ట్రంప్‌పై హారిస్ మండిపాటు
వాషింగ్టన్: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ వ్యక్తులను పరస్పరం ఎగదోసి వారిమధ్య వైషమ్యాలు పెంచే రకమంటూ డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ దుయ్యబట్టారు. ట్రంప్ కంటే చాలా మెరుగైన వ్యక్తి మాత్రమే అమెరికాకు నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు. స్వింగ్ రాష్ట్రమైన విస్కాన్సిన్‌లో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
రాజకీయ ప్రత్యర్థులను, తనకు ఓట్లేయని వారని శత్రువులుగా భావించే ప్రమాదకరమైన మనస్తత్వం ట్రంప్ సొంతమని ఆక్షేపించారు. ఆయన జేబులో రాసిపెట్టుకున్న శత్రువుల జాబితా నానాటికీ పెరిగిపోతూనే ఉందన్నారు. ‘‘మరోవైపు రిపబ్లికన్ల నుంచి కూడా ఒకరికి నా మంత్రివర్గంలో చోటివ్వాలన్న మనస్తత్వం నాది. మా ఇద్దరి మధ్య ఇదే తేడా’’అని చెప్పుకొచ్చారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం రాణిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment