్వేనియా: 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో ట్రంప్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆలస్యంగా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించవద్దంటూ ట్రంప్ మద్దతుదారులు కోర్టుకెక్కారు. ఈ రాష్ట్రంలో ఇంకా 10 లక్షల ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. నవంబర్ 12 వరకు పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించడానికి గడువు పెంచడంపై ట్రంప్ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. మిషిగాన్: ఈ రాష్ట్ర్రంలో ఇంచుమించుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ట్రంప్ అనుయాయులు కోర్టుకెక్కారు. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ట్రంప్ కంటే బైడెన్ 3శాతం అధికంగా ఓట్లను సాధించారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కోర్టుకెక్కినా పెద్దగా ఉపయోగం ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్‌కు ముందే వివాదాలు ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు వివాదాల చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా ముందస్తు ఓటింగ్, మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రక్రియలు ఆది నుంచి వివాదాన్ని రేపుతున్నాయి. మెయిల్ ఇన్ ఓటింగ్‌లో అవకతవకలకు ఆస్కారం ఉందని ట్రంప్ శిబిరం ఆరోపిస్తోంది. పోలింగ్‌కు ముందే ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ 44 రాష్ట్రాల్లో 300కి పైగా కేసులు నమోదయ్యాయి. -
'గాయాలు బాధిస్తున్నాయి.. కానీ బతకాలనుంది'
-
'గాయాలు బాధిస్తున్నాయి.. కానీ బతకాలనుంది'
న్యూయార్క్ : 'ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది.. నా వీపుకు తగిలిన గాయాలు నన్ను బాధిస్తున్నాయి.. రోజులో ఉండే 24 గంటలు కేవలం నొప్పిని మాత్రమే గుర్తు చేస్తున్నాయి.. అయినా సరే నాకు బతకాలనిపిస్తుంది.. ఎందుకంటే నేను జీవితంలో సాధించాల్సి చాలా ఉంది.. అంటూ జాకబ్ బ్లాక్ అనే నల్ల జాతీయుడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అమెరికాలో జాతి వివక్ష గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాలుగా నల్లజాతీయులు అక్కడి తెల్ల జాతీయుల చేతిలో జాత్యంహకారానికి బలవుతూనే ఉన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం అమెరికాను అట్టుడికేలా చేసింది. ఇప్పటికి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా నల్ల జాతీయులపై దాడులు ఆగడం లేదు. (చదవండి : మరో నల్లజాతీయుడిని కాల్చి చంపిన పోలీసులు) ఇదే కోవలో ఆగస్టు 23న విస్కాన్సిన్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కెనోషా అనే ప్రాంతంలో 29 ఏళ్ల జాకబ్ బ్లేక్స్ అనే వ్యక్తి ఇంటికి వెళదామని తన కారు దగ్గరకు వచ్చాడు. ఇంతలో తెల్లజాతీయులైన ఇద్దరు పోలీసులు వచ్చి జాకబ్ బ్లేక్‌ను అడ్డుకొని ఏదో అడిగారు. ఆ తర్వాత అతన్ని కిందపడేసి విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం తుపాకీతో ఏడు నుంచి ఎనిమిది బులెట్లను జాకబ్ వీపులోకి కాల్చారు. బులెట్ల దాటికి అతని శరీరం చిద్రమైంది. ఆ సమయంలో జాకబ్ ముగ్గురు పిల్లలు కారులోనే ఉన్నారు. క్షణాల్లో చోటుచేసుకున్న ఈ ఉదంతంతో అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. వెంటనే బ్లేక్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జాకబ్ బ్లేక్ కదల్లేని స్థితిలో పడి ఉన్నాడు. బులెట్ల దాటికి వీపు భాగం మొత్తం దెబ్బతింది. బ్లేక్ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆసుపత్రి బెడ్‌పై నుంచే ప్రపంచానికి తన బాధను చెప్పుకోవాలని బ్లేక్ అనుకున్నాడు. డాక్టర్ల సహాయంతో తన మాటలను ఒక వీడియో రూపంలో విడుదల చేశాడు. 'నాకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది... 24 గంటలు నొప్పిని మాత్రమే చూస్తున్నా.. తిండి తినాపించడం లేదు.. నిద్ర రావడం లేదు.. జీవితం చాలా విలువైనది.. అందుకే నేను బతకాలి.. నా కుటుంబసభ్యులను కలుసుకోవాలి.. అందుకే ఒకటి చెప్పదలచుకున్నా.. మీ జీవితాలను మార్చుకోండి... ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం.. బతికినంత కాలం డబ్బు సంపాధించడంతో పాటు మనుషులను ప్రేమించడం అలవాటు చేసుకోండి.. ఇవన్నీ ఇప్పుడు నేను అనుభవించే స్థితిలో లేను' అంటూఉద్వేగంతో చెప్పుకొచ్చాడు.(చదవండి : నావల్నీ విషప్రయోగం కేసుపై రష్యా స్పందన) జాకబ్ బ్లేక్ పలికిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్లేక్‌కు మద్దతుగా విస్కాన్సిన్ నగరంలో పౌరులు ఆందోళనలు చేస్తున్నారు. బ్లేక్‌కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే జాకబ్‌ను కాల్చిన పోలీసులను విస్కాన్సిన్ సిటీ పోలీస్ విధుల నుంచి తొలగించింది. సస్పెండ్ చేస్తే చాలదని.. వారికి తగిన శిక్ష వేయాలంటూ అక్కడి ప్రజలు కోరుతున్నారు. -
ఉద్రిక్తతల చోటుకి వెళ్లనున్న ట్రంప్!
వాషింగ్టన్: విస్కాన్సిన్ రాష్ట్రంలోని కేనోషా పట్టణం నిరసనలతో అట్టుడుకుతోంది. నల్లజాతీయుడు జేకబ్ బ్లేక్పై పోలీసులు తుపాకీతో కాల్పులు జరపడంతో అతను ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసుల చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసుల తీరుపై దేశ వ్యాప్తంగా నల్లజాతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలతో హోరెత్తించారు. (చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఇద్దరు..) ఘటన జరిగిన కేనోషా పట్టణంలో రోడ్లపై రాళ్లు రువ్వుతూ ఆందోళన కారులు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కర్ఫ్యూ విధించారు. ఇక అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. మరోవైపు నిరసనలతో హోరెత్తుతున్న కేనోషాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం పర్యటించనున్నారని స్వేత సౌధం ప్రకటించింది. లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులను కలుసుకుని పరిస్థితులను సమీక్షిస్తారని తెలిపింది. (చదవండి: రెండు కీలక రాష్ట్రాల్లో ట్రంప్ వెనుకంజ) -
రెండు కీలక రాష్ట్రాల్లో ట్రంప్ వెనుకంజ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండు కీలక రాష్ట్రాల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నారు. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాదాపు 6 పర్సంటేజ్ పాయింట్లు ఆధిక్యంలో ఉన్నారు. తాజాగా సీబీఎస్ న్యూస్ నిర్వహించిన ఒక ఒపీనియన్ పోల్‌లో ట్రంప్‌ను కలవరపరిచే ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత ఎన్నికల్లో ట్రంప్ ఈ రెండు రాష్ట్రాల్లో మంచి మెజారిటీ సాధించడం గమనార్హం. కరోనాను అరికట్టే విషయంలో ట్రంప్ విఫలమయ్యారని, ఈ విషయంలో బైడెన్ సమర్ధవంతంగా వ్యవహరించేవాడని ఈ రాష్ట్రాల ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు ఆ సర్వేలో తేలింది. సీబీఎస్ న్యూస్ తరఫున బ్రిటన్ సంస్థ ‘యుగవ్’ ఈ సర్వే జరిపింది. ‘ఆర్థిక రంగానికి సంబంధించి ప్రజాభిప్రాయం ట్రంప్‌కే అనుకూలంగా ఉంటుంది. కరోనా విషయంలో విఫలమవ్వడం ఆ ఆధిపత్యాన్ని దెబ్బతీసింది’ అని సీబీఎస్ విశ్లేషించింది. బైడెన్‌కు ప్రస్తుతం ఆధిక్యం ఉన్నా.. అది మారవచ్చని పేర్కొంది. -
మైనర్‌తో శృంగారం కోసం 565 కి.మీ నడిచాడు
విస్కాన్సిన్(యూఎస్) : చెడుగా ఆలోచించి చేసే పనులు తప్పకుండా ఇబ్బందుల పాలు చేస్తాయి. తాజాగా ఇండియానాకు చెందిన టామీ లీ జెంకిన్స్ కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. తనకు ఫేస్బుక్లో పరిచయమైన 14 ఏళ్ల మైనర్ బాలికతో శృంగారం కోసం ఏకంగా ఇండియానా నుంచి విస్కాన్సిన్ వరకు 565 కి.మీ నడిచాడు. కానీ ఆ తర్వాత తాను చాట్ చేసింది.. ఓ పోలీసు అధికారితో అని తెలుసుకుని ఖంగుతిన్నాడు. చివరకు చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడిన కేసులో అరెస్టు అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. యూఎస్‌లో చిన్నారులపై పెరిగిపోతున్న లైంగిక వేధింపులను ఆరికట్టడానికి అక్కడి అధికారులు పలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఒక అధికారి కైలీ అనే పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాను క్రియేట్ చేశారు. కైలీ వయసు 14 ఏళ్లు అని, విస్కాన్సిన్లోని నిన్హా ప్రాంతంలో ఉంటుందని పేర్కొన్నారు. కైలీ అకౌంట్ నుంచి పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను జెంకిన్స్ యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత జెంకిన్స్.. లైంగిక పరమైన అంశాలు చర్చించడం మొదలుపెట్టాడు. అలాగే నగ్న ఫొటోలు పంపిచాల్సిందిగా కోరేవాడు. ఇటీవల కైలీని తనను కలవాల్సిందిగా కోరాడు. దానికి ఆమె అంగీకరించడంతో.. అతను ఇండియానా నుంచి విస్కాన్సిన్కు నడక ప్రారంభించాడు. ఈ క్రమంలోని తన వివిధ ప్రాంతాల్లో దిగిన ఫొటోలను కైలీకి పంపించాడు. ఇదంతా గమనిస్తున్న అధికారులు జెంకిన్స్ నిన్హా చేరుకోగానే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కంప్యూటర్ ద్వారా మైనర్ బాలికను ప్రేరేపించడం లేదా ప్రలోభపెట్టినందుకు గాను అతనిపై కేసు నమోదు చేశారు. జెంకిన్స్‌పై నమోదైన కేసు ఫెడరల్ కోర్టులో అక్టోబర్ 23వ తేదీ విచారణకు రానుంది. ఇలా మైనర్‌తో శృంగారం కోసం జెంకిన్స్ 565 కి.మీ నడిచి.. చివరకు చిక్కుల్లో పడ్డాడు. అతను దోషిగా తెలితే.. కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించనుంది. ఈ ఘటనపై యూఎస్ అటార్నీ మాథ్యూ క్రూగర్ మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో తమ ప్రాంతంలో బాలికలపై లైంగిక వేధింపులు పెరిపోయాయి. మైనర్ బాలికలపై వేధింపులకు పాల్పడేవారికి ఇంటర్నెట్ ద్వారా వారి పని సులభం అయిపోతుంది. అయితే అలాంటి వారిని శిక్షించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామ’ని తెలిపారు. -
హైవే రోడ్డు.. ఒంటరిగా పరుగెడుతున్న చిన్నారి..!!
-
హైవే రోడ్డు.. ఒంటరిగా పరుగెడుతున్న చిన్నారి..!!
విస్కాన్సిన్ : ‘రోడ్డుపై వెళ్తున్నప్పుడు, వాహనం నడుపుతున్నప్పుడు ఒళ్లంతా కళ్లు చేసుకోవాలి’ అనే మాటకు ఓ మహిళా డ్రైవర్ అసలైన అర్థం చెప్పారు. మానవత్వానికి కాస్త అమ్మతనాన్ని జోడించి ఓ పసిప్రాణాన్ని కాపాడారు. గడ్డకట్టుకుపోయే చలిలో కాళ్లకు చెప్పులు లేకుండా.. ఒంటికి సరిపడా బట్టలు లేకుండా నడిరోడ్డుపై పరుగెడుతున్న ఓ 19 నెలల చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. ఆ బస్ డ్రైవర్ రాక క్షణంకాలం ఆలస్యమైనా పాప ప్రాణాలకు ముప్పు వాటిల్లేదే. ఈ ఘటన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ పట్టణంలో గత డిసెంబరు 22న జరిగింది. ఆ రోజు ఉదయం మిల్వాకీ ట్రాన్సిట్ సంస్థకు చెందిన మహిళా డ్రైవర్ ఇరేనా ఇవిక్ డ్యూటీ నిమిత్తం బస్‌లో వెళ్తుండగా రోడ్డు డివైడర్‌పైన ఒంటరిగా పరుగెడుతున్న ఓ చిన్నారి కంటపడింది. గడ్డకట్టుకుపోయే చలిలో ఒంటరిగా ఉన్న ఆ చిన్నారిని చూసి ఆమె షాక్ తిన్నది. వెంటనే అప్రమత్తమై వాహనాన్ని పక్కకు నిలిపి పరుగెత్తుకుంటూ వెళ్లి ఇవిక్ ఆ చిన్నారిని బస్‌లోకి తీసుకొచ్చింది. ఇదంతా క్షణాల్లో జరగడంతో బస్‌లో ఉన్న ప్యాసెంజర్ అయోమయానికి గురయ్యారు. చలికి వణుకుపట్టి బిక్కుబిక్కుమంటూ తనవారి కోసం ఏడుస్తున్న ఆ చిన్నారి ఒక స్వెటర్ వేసి.. తన ఒళ్లో కూర్చోబెట్టుకుంది ఇవిక్. ఇవిక్ అప్పటికే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని పాపను తీసుకెళ్లారు. కాగా, చిన్నారి తల్లికి మానసిక రుగ్మత ఉన్నందునే పాప ఇంట్లోనుంచి రోడ్డుపైకి చేరిందని అధికారులు తెలిపారు. పాపను ఆమె తండ్రికి అప్పగించారు. అప్రమత్తంగా వ్యవహరించి చిన్నారిని కాపాడిన ఇవిక్కు గురువారం సన్మానం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘సరైన సమయనికి అక్కడున్నా. లేదంటే చిన్నారికి పెద్ద ప్రమాదమే జరిగేది. దేవుడి దయవల్ల ఈ చిన్నారిని కాపాడగలిగా’ అని చెప్పుకొచ్చారు ఇవిక్. కాగా, గత కొన్ని నెలల కాలంలో మొత్తం 9 మంది పిల్లల్ని తమ బస్ డ్రైవర్లు స్పందించి కాపాడారని మిల్వాకీ కౌంటీ ట్రాన్సిట్ సిస్టమ్ అధికార ప్రతినిధి మాట్ సిల్కర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ట్రాన్సిట్ సంస్థ విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. -
కాళ్లు, చేతులు తీసేశారు.. కారణం తెలిస్తే షాక్
వాషింగ్టన్ : అమెరికా విస్కాన్సిన్కు చెందిన గ్రేగ్ మంటఫేల్(48) గత నెలలో ఆస్పత్రిలో చేరాడు. ఇప్పటికే అతని రెండు చేతులను మోచేతుల వరకూ తొలగించారు. మోకాళ్ల కింద భాగాన్ని కూడా తొలగించారు. ఇంకా కొన్ని సర్జరీలు చేయాల్సి ఉందని వైద్యులు తెలుపుతున్నారు. కాళ్లు, చేతులు తొలగించాల్సి వచ్చిందంటే చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యే అయ్యుంటుంది అనుకుంటున్నారా.. అవును గ్రేగ్ ఒక అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి సోకడానికి గల కారణం మాత్రం చాలా విచిత్రమైనది. అది ఏంటంటే కుక్క నాకడం వల్ల గ్రేగ్ పరిస్థితి ఇలా తయారయ్యింది. దాంతో లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు గ్రేగ్. వివరాల ప్రకారం.. గత నెలలో గ్రేగ్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది, ఫ్లూ లక్షణాలు అనుకోని సమీప ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ గ్రేగ్‌ను పరీక్షించిన వైద్యులు, అతను అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే వైద్యం చేసి చేతులు, కాళ్లను మోచేతులు, మోకాలు వరకూ తొలగించాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. అనంతరం ఆపరేషన్ చేసి గ్రేగ్ కాళ్లను, చేతులను తొలగించారు. అయినా వ్యాధి ఇంకా పూర్తిగా నయం కాలేదని , మరికొన్ని సర్జరీలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. గ్రేగ్‌కు వచ్చిన అరుదైన వ్యాధి గురించి వైద్యులు ‘సాధరణంగా పిల్లులు, కుక్కల లాలాజలంలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. అయితే దీని గురించి జంతు ప్రేమికులు భయపడాల్సిన పన్లేదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. కాబట్టి మీ పెంపుడు జంతువులను చూసి భయపడాల్సిన పన్లేదు. ఇంతకు ముందులానే మీ పెంపుడు జంతువులతో గడపోచ్చు’ అంటూ తెలిపారు. అయితే గ్రేగ్ వైద్య ఖర్చుల నిమిత్తం గోఫండ్‌మి పేజ్‌ను క్రియేట్ చేసి విరాళాలు సేకరిస్తున్నారు అతని బంధువులు. -
వెతికినా దొరకని సోదరి! చివరకు పక్కింట్లోనే
తన అక్కకోసం ఏళ్ళ తరబడి వెతికిన యువతికి పక్కింటమ్మాయే తన అక్క అని తెలిస్తే ఎలా ఉంటుంది? ఆ ఆనందానికి హద్దులుండవు కదూ! సరిగ్గా ఇదే అనుభవం హిల్లరీ హారీస్ కి ఎదురైంది. హిల్లరీ హారీస్‌ని చిన్నప్పుడే దత్తతకి ఇచ్చేసారు. పెరిగి పెద్దయ్యాక తనకు జన్మనిచ్చిన కుటుంబాన్ని గురించి తెలుసుకోవాలనుకుని ప్రయత్నం మొదలు పెట్టింది. ఏళ్ళతరబడి పరిశోధించినా తన కుటుంబం గురించి వివరాలు దొరకలేదు. తనకో అక్క ఉన్నట్టు, ఆమె పేరు డాన్ జాన్సన్ అని మాత్రమే తెలుసుకోగలిగింది. అంతకు మించిన వివరాలేవీ లేవు. గూగుల్‌ని అడిగితే చెపుతుందేమోనని ఆ ప్రయత్నం కూడా చేసింది హిల్లరీ హారీస్. కానీ డాన్ జాన్సన్ పేరు కొడితే పుంఖాను పుంఖాలుగా ఫొటోలు వచ్చిపడ్డాయి. వాటిల్లో కొద్దిగా అయినా తన పోలికలతో ఉన్న ఫొటో కోసం వెతికి, విఫలమైంది. ఇక ఇలా కాదనుకొని తన ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకుంది. అయితే గత ఏడాది ఒక రోజు అనూహ్యమైన సంఘటన జరిగింది. పక్కింట్లోకి ఓ జంట కొత్తగా వచ్చింది. ఆమె పేరు డాన్. దత్తత రికార్డులప్రకారం హారీస్ అక్క డాన్ జాన్సన్ నివసించిన విస్కాన్సిన్లోని గ్రీన్ వుడ్‌కి చెందిన వారామె. అందర్నీ తన అక్కగానే పోల్చి చూసుకునే హారీస్ డాన్ కూడా తన అక్కేనేమో అని భర్తతో పరాచికాలాడింది. కానీ ఆమే నిజంగానే తన అక్క అవుతుందని కలలో కూడా ఊహించలేదు. దానికి తోడు డాన్ పూర్తి పేరు తెలియకపోవడంతో ప్రతి రోజూ ఆమెను చూస్తూనే ఉన్నా తను వెతికుతోన్న వ్యక్తి ఆమేనని కనుక్కోలేకపోయింది హారీస్. 31 ఏళ్ల హారీస్ చొరవైన మనిషి కూడా కాకపోవడంతో పక్కింట్లోకి వచ్చి చేరిన 50 ఏళ్ళ డాన్ తో ఎప్పుడూ మాట్లాడింది కూడా లేదు. ఎనిమిది నెలలు అలానే గడిచిపోయాయి. గత ఏడాది ఆగస్టులో పక్కింటి డాన్ ఇంటిపై కప్పు పై నుంచి ఓ బ్యానర్‌ని వేళ్ళాడదీసారు. దానిపైన జాన్సన్ అనే పేరు వుంది. అంటే డాన్ పూర్తిపేరు డాన్ జాన్సన్. అడాప్షన్ రికార్డుల ప్రకారం డాన్ జాన్సన్ తన అక్క పూర్తి పేరు. ఒక్క గెంతు వేసి పక్కింటికెళ్ళి డాన్ జాన్సన్‌ని దగ్గరినుంచి పరిశీలనగా చూసింది. అచ్చంగా తన చేతులే. తనలాగే రింగుల జుట్టు. అయినా అడిగితే ఏమనుకుంటారోనని, అడిగే సాహసం చేయలేకపోయింది. ఇంటికెళ్లి డాన్ జాన్సన్ ఫోన్‌కి మొట్టమొదటిసారి మెసేజ్ పెట్టింది. మీ నాన్నగారి పేరేమిటి? ‘‘వీయాన్నే’’అటునుంచి సమాధానం. రిప్లై చూసి తన ప్రయత్నం ఫలించినట్టు అర్థమైంది హారీస్‌కి. డాన్ జాన్సన్ తన సోదరి. ఇంత కాలంగా తను వెతుకుతోన్న తన అక్క తన పక్కింట్లోనే ఉంది. ఆనందం పొంగిపొర్లింది. ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలు ఎక్కడెక్కడో పెరిగి చిట్టచివ్వరకు ఒక్కటయ్యారు. ఒకేతండ్రికి పుట్టిన ఇద్దరు యువతుల చెల్లాచెదురైన జీవితాలు చివరకు కలుసుకుని కథ సుఖాంతం అయ్యింది. ఎక్కడెక్కడో తమవారి కోసం వెతుకుతోన్న దత్తత పిల్లలకు హారీస్ మీ పక్కింట్లో కూడా వెతకండని ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూల్లో సలహాలిస్తోంది. -
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత!
అమెరికాలోని విస్కాన్సిన్లో మళ్లీ కాల్పులు మోత మోగింది. ఉత్తర విస్కాన్సిన్లో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారితోపాటు మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఓ బ్యాంకులో జరిగిన కుటుంబ వివాదం కారణంగా నిందితుడు కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఎవరెస్ట్ మెట్రో పోలీసు చీఫ్ వ్యాలీ స్పార్క్స్ వెల్లడించారు. నిందితుడి గురించి మరిన్ని వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో విస్కాన్సిన్లోని ఓ బ్యాంకులో, ఓ న్యాయసేవల సంస్థలో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్ర ఎదురుకాల్పుల అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
రీకౌంటింగ్‌పై ట్రంప్ సీరియస్..!
మళ్లీ లెక్కింపునకు సై అంటున్న హిల్లరీ వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రీకౌంటింగ్ దుమారం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్వల్ప తేడాతో గట్టెక్కిన విస్కాన్సిన్ రాష్ట్రంలో రీకౌంటింగ్‌కు ఎన్నికల సంఘం అంగీకరించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకవైపు రీకౌంటింగ్‌కు అంగీకరించడాన్ని ట్రంప్ తీవ్రస్థాయిలో తప్పుబడుతుండగా.. మరోవైపు ఓడిపోయిన హిల్లరీ క్లింటన్ వర్గం దీనిపై ఆశల్లో తేలియాడుతోంది. విస్కాన్సిన్ రాష్ట్రంలో చేపట్టే రీకౌంటింగ్ ప్రక్రియలో తాము కూడా పాల్గొంటామని హిల్లరీ ప్రచార అధికారి ఒకరు శనివారం స్పష్టం చేశారు. రీకౌంటింగ్ ఒక స్కాం అని, గ్రీన్ పార్టీ తమ ఖజానాను నింపుకోవడానికే రీకౌంటింగ్‌ను తెరపైకి తెచ్చిందని డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో మండిపడ్డారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి.. నైతికంగా దివాళా తీసిన డెమొక్రాట్లు దీనికి మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. రీకౌంటింగ్ వల్ల గెలుపు వరిస్తుందేమోనన్న తప్పుడు ఆలోచనతో డెమొక్రాట్లు ఉన్నారని సీరియస్ అయ్యారు. అమెరికాలో ఇలా ఎప్పుడు జరగలేదని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ స్వల్పతేడాతో గట్టెక్కిన మూడు రాష్ట్రాలైన విస్కాన్సిన్, మిచిగన్, పెన్సిల్వేనియాలలో రీకౌంటింగ్ జరుపాలన్న డిమాండ్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ చేసిన ఈ డిమాండ్ మేరకు విస్కాన్సిన్లో నమోదైన ఓట్లను మళ్లీ లెక్కించడానికి ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. దీనిని హిల్లరీ వర్గం పరోక్షంగా స్వాగతిస్తుండగా.. రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఓటింగ్‌లో పెద్ద ఎత్తున హ్యాకింగ్ జరిగిందని ఆరోపిస్తూ గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ రీకౌంటింగ్ ప్రక్రియను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆమె రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసిన పెన్సిల్వేనియాలో 70,010 ఓట్ల తేడాతో, మిచిగన్‌లో 10,704 ఓట్లతో, విస్కాన్సిన్లో 27,257 ఓట్లతో ట్రంప్ హిల్లరీపై విజయం సాధించారు. అయితే, ఈ మూడు రాష్ట్రాల రీకౌంటింగ్‌లో ట్రంప్ కన్నా హిల్లరీ ఆధిక్యం సాధించే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ మూడు రాష్ట్రాల్లో హిల్లరీ ట్రంప్‌పై విజయం సాధిస్తే.. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశముంది. -
అమెరికాలో రీకౌంటింగ్‌కు ఓకే!
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం. డొనాల్డ్ ట్రంప్ స్వల్పతేడాతో గట్టెక్కిన మూడు రాష్ట్రాల్లోనూ రీకౌంటింగ్ జరుపాలన్న డిమాండ్ వెల్లువెత్తడంతో విస్కాన్సిన్ రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్త రీకౌంటింగ్‌కు అంగీకరించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా విస్కాన్సిన్లో నమోదైన ఓట్లను మళ్లీ లెక్కించాలని గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ విజ్ఞప్తి చేయగా.. ఇందుకు ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. విస్కాన్సిన్ రాష్ట్రంలో రీకౌంటింగ్‌లో భాగంగా 30లక్షల బ్యాలెట్ ఓట్లను కూడా మళ్లీ లెక్కించనున్నారు. వచ్చేవారం ఈ రీకౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఇందుకు అయ్యే ఖర్చును గ్రీన్ పార్టీ కాంపెయినే భరిస్తుంది. ఫెడరల్ డెడ్‌లైన్ ప్రకారం డిసెంబర్ 13లోపు రీకౌంటింగ్ పూర్తిచేయాలి. ఈ గడువులోగా విస్కాన్సిన్లోని 72 కౌంటీల్లో రీకౌంటింగ్ పూర్తిచేయడానికి అధికారులు సాయంత్రాలు, వారాంతలు కూడా పనిచేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. రీకౌంటింగ్ ఫీజు 1.1 మిలియన్ డాలర్ల (రూ. 7.5 కోట్ల)వరకు అయ్యే అవకాశముందని భావిస్తున్నారు. (చదవండి: అమెరికా ఎన్నికల్లో హ్యాకింగ్? రీ కౌంటింగ్ కు పట్టు!) అనేక వ్యయప్రయాసలకు ఓర్చి గ్రీన్ పార్టీ అభ్యర్థి చేపడుతున్న ఈ రీకౌంటింగ్ ప్రక్రియ వల్ల ఓడిపోయిన హిల్లరీ వర్గీయుల్లో కొంత ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే, ప్రస్తుతం చేపడుతున్న రీకౌటింగ్ వల్ల ఈ నెల 8న జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారు అయి.. ట్రంప్ స్థానంలో హిల్లరీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపడుతుందా? అంటే ఆ అవకాశాలు చాలా స్వల్పమని, రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసిన మూడు రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టినా.. ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం చాలా తక్కువ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓటింగ్‌లో పెద్ద ఎత్తున హ్యాకింగ్ జరిగిందని ఆరోపిస్తూ గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టీన్ రీకౌంటింగ్ ప్రక్రియను తెరపైకి తెచ్చారు. ఆమె రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసిన మూడు రాష్ట్రాలు విస్కాన్సిన్, మిచిగన్, పెన్సిల్వేనియాలలో హిల్లరీపై స్వల్ప ఆధిక్యంతో ట్రంప్ విజయం సాధించారు. పెన్సిల్వేనియాలో 70,010 ఓట్ల తేడాతో, మిచిగన్‌లో 10,704 ఓట్లతో, విస్కాన్సిన్లో 27,257 ఓట్లతో ట్రంప్ విజయం సాధించారు. అయితే, ఈ మూడు రాష్ట్రాల రీకౌంటింగ్‌లో ట్రంప్ కన్నా హిల్లరీ ఆధిక్యం సాధించే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ మూడు రాష్ట్రాల్లో హిల్లరీ ట్రంప్‌పై విజయం సాధిస్తే.. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యే అవకాశముంది. -
'సొంతిట్లోనే బందీలయ్యాం.. కాపాడండి'
విస్కాన్సిన్: అమెరికాలోని అత్యవసర సర్వీసు 911కు విస్కాన్సి్న్ కు చెందిన దంపతులు ఫోన్ చేశారు. తాము బంధించబడ్డామని, వెంటనే వచ్చి తమను విడిపించాలని దీనంగా అభ్యర్థించారు. వారిని బంధించింది మనిషులు కాదు పిల్లి అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. జూన్ 17న ఈ ఫోన్ కాల్ వచ్చింది. 'మాకు ఒక పిల్లి ఉంది. దాని ప్రవర్తన వింతగా మారింది. నా భర్తపై దాడి చేసింది. మా సొంత ఇంటిలోనే బందీలుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసర సర్వీసుకు ఫోన్ చేస్తున్నాం. పిల్లి బారి నుంచి తప్పించి మమ్మల్ని కాపాడండి' అని బాధితురాలు 911కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన మిల్వాకీ ఏరియా డొమెస్టిక్ యానిమల్ కంట్రోల్ కమిషన్(ఎంఏడీఏసీసీ) దంపతులిద్దరినీ కాపాడింది. పిల్లి దాడిలో ఎవరూ తీవ్రంగా గాయపడలేదని స్థానిక మీడియా తెలిపింది.దంపతులను హడలగొట్టిన పిల్లిని దూరంగా తీసుకెళ్లి వదిలేశారు. 2014లో ఓర్లాండోలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తమ 7 నెలల చిన్నారిపై పిల్లి దాడి చేసిందని, తమను కాపాడాలంటూ ఓ తండ్రి 911కు ఫోన్ చేశాడు. -
16 ఏళ్లలో 160 పాములు కరిచినా..
-
16 ఏళ్లలో 160 పాములు కరిచినా..
కాలిఫోర్నియా: మనుషులకు పాము కరిస్తే.. ఏమవుతుంది? ప్రాణం పోతుంది, అంతే కదా! కానీ అమెరికా శాస్త్రవేత్త టిమ్ ఫ్రిదే(37)కు మాత్రం ఏమీ కాదు. పాముల విషాలపై పరిశోధనలు చేసే టిమ్‌ను 16 ఏళ్ల కాలంలో దాదాపు 160 పాములు కరిచాయి. చెప్పాలంటే ఆయనే కరిపించుకున్నాడు. వీటిలో ప్రపంచంలోనే అతి విషపూరితమైన ‘టైపన్, బ్లాక్ మాంబా’ లాంటి పాములు కరిచినా టిమ్ బతికి బట్టకట్టగలిగాడు. పాముల విష ప్రభావాన్ని పరిశోధించేందుకు, అతని శరీరం విషాన్ని తట్టుకునేందుకు వీలుగా ఉండేందుకు ఇలా చేశాడు. ప్రస్తుతం టిమ్‌కు ఏ పాము కరిచినా ఏమీ కావడం లేదంట. ప్రపంచవ్యాప్తంగా పాము కాటుకు గురై చనిపోతున్న వేలాదిమందిని కాపాడేందుకు తాను ఈ పరిశోధనలన్నీ చేస్తున్నానని చెబుతున్నారు. 2011లో ఒకేసారి రెండు కోబ్రా పాముల చేత కరిపించుకుని కోమాలోకి వెళ్లాడు. చావు అంచులదాకా వెళ్లి అదృష్టవశాత్తూ బతికాడు. ప్రస్తుతం టిమ్ శరీరంలో సాధారణ మనుషుల్లో కంటే అనేక రెట్లు అధికంగా యాంటీబాడీలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విషపాముల నుంచి మానవులను కాపాడే వ్యాక్సిన్‌ను తయారు చేసే ప్రయత్నాల్లో మునిగిపోయాడు టిమ్.