enemies
-
శత్రువులు..మిత్రులు
ఒక భక్తుడు అడవిలో కఠోర తపస్సు చేస్తున్నాడు. భగవంతుడు అతని ముందు ఓ ఆయుధంతో ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నీ భక్తికి మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో’’ అన్నాడు. దేవుడు అలా అడిగేసరికి భక్తుడు ఆగుతాడా...‘‘దేవుడా, నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులను నీ ఆయుధంతో నాశనం చేయాలి. ఇదే నా కోరిక’’ అన్నాడు.దేవుడు చిన్న నవ్వు నవ్వాడు. దానికేం చేసేస్తాను అంటూ అదృశ్యమయ్యాడు. కాసేపైంది. భగవంతుడి చేతిలో ఉన్న ఆయుధం తిన్నగా వచ్చి భక్తుడిపై దాడి చేసింది. భక్తుడు తడబడి కిందపడ్డాడు. ‘‘భగవంతుడా, ఏమిటిది... నా పురోగతికి అడ్డంకిగా ఉన్న శక్తులనే కదా నాశనం చేయమన్నాను. కానీ నువ్వు నా మీద దాడి చేయించావు అని అడిగాడు భక్తుడు. వరమడగటం తప్పయిపోయింది’’ అని బాధపడ్డాడు. కాసేపటికి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ‘‘భక్తా, నువ్వు చెప్పినట్లే ఆయుధాన్ని విసిరాను. నా తప్పమీ లేదు. అదేమీ గురి తప్పలేదు. సరిగ్గానే వచ్చింది’’ అన్నాడు దేవుడు. ఇతరులను దెబ్బతీయాలి. నాశనం చేయాలి... అని అనుకునే నీ మనసే నీ పురోగతికి పెను అడ్డంకి. నీ మనసే నీకు బద్ద శత్రువు. అదే నీ వృద్ధికి అడ్డుగోడగా ఉంది. అందుకే నా ఆయుధం నీ మీదకే దాడి చేసింది అని చెప్పాడు దేవుడు. దీనిని బట్టి మనకెవరు శత్రువో అర్థమై ఉండొచ్చు.మనకు మిత్రులెవరు....మనకు దొరికే మిత్రులను మూడు రకాలుగా విభజించవచ్చు. తాటి చెట్టు. కొబ్బరి చెట్టు. పోక చెట్టు. తాటి చెట్టు ఉంది చూసారూ అది తానుగా ఎదుగుతుంది. తానుగానే నీరు తాగుతుంది. తానుగా పెరుగుతుంది. మనకు ఫలితాన్ని ఇస్తుంది. మనకు ఎదురుపడి మనకు సహాయం చేసే మిత్రులు ఇలాంటి వారు.కొబ్బరి చెట్టు ఉంది చూసారూ... అది ఎప్పుడో అప్పుడు నీరు పోస్తే చాలు. పెరుగుతుంది. ఇలాగే ఎప్పుడైనా సహాయం చేస్తే దానిని గుర్తు పెట్టుకుని మనకు సాయపడే మిత్రులు ఇలాంటి వారు.పోక చెట్టు ఉంది చూసారూ... ఈ చెట్టుకి రోజూ నీరు పెట్టాలి. అప్పుడే పెరుగుతుంది. ఫలితాన్ని ఇస్తుంది. ఇలా రోజూ సహాయం చేస్తేనే మనల్ని గమనించే మిత్రులు ఉంటారు కొందరు. వీరు పోక చెట్టులాగా. కనుక మిత్రులు ఈ విధంగా ఎవరు ఎలాంటి వారో గుర్తు పెట్టుకోవచ్చు. దానికి తగినట్లు మెలగాలి. అది తప్పేమీ కాదు. – యామిజాల జగదీశ్ -
USA Presidential Elections 2024: వైషమ్యాలను పెంచుతారు
వాషింగ్టన్: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ వ్యక్తులను పరస్పరం ఎగదోసి వారిమధ్య వైషమ్యాలు పెంచే రకమంటూ డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ దుయ్యబట్టారు. ట్రంప్ కంటే చాలా మెరుగైన వ్యక్తి మాత్రమే అమెరికాకు నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు. స్వింగ్ రాష్ట్రమైన విస్కాన్సిన్లో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.రాజకీయ ప్రత్యర్థులను, తనకు ఓట్లేయని వారని శత్రువులుగా భావించే ప్రమాదకరమైన మనస్తత్వం ట్రంప్ సొంతమని ఆక్షేపించారు. ఆయన జేబులో రాసిపెట్టుకున్న శత్రువుల జాబితా నానాటికీ పెరిగిపోతూనే ఉందన్నారు. ‘‘మరోవైపు రిపబ్లికన్ల నుంచి కూడా ఒకరికి నా మంత్రివర్గంలో చోటివ్వాలన్న మనస్తత్వం నాది. మా ఇద్దరి మధ్య ఇదే తేడా’’అని చెప్పుకొచ్చారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం రాణిస్తుందన్నారు. -
ఎన్నికల చిత్రం : బంధువులే బద్ధశత్రువుల్లా.. !
సాక్షి, దాదర్: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. కొద్దీ రాష్ట్ర రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇవ్వనున్నారో, ఎవరికి మొండిచేయి చూపనున్నారో తెలియని అయోమయ పరిస్ధితి నెలకొంది. ప్రస్తుతం ప్రధాన కూటములైన మహా వికాస్ ఆఘాడి (ఎంవీఏ), మహాయుతి కూటముల మధ్య సీట్ల సర్దుబాటుపై దాదాపు రాజీ కుదిరింది. ముఖ్యంగా బీజేపీ 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. జాబితా ప్రకటనల్లాంటివేమీ లేకుండా 17 మంది అభ్యర్థులకు ఎన్సీపీ (ఏపీ) ఏకంగా ఏపీ ఫారాలను పంపిణీ చేసింది. ఇక మిగిలిన సీట్లలో ఎవరు ఎక్కడి నుంచి పోటీచేస్తారనేది ఇరు కూటములు =స్పష్టం చేయలేదు. దీంతో కొందరు ఆశావహులు పార్టీ టికెటుపై పోటీ చేయాలా..?లేక స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగాలా అనేది ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు, సమీప బంధువులు, వారసులు ఇలా...దగ్గరివారి మధ్యే హోరాహోరీ పోటీ జరిగింది. పంతాలు, పట్టింపులతో ఏ ఒక్కరూ వెనకడుగు వేయలేదు. నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. ఒకానొక సమయంలో ఒకే కుటుంబానికి చెందిన వారు బద్ధశత్రువుల్లా పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 20వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్ధితి పునరావృత మవుతుందా..? లేదా..? అనేది అభ్యర్ధుల పేర్ల ప్రకటన తరువాత గానీ పూర్తి స్పష్టత రాదు.ఇదివరకు జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబంలోని ఇద్దరు సోదరులు, తండ్రీకొడుకులు, అన్నా చెల్లెళ్లు, భార్యాభర్తలు, తాతామనవడు, మామాకోడలు అలాగే దగ్గరి బంధువులు, వారసులు తలపడ్డారు. వీరిలో ఇందులో ఒకరు గెలిచి మరొకరు ఓడి ఎమ్మెల్యే, ఎంపీ లేదా మంత్రి పదవుల్లో కొనసాగారు. కానీ అప్పటితో పోలిస్తే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సుమారు రెండున్నరేళ్ల క్రితం శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) లాంటి ప్రధాన పార్టీలు చీలిపోయాయి. రెండు పారీ్టలు నాలుగుగా మారిన నేపథ్యంలో ఎక్కువ మంది అభ్యర్ధులకు పోటీచేసే అవకాశం లభించనుంది. దీంతో అసంతృప్తి, తిరుగుబాటుకు అవకాశాలు చాలా తక్కువ అని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. ఏదైమైనా అభ్యర్ధుల పేర్ల ప్రకటన తరువాత మాత్రమే స్పష్టత రానుంది. ముఖ్యంగా టికెట్ ఆశించి భంగపడినవారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎవరిపై తిరుగుబాటు చేస్తారు...? ఎవరి ఓట్లు ఎవరు చీలుస్తారు..? స్వతంత్ర అభ్యర్ధిగా ఎవరు బరిలోకి దిగుతారు అనేది త్వరలో తేటతెల్లం కానుంది. ముంబైలోని అణుశక్తి నగర్ అసెంబ్లీ నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత నవాబ్ మలిక్ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయ మని తేలిపోయింది. అయితే ఈసారి ఆయన మాన్‌ఖుర్ద్–శివాజీనగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన కుమార్తై సనా మలిక్ అణుశక్తినగర్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఎన్సీపీలో చీలిక తరువాత నవాబ్ మలిక్ అజిత్ పవార్ వర్గంలో చేరారు. బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన ప్పటికీ అజిత్ పవార్ ఆయన్ను దూరం చేసుకోలేదు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా అణుశక్తి నగర్, మాన్‌ఖుర్ద్–శివాజీనగర్ ఈ రెండు నియోజక వర్గాలు అజిత్ పవార్‌కు లభించడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. దీంతో తనకు మంచి పట్టున్న అణుశక్తి నగర్ నుంచి మాన్‌ఖుర్డ్–శివాజీనగర్ నుంచి మలిక్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా 2009లో జరిగిన వార్డు పునరి్వభజన తరువాత అణుశక్తి నగర్ నూతన నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఈ నియోజక వర్గంలో ఎన్సీపీ–శివసేన మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో శివసేన అభ్యర్థి కాతే, నవాబ్ మలిక్‌ను ఓడించారు. కాగా మాన్‌ఖుర్ద్–శివాజీనగర్ నియోజక వర్గంలో సమాజ్‌వాది పార్టీకి చెందిన ఆబూ ఆజ్మీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక్కడ ముస్లింల ఓటుబ్యాంకు అధికంగా ఉండటంతో నవాబ్‌మాలిక్ ఆబూ ఆజీ్మకి ప్రత్యర్థిగా సనాను పోటీలో నిలపాలని నిర్ణయించారు. గతంలో ఒకే కుటుంబం, దగ్గరి బంధువులు, వారసుల మధ్య జరిగిన పోటీ వివరాలు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుసద్ నియోజక వర్గంనుంచి నాయిక్ కుటుంబానికి చెందిన ఇద్దరు వారసులు ఇంద్రనీల్ నాయిక్ ఎన్సీపీ నుంచి నీలయ్ నాయిక్ బీజేపీ నుంచి పోటీచేశారు. వీరిలో ఇంద్రనీల్ విజయం సాధించారు. ఇప్పుడాఇద్దరూ మహాయుతిలో కొనసాగుతున్నారు. 2019లో బీడ్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎన్సీపీ తరఫున సందీప్ క్షిర్సాగర్, ఆయన బాబాయ్, శివసేన అభ్యరి్ధ, మాజీ మంత్రి జయ్వంత్ క్షిర్సాగర్ పరస్పరం తలపడ్డారు. సందీప్ కేవలం 1984 ఓట్ల తేడాతో బాబాయ్ జయ్వంత్ను ఓడించారు.2019లో అప్పటి గ్రామాభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే పర్లీ నియోజక వర్గం నుంచి బీజేపీ టికెట్‌పై బరిలోకి దిగారు. ఆమె ప్రత్యరి్ధగా స్వయానా చిన్నాన్న కుమారుడు ధనంజయ్ ముండే బరిలో ఉన్నారు. అయిదే పంకజాను 30 వేల ఓట్ల తేడాతో ధనంజయ్ ఓడించారు. అంతకు ముందుగా 2014లో జరిగిన ఎన్నికల్లో పంకజా ధనంజయ్‌ను 25వేల ఓట్ల తేడాతో ఓడించారు. ప్రస్తుతం బీజేపీ, అజీత్ పవార్ (ఎన్సీపీ) వర్గం మహాయుతిలో మిత్రపక్షా లుగా ఉన్నాయి. దీంతో పంకజా, ధనంజ య్ ఒకే కూటమిలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంకజాకు మద్దతుగా ధనంజయ్ జోరుగా ప్ర చారం చేశారు. ఇందుకు బదులుగా ప్రస్తు తం అసెంబ్లీ ఎన్నికల్లో పంకజా , ధనంజయ్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సాతారా జిల్లాలోని మాణ్ నియోజక వర్గంలో బీజేపీ తరఫున జయ్‌కుమార్ గోరే, ప్రత్యర్ధిగా స్వతంత్ర అభ్యర్ధి ప్రభాకర్ దేశ్‌ముఖ్ బరిలో దిగారు. ఇద్దరి తల్లులూ అక్కాచెల్లెళ్లు కావడంతో వారిద్దరూ ఒకరికొకరు అన్నదమ్ముల వరస అవుతారు. అయినాసరే పోటీకి సై అన్నారు. ఈ ఎన్నికల్లో గోరే సుమారు మూడువేల ఓట్లతో గెలుపొందారు. ఆ సమయంలో బీజేపీ, శివసేన కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ కాని మాణ్, కణ్కావ్లీలో మాత్రం పొత్తులో లేవు. అలాగే జయ్‌కుమార్ సొంత సోదరుడు శేఖర్ గోరే శివసేన తరపున పోటీ చేశారు. జయ్‌కుమార్ విజయం సాధించగా, ప్రభాకర్ రెండో స్ధానంలో, శేఖర్ మూడో స్ధానంలో నిలిచారు. సాతారాలో ప్రస్తుత ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే (బీజేపీ) 1999లో స్వయాన బాబాయ్ అభయ్సింహ్రాజే బోంస్లే (ఎన్సీపీ) చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం అభయ్సింహ్రాజే కుమారుడు శివేంద్రసింహ్ సాతారాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే శివేంద్రసింహ్, ఉదయన్‌రాజే ఇరువురూ ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు. 1990లో ఉదయన్‌రాజే తల్లి కల్పనరాజే (శివసేన)పై అభయ్సింహ్రాజే గెలిచారు. లాతూర్ జిల్లాలోని నిలంగా అసెంబ్లీ నియోజక వర్గంలో బాబాయ్–సోదరుడి కొడుకు, తాతా–మనవడు మధ్య గత అనేక సంవత్సరాలుగా రాజకీయ పోరు జరుగుతోంది. 2014, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సంభాజీ పాటిల్ నిలంగేకర్ బాబాయ్ అశోక్‌రావ్ పాటిల్ నిలంగేకర్ను ఓడించారు. అదేవిధంగా 2004లో జరిగిన ఎన్నికల్లో సంభాజీ పాటిల్ నిలంగేకర్కు ఆయన తాత మాజీ ముఖ్యమంత్రి శివాజీరావ్ పాటిల్ నిలంగేకర్ల మధ్య ఎన్నికలపోరు జరిగింది. ఈ పోటీలో సంభాజీ కేవలం రెండు వేల ఓట్లతో శివాజీరావ్‌ను ఓడించారు. అయితే 2009లో శివాజీరావ్ తన మనవడు సంభాజీని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. సాంగ్లీ అసెంబ్లీ నియోజక వర్గంలో 1995లో జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్ కుమారుడు ప్రకాశ్‌బాపు పాటిల్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. ఆయనకు ప్రత్యరి్ధగా బాబాయ్ కుమారుడు మదన్ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ పోరులో ఓట్లు చీలిపోయి జనతాదళ్ అభ్యర్ధి సంభాజీ పవార్ గెలుపొందారు.2014లో సింద్ఖేడ్ నియోజక వర్గంలో బావా–మరదలు రేఖాతాయి ఖేడేకర్ (ఎన్సీపీ), శశికాంత్ ఖేడేకర్ (శివసేన) మ«ధ్య ఎన్నికల పోటీ జరిగింది. ఈ పోరులో శశికాంత్ విజయ ఢంకా మోగించారు. -
పాక్, చైనాలకు విదేశీ సాయం కట్ చేస్తా
రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాను అదికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటుందో చెబుతూ.. ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే నిక్కీ అమెరికా విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే పాక్, చైనాతో పాటు అమెరికాను ద్వేషించే శత్రు దేశాలకు విదేశీ సాయంలో కోత విధిస్తానని చెప్పారు. గర్వించదగ్గ అమెరికా ఎప్పుడూ ప్రజల సొమ్మును వృధా చేయదన్నారు. అమెరికా గతేడాది విదేశీ సహాయం కోసం 46 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అది ఇతర దేశాల కన్నా ఎక్కువ అని కూడా చెప్పారు. అంతేగాదు ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో పన్ను చెల్లింపుదారులు తెలుసుకునే హక్కు ఉందన్నారు. వాస్తవానికి ఆ సొమ్ము అంతా అమెరికాను వ్యతిరేకించే దేశాలకు నిధులు సమీకరించడానికి వెళ్తుందని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తాను అధికారంలో ఉంటే మాత్రం అమెరికా విరోధులకు అందించే సాయంలోని ప్రతి పైసాలో కోత విధిస్తానని కరాకండీగా చెప్పారు. బైడెన్ ప్రభుత్వం పాక్‌కి మళ్లీ సైనిక సాయాన్ని ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదులకు నిలయమైన ఆ దేశ ప్రభుత్వం అమెరికాను వ్యతిరేకించే చైనాకు లోబడి ఉంది. అంతేగాదు పాలస్తీనా ప్రజల కోసం అని అమెరికా యూఎన్ అవినీతి ఏజెన్సీని అర బిలియన్ డాలర్లతో పునురుద్ధరించిందన్నారు. అలాగే ఇరాన్‌కి యూఎస్ సుమారు రెండు బిలయన్ డాలర్లు సాయం అందిస్తే..అది యూఎస్ దళాలపైనే దాడులకు దిగింది. అంతేగాదు యూఎన్‌లో అమెరికాకు అత్యంత వ్యతిరేకంగా ఓటింగ్ వేసే దేశాల్లో ఒకటైన జింబాబ్వేకు కూడా వందల బిలయన్ డాలర్లు అందించింది. అత్యంత హాస్యాస్పదమైన విషయమేమిటంటే. .చైనా నుంచి అమెరికాకు తీవ్ర స్థాయిలో ముప్పు ఉన్నప్పటికీ పర్వావరణ కార్యక్రమాల పేరుతో చైనాకు డాలర్లు అందిస్తోంది. అంతేగాదు రష్యన్ నియంత వ్లాదిమర్ పుతిన్ అత్యంత సన్నిహితమైన బెలారస్‌కి కూడా సాయం అందించాం. అలాగే క్యూబాకి కూడా సాయం అందించాం. " అంటూ విరుచుకుపడ్డారు నిక్కీ హేలీ. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. కేవలం అధ్యక్షుడు జో బైడెన మాత్రమే కాదు ఇరు పార్టీల అధ్యక్షులు దశాబ్దాలుగా విదేశీ సాయం విషయంలో ఇలాగే కొనసాగారు. వారంతా మా సహాయన్ని స్వీకరించే దేశాల ప్రవర్తనను పరిగణలోకి తీసుకోలేదన్నారు. తాను అధికారంలోకి వస్తే అమెరికా వ్యతిరేక దేశాలకు సాయం చేసి డాలర్లను వృధా చేయనని చెప్పారు. మన ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును అలాంటి దేశాలకు నిధులుగా అందించేదే లేదని తెగేసి చెప్పారు నిక్కీ హేలీ. (చదవండి: పాపం శ్రీలంక.. తిందామంటే జనాలకు తిండి లేదు.. ఇక ఎన్నికలు ఎలా?) -
‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం
సాక్షి,ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీలో నిన్న, మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డిలదే పైచేయి. నాలుగు జిల్లాల్లో అయితే ఆ వర్గం లేని పక్షంలో ఈ వర్గం అన్నట్లుగా పార్టీ వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. ముఖ్య నాయకులంతా వారి అనుచర వర్గంగానే కొనసాగారు. ఏళ్లుగా ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వైరం కొనసాగుతూ వచ్చింది. తాజాగా సేవ్ కాంగ్రెస్ నినాదంతో రాష్ట్రంలోని కొంత మంది ముఖ్యనేతలు తిరుగు బావుటా ఎగరవేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగా మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు ఒక్కటవడాన్ని పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇదిలా ఉంటే వారి తీరును ఖండిస్తూ కొంత మంది నాయకులు వ్యతిరేకంగా కదలడం పార్టీలో ఇప్పుడు సంచనలం కలిగిస్తోంది. తద్వారా ఈ రెండు వర్గాలకు ధీటుగా మరో వర్గం కీలకంగా తయారవుతుందన్న చర్చ సాగుతోంది. ఇటీవల ఆదిలాబాద్‌లో మీడియా సమావేశంలో ఏఐసీసీ సభ్యులు నరేశ్‌జాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు కొత్త కమిటీల తరువాత.. ఇటీవల పార్టీ అధిష్టానం కొత్త కమిటీలను నియమించింది. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సాజిద్‌ఖాన్‌ను పూర్తి స్థాయిలో నియమించింది. గతంలో ఆయన ఇన్‌చార్జీగా కొనసాగారు. మహేశ్వర్‌రెడ్డి అనుచరుడిగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలిగా మరోసారి ప్రేమ్‌సాగర్‌రావు సతీమణి కె.సురేఖనే నియమించారు. నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి అనుచరుడు ముత్యంరెడ్డికి అవకాశం కల్పించారు. కుమురం భీం ఆసిపాబాద్‌లో పెండింగ్‌లో పెట్టారు. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి టీపీసీసీ ఎగ్జిక్యూటీవ్ కమిటీలో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డికి చోటు కల్పించారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో కీలకంగా వ్యవహరించకపోయినా తనకంటూ ప్రత్యేక అనుచరగణం ఉంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గండ్రత్ సుజాతతో పాటు ఉట్నూర్‌కు చెందిన వెడ్మ బొజ్జుకు చోటు కల్పించారు. ఆయన నేరుగా రేవంత్‌రెడ్డి అనుచరుడిగా పేరుంది. తాజా రాజకీయాల నేపథ్యంలో సుజాత సైలెంట్‌గా ఉండగా, బొజ్జు పార్టీలో పట్టుసాధించేందుకు గట్టి యత్నాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు ఎగ్జిక్యూటీవ్ కమిటీతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానూ నియమించారు. పార్టీ పరిస్థితులపై ప్రస్తుతం ఆయన స్తబ్దుగానే ఉన్నారు. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లో కొంత మంది నాయకులకు రాష్ట్ర కమిటీల్లో చోటు దక్కింది. వారు ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులుగా ఉన్నారు. దీంతో జిల్లా, రాష్ట్ర కమిటీల పరంగా ముఖ్య నేతల అనుచరులకు ప్రాధాన్యత ఇస్తూనే కొత్త నాయకులకు పార్టీ అవకాశం కల్పించింది. చదవండి: కేసీఆర్ డ్రగ్ టెస్ట్ సవాల్‌పై బండి సంజయ్ కౌంటర్ నేతల తీరుపై ధ్వజం.. కాంగ్రెస్‌లో రాష్ట్ర స్థాయిలో కొంత మంది ముఖ్య నేతలు సేవ్ కాంగ్రెస్ నినాదం అందుకోగా అందులో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యనేతలు ఉండటం, వారి తీరును ఖండిస్తూ ఆదిలాబాద్‌లో కొంత మంది కాంగ్రెస్ నాయకులు ప్రెస్‌మీట్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. తద్వారా రానున్న రోజుల్లో ఈ రెండు వర్గాలే కాకుండా వారికి వ్యతిరేకంగా మరో వర్గం తయారైందనేది స్పష్టం అవుతోంది. ఇది ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే సేవ్ కాంగ్రెస్ నినాదం పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
విచ్ఛిన్న శక్తులను ఎదిరిద్దాం
కేవాడియా: భారతదేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు శత్రువులు కుట్రలు పన్నుతున్నారని, అలాంటి కుయుక్తులకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విచ్ఛిన్నకర శక్తులను ఎదిరించాలని అన్నారు. దేశ తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం ఘనంగా నివాళులర్పించారు. గుజరాత్‌లోని కేవాడియాలో ఐక్యతా ప్రతిమ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) వద్ద ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘‘మోర్బీ వంతెన దుర్ఘటనలో మృతిచెందిన వారి పట్ల నా మనసంతా ఆవేదనతో నిండిపోయింది. అయినా విధి, బాధ్యత నన్నిక్కడి తీసుకొచ్చాయి’’ అన్నారు. ఐక్యతా ప్రతిమ వద్ద సాంస్కృతిక నృత్యాలను ప్రమాదం దృష్ట్యా రద్దు చేశారు. ‘‘పటేల్ లాంటి నాయకుడు లేకపోతే ఇండియా పరిస్థితి ఏమిటో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఐక్యత అనేది మనకు నిర్బంధం, బలవంతం కాదు. అదే మన విశిష్టత. గతంలో వెదజల్లిన విషం తాలూకూ దుష్పరిణామాలు ఇప్పుడూ కనిపిస్తున్నాయి. విదేశీ శక్తులు మనకు చేటు చేసేందుకు చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాయి. వారికి గుణపాఠం చెబుదాం’’ అన్నారు. పటేల్ ప్రధాని అయ్యుంటే... జయంతి వేడుకలో అమిత్ షా వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సర్దార్ పటేల్ భారత తొలి ప్రధాని అయితే ప్రస్తుతం దేశానికి కొన్ని సమస్యలుండేవి కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పటేల్ 147వ జయంతి సందర్భంగా ఢిల్లీలో సర్దార్‌పటేల్ పాఠశాల విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘లక్షద్వీప్, జోధ్‌పూర్, జునాగఢ్, హైదరాబాద్, కశ్మీర్ వంటి కీలక సంస్థానాలను పటేలే దేశంలో విలీనం చేశారు. కాంగ్రెస్ వర్కింట్ కమిటీలో అత్యధిక ఓట్లు సాధించినా ప్రధాని పదవిని త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు దేశాన్ని కొన్ని అంశాలు వేధిస్తున్నాయి’’ అని అన్నారు. సర్దార్ పటేల్‌కు మోదీ సెల్యూట్ -
ఇండస్ట్రీలో నాకు చాలామంది శత్రువులు ఉన్నారు: నిత్యామీనన్
తమిళసినిమా: తనకు శత్రువులు ఉన్నారు.. అని అంటున్నారు నటి నిత్యామీనన్. ఈ మాలీవుడ్ నటి టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోలేకపోయినా, ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్న నటి అని పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా పొగరుబోతు అనే ముద్ర కూడా వేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన ఓకే కణ్మణి చిత్రం సక్సెస్ తరువాత ఆయన దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించే అవకాశం వస్తే దాన్ని తిరస్కరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అదే విధంగా ఒక మలయాళ చిత్ర షూటింగ్లో ఉన్న నిత్యామీనన్‌ను కలవడానికి ఒక నిర్మాత రాగా ఆయన్ని కలవడానికి నిరాకరించిందనే ఘటన అప్పట్లో కలకలం రేకెత్తించింది. ఇక ఈ మధ్య నటి నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వ్యక్తి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు మలయాళ చిత్ర పరిశ్రమ ఒక దశలో నిత్యామీనన్‌పై రెడ్ కార్డు విధించాలనే వరకూ వచ్చింది. ఇలాంటి వివాదాస్పద ఘటనలు నిత్యామీనన్ జీవితంలో చాలానే ఉన్నాయి. కాగా చాలా కాలం తరువాత ఈ సంచలన నటి కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా నటించిన తిరుచిట్రంఫలం చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఒక భేటీలో నటి నిత్యామీనన్ పలు విషయాల గురించి మనసు విప్పి చెప్పారు. అందులో ముఖ్యంగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తనకు చాలా మంది శత్రువులు ఉన్నారని అన్నారు. మనం ఎదుగుతున్నప్పుడు గిట్టని వాళ్లు చాలా మంది కాళ్లు పట్టుకుని కిందకు లాగాలని భావిస్తారని అన్నారు. వాళ్ల మాట వినకపోతే వదంతులు ప్రచారం చేయడానికీ వెనుకాడరన్నారు. నిత్యామీనన్‌తో పని చేయడం చాలా కష్టం అంటారని, అయితే తాను చాలా మందితో కలిసి పని చేశానని, ఎవరూ అలా భావించలేదని అన్నారు. కారణం తాను ఎలాంటి వ్యక్తినో వారందరికీ తెలుసని స్పష్టం చేశారు. -
తస్మాత్ జాగ్రత్త!
మాస్కో: తమను బెదిరించాలనుకునేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ శత్రుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. సర్మాత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రష్యా విజయవంతంగా పరీక్షించిందని బుధవారం ఆయన ప్రకటించారు. ఈ క్షిపణులకు ఎదురులేదని చెప్పారు. ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న కింజల్, అవాంగార్డ్ క్షిపణులకు సర్మాత్ తోడవనుంది. గతనెల తొలిసారి రష్యా కింజల్ క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. సర్మాత్ విజయవంతంపై సైంటిస్టులను పుతిన్ అభినందించారు. ఉత్తరరష్యాలో వీటిని ప్రయోగించామని, విజయవంతంగా ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ప్రపంచంలోని సుదూర తీరాలు కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయని వెల్లడించింది. వీటిని నిఘా వ్యవస్థలు కనిపెట్టడం కూడా కష్టమని నిపుణులు తెలిపారు. 200 టన్నులుండే ఈ మిసైల్ భూమి మీద ఏ లక్ష్యాన్నైనా చేరగలదని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. డోన్బాస్లో సాధారణ జనజీవనం నెలకొనేవరకు తమ ప్రయత్నాలు ఆపమని చెప్పారు. మరోవైపు తమ డిమాండ్ల ముసాయిదా ప్రతిపాదనను చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌కు అందించామని రష్యా అధికారులు తెలిపారు. ఇకపై చర్చలు కొనసాగలంటే ఉక్రెయిన్ స్పందించాల్సిఉందన్నారు. చర్చల జాప్యానికి ఉక్రెయినే కారణమని విమర్శించారు. మారియుపోల్‌పై ఫోకస్ కొద్దిమంది ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్న మారియుపోల్‌పై రష్యా మరింత ఒత్తిడి పెంచింది. దీంతో పాటు డోన్బాస్లో పలు ప్రాంతాల్లో యుద్ధ తీవ్రతను పెంచింది. మారియుపోల్‌లో ఉక్రెయిన్ సైనికులు తలదాచుకున్న స్టీల్‌ప్లాంట్‌పై రష్యా తీవ్రమైన బాంబింగ్ జరిపినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. స్టీల్మిల్ను తదనంతరం నగరాన్ని స్వాధీనం చేసుకోవడంపైనే రష్యా దృష్టి పెట్టిందన్నారు. నగరం నుంచి పౌరుల తరలింపునకు ప్రాథమిక అంగీకారానికి వచ్చామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. అయితే దీనిపై రష్యా స్పందించలేదు. స్టీల్‌ప్లాంట్‌లో సైనికులు సరెండర్ అవ్వాలని మాత్రం మరోమారు అల్టిమేటం జారీచేసింది. ఈ నేపథ్యంలో నగరవాసులు వీలైనంత త్వరగా నగరం వీడాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. తమపై రష్యా అన్ని రకాలుగా పోరు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. తమను లొంగదీçసుకునేందుకు పౌర ఆవాసాలపై కూడా దాడులు చేస్తోందన్నారు. మారియుపోల్, డోన్బాస్ స్వాధీనానికి రష్యా వేలమందిని రంగంలోకి దించిందని పాశ్చాత్య దేశాలు తెలిపాయి. ఉక్రెయిన్‌కు సహాయాన్ని మరింత పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌కు నార్వే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పంపింది. హెవీ ఆర్టిలరీని పంపుతామని కెనెడా ప్రకటించింది. ► డోన్బాస్ రక్షణకు సైనికులను తరలించకుండా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ నగరాలన్నింటిపై దాడులు ముమ్మరం చేసిందని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. ► ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన చర్చలపై చర్చించేదుకు ఉక్రెయిన్, రష్యాల్లో పర్యటిస్తానంటూ ఆయా దేశాధినేతలకు ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ లేఖలు రాశారు. ► ఉక్రెయిన్‌కు మరో ప్యాకేజీ ప్రకటిస్తామని అమెరికా తెలిపింది. పలువురు ప్రపంచ నాయకులతో అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. ► చెర్నోబిల్‌లో రష్యా సైనికులు ఇష్టారీతిన ప్రవర్తించడంతో అణులీకేజి ముప్పు పెరిగిందని ఉక్రెయిన్ ఆరోపించింది. రేడియేషన్ స్థాయిలను కొలిచే పరికరాలను రష్యా సైనికులు దొంగిలించారని తెలిపింది. ► ఉక్రెయిన్ సంక్షోభంతో 50 లక్షలకు పైగా శరణార్థులయ్యారని ఐరాస అంచనా వేసింది. ► రష్యా, బెలారస్ క్రీడాకారులను వింబుల్డన్‌లో నిషేధిస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. ► రష్యాకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. -
వీరుడి విరమణ
అతనొక మాజీ సైనికుడు. ఇప్పుడంటే మాజీ అయ్యాడు కానీ, అతని పేరు చెబితేనే శత్రువులకు హడల్. చిన్నప్పుడు బాగా బలహీనంగా ఉండేవాడు. కానీ, అతనికున్న సాహసగుణం వల్ల, ధైర్యమనే లక్షణం వల్ల సిపాయిగా చేరాలన్న తన కోరికను ఎంతో కష్టంమీద నెరవేర్చుకున్నాడు. ఆ సాహసం వల్ల సిపాయి స్థానం నుండి సైనికాధికారి స్థాయికి చేరుకోగలిగాడు. గెలుస్తామనే ఆశ ఏమాత్రం లేని అనేక పోరాటాల్లో ఆయన తన సైన్యాన్ని నేర్పుగా ముందుకు నడిపించి, ఘన విజయాలు సాధించాడు. శత్రువులు దొంగదెబ్బ తీయడం వల్ల ఒక యుద్ధంలో కుడిచేతిని, మరొక యుద్ధంలో ఎడమ కంటిని కోల్పోయాడు. అలాగే పోరాడి విజయాన్ని సాధించాడు. అతను చేసిన ఈ యుద్ధాన్ని అందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు. అతను ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది. ఉద్యోగ బాధ్యతల నుంచి అధికారికంగా అయితే తప్పుకున్నాడు కానీ, మానసికంగా మాత్రం ఎప్పటికీ తప్పుకోదలచుకోలేదు. ‘ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకుని హాయిగా విశ్రాంతి తీసుకోక ఎందుకు శ్రమపడతావు?’ అని ఎందరు ఎన్ని విధాలుగా చెప్పి చూసినా వినలేదతను. ‘కన్నుతోనూ, చేతితోనూ చేసేదే యుద్ధం కాదు. యుద్ధానికి అవసరమైనది మస్తిష్కం. అంతకుమించి, సాహసోపేతమైన దృఢచిత్తం కావాలి. నాలో పోరాట పటిమ ఎప్పటికీ చావదు. సాహసం చేయాలన్న నా మనసు ఊరకనే కూర్చోదు. అందువల్ల నేను ఉద్యోగం నుంచి విరమిస్తేనేం, ధైర్య సాహసాలు గల యువకులకు ప్రేరణ, ప్రోత్సాహం కలిగించే కథలు చెబుతాను, వారికి యుద్ధ తంత్రం నేర్పుతాను. నాలాంటి మరికొంత మంది సైనికులను తయారు చేస్తాను. నా ఊపిరి ఉన్నంత కాలమూ నాలోని సైనికుడు చావడు. పరిస్థితులతో యుద్ధం చేస్తూనే ఉంటాడు’ అని చెప్పటమే కాదు, అలాగే జీవించాడు కూడా. నీతి ఏమిటంటే.. వయసుకు మాత్రమే విరమణ ఉంటుంది. మనసుకు కాదు. – డి.వి.ఆర్. -
రెండు తాళం చెవులు
త్రీహిల్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నుంచి ఫోన్‌కాల్ అందుకున్న వెంటనే సిబ్బందితో అక్కడకు వెళ్లాడు క్రైమ్ ఎస్సై కాళిదాస్.గత రాత్రి హాస్పిటల్లో చేరిన రాజారావు మరణించాడు. సూర్యం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.వాళ్లిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారో హాస్పిటల్ సూపరింటెండెంట్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నాడు క్రైమ్ ఎస్సై కాళిదాస్.వెంటనే డీలక్స్ హోటల్‌కు చేరుకున్నాడు. హోటల్ సిబ్బంది ద్వారా వివరాలను సేకరించాడు. రాజారావు, సూర్యంల గురించి సమాచారం తెలుసుకున్నాడు. ముందురోజు రాత్రి హోటల్లో వెట్ పార్టీ జరిగిందని, ఆ పార్టీలో పాల్గొన్న వాళ్లంతా ప్రముఖుల కొడుకులని, రాజారావు వీరభద్రం కొడుకని, రోహిత్ పుల్లారావు కొడుకని, వీరభద్రం, పుల్లారావు రాజకీయ ప్రత్యర్థులని తెలుసుకున్నాడు కాళిదాస్. కిందటి సంవత్సరం పుల్లారావు, వీరభద్రం వ్యాపార గొడవలతో ఒకరినొకరు రివాల్వర్స్తో కాల్చుకుని మరణించారు. ఆ కేసు ఇంకా పూర్తి కాకుండానే ఈ సంఘటన జరిగింది. డీలక్స్ హోటల్ రూమ్ నంబర్–111లోకి తన సిబ్బందితో సహా ప్రవేశించాడు ఎస్సై కాళిదాస్.ఏఎస్సై శంకరం ఆ గదిని క్షుణ్ణంగా పరిశీలించాడు.గదిలోని టేబుల్ మీద గాజు గ్లాసులు ఉన్నాయి. పెద్ద సోఫాకు రెండు వైపులా పూలకుండీలు ఉన్నాయి. కుడివైపు పూలకుండీలో ఉన్న మట్టి కొంతతడిగా ఉంది. ఆ మట్టిని కొంత సేకరించి, ల్యాబ్‌కు పంపాడు శంకరం. ఆ గదిలో మూలన పడి ఉన్న హెరాయిన్, గంజాయిని కూడా సేకరించాడు.గది ముందు నిలుచున్న రూమ్‌బాయ్‌ని పిలిచాడు ఎస్సై కాళిదాస్. ‘‘నీ పేరు’’‘‘అప్పారావు సార్’’‘‘నిన్న రాత్రి ఈ రూమ్‌లో ఎవరెవరు ఉన్నారో చెప్పగలవా?’’ ప్రశ్నించాడు కాళిదాస్.‘‘ఈ కుడి పక్కనున్న పూలకుండీ పక్కనే డాలీ మేడమ్, ఆమె పక్కన రాజారావు గారు, సూర్యంగారు, అక్బర్గారు, రోహిత్‌గారు కూర్చున్నారు’’ చెప్పాడు అప్పారావు.‘‘వాళ్లందరూ నీకు బాగా పరిచయమా?’’ ప్రశ్నించాడు కాళిదాస్.‘‘వాళ్లంతా ప్రతివారం రాత్రివేళ ఇక్కడ మందు పార్టీ చేసుకుంటుంటారు. వాళ్లకు కావలసినవి నేనే తెచ్చేవాణ్ణి. అందువల్ల వాళ్లందరితోనూ బాగా పరిచయం అయిందండీ’’ బదులిచ్చాడు అప్పారావు.‘‘వెరీగుడ్ అప్పారావు. వాళ్ల అడ్రస్‌లు చెప్పగలవా?’’ అడిగాడు కాళిదాస్.అప్పారావు చెప్పిన అడ్రస్‌లు రాసుకుని, వాళ్ల నుంచి రక్త నమూనాలు సేకరించాడు కాళిదాస్.రెండు గంటల తర్వాత–‘‘రాజారావు మరణం సహజమైనది కాదు. ప్రీప్లాన్డ్ మర్డర్.’’ అన్నాడు కాళిదాస్.‘‘మీరెలా చెప్పగలరు?’’ అడిగాడు శంకరం.ఆ పార్టీలో పాల్గొన్న వారి రక్తంలో ఎంతో కొంత విస్కీ, హెరాయిన్ ఉన్నట్లు రక్తపరీక్షల్లో తేలింది. డాలీ రక్తంలో మాత్రం విస్కీ లేదని, ఆమె తాగలేదని తేలింది. ఆమె గ్లాసులోని విస్కీని తెలివిగా పక్కనే ఉన్నపూలకుండీలో పోసేసింది. రాజారావు తాగిన విస్కీలో హెరాయిన్ మోతాదుకు మించి ఉంది. రాజారావు చేత డాలీ ఎక్కువగా తాగించిందన్న మాట శంకరం... ఇదీ కథ’’ అన్నాడు కాళిదాస్. మంచం మీద అచేతనంగా పడి ఉంది డాలీ.ఆమె వద్దకు వెళ్లి తట్టి చూశాడు కాళిదాస్. చల్లగా తగిలింది. ఆమె మరణించిందని గ్రహించాడు. ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఆమె కుడిచేతి గోళ్లకు రక్తంమరకలు ఉండటాన్ని గమనించాడు. మరణానికి ముందు ఆమె ఎవరితోనో పోరాడినట్టుగా గ్రహించాడు. ఆమె మెడపై గాయం ఉంది. ఆమె మెడలోని గొలుసును బలవంతంగా లాగినట్టు మెడపై ఎర్రని గీతఉంది. డాలీ శరీరం నీలం రంగులోకి మారింది. వెంటనే ఆమె శరీరాన్ని పోస్ట్‌మార్టంకు పంపాడు.ఆ తర్వాత కాళిదాస్ అక్కడి నుంచి రాజారావు ఇంటికెళ్లి గదిలో ఉన్న కబోర్డు తెరిచాడు. లోపల ఒక కర్రపెట్టెఉంది. ఆ పెట్టెపై ‘626’ అని రాసి ఉంది. ఆ పెట్టె తెరవాలనుకున్నాడు. ఆ పెట్టె తాలూకా తాళంచెవి కోసం గదంతా గాలించాడు. పావుగంట తర్వాత మంచం కింద తాళంచెవి కనిపించింది. ‘శంకరం! ఈ పెట్టెకు రెండు తాళంచెవులు ఉన్నాయి. ఈ తాళంచెవి డూప్లికేట్. రెండో తాళంచెవి మాయమైంది. ఈ రెండు హత్యలకు, ఈ పెట్టెకు లింక్ ఉంది. కనుక్కుంటాను. పెట్టెలో ఉన్నది ఈ తాళంచెవితోతెరిచి తెలుసుకుంటాను. ముందు సూర్యం దగ్గరకెళదాం. అతడికి స్పృహ వచ్చాక మనకు అన్నీ తెలుస్తాయి’’ అన్నాడు కాళిదాస్. ‘‘మనం అనుకున్న ప్రకారం కథ ఫలించిందా?’’ అడిగింది ప్రియ.‘‘పురిట్లోనే సంధికొట్టినట్టుగా ఆగిపోయింది ప్రియా!’’ నిరాశగా బదులిచ్చాడతడు.‘‘డాలీ వద్దనున్న తాళంచెవిని నువ్వు తెచ్చావుగా’’ అంది ప్రియ.‘‘ఏం లాభంలేదు. కర్రపెట్టె రాజారావు ఇంట్లో ఉంది. బహుశ రెండో తాళంచెవి సూర్యం దగ్గర ఉండాలి’’ అన్నాడతడు.‘‘రాజారావు, సూర్యం తండ్రులు శత్రువులు కదా! మరి వాళ్ల కొడుకులు స్నేహితులెలా అయ్యారు.. అదే నాకు అర్థం కావడంలేదు’’ అంది ప్రియ.‘‘మైడియర్ ప్రియా! రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అవసరం బట్టి మార్పులు జరుగుతూ ఉంటాయి. ముందు నువ్వువెంటనే హాస్పిటల్కెళ్లి సూర్యాన్ని పరలోకానికి పంపు’’ అని ఆమెకు ప్లాన్ వివరించాడతడు. ఇద్దరూ గదిలోంచి బయటకు వెళ్లారు. ఒక డాక్టర్, నర్సు సూర్యం ఉన్న గదిలోకి ప్రవేశించారు. డాక్టర్ కోటు జేబులోంచి సిరెంజ్ తీశాడు. అందులో ఉన్న మందువైపు చూసి సూర్యం మంచం వద్దకొచ్చాడు. సూర్యం మీద దుప్పటి కప్పి ఉంది. సూర్యానికి ఇంజెక్షన్ చేయబోయాడు.అంతలోనే డాక్టర్ మొహమ్మీద బలమైన పిడికిలి దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు డాక్టర్ నేల మీదకు ఒరిగిపోయాడు. ఒక్కసారి ఆ గదిలో వెలుతురు మాయమైంది. దుప్పటి తొలగించి మంచం మీద నుంచి నేల మీదకు గెంతాడు అతడు.‘‘శభాష్ శంకరం’’ కంగుమంది ఎస్సై కాళిదాస్ గొంతు.‘‘రోహిత్! లే.. నీ డ్రామాకు తెరపడింది.’’ అంటూ గద్దించాడు. రోహిత్ నిరుత్తరుడయ్యాడు.‘‘రాజారావును నువ్వే హత్య చేశావు. తర్వాత డాలీని హత్య చేశావు. ఆమె మెడలోని చెయిన్‌కు ఉన్న తాళంచెవిని బలవంతంగా తీసుకున్నావు. నీ చేతి మీద కనిపిస్తున్న గాయాల గుర్తులు డాలీ నిన్ను గోళ్లతో రక్కినవే! ఈ ఆధారాలు చాలా! ఇంకేమైనా కావాలా? నువ్వు వెదుకుతున్న పెట్టె నా అధీనంలో ఉంది. అందులో రాజారావు తండ్రి వీరభద్రం, సూర్యం తండ్రి పుల్లారావుల నల్లడబ్బు తాలూకా వివరాలు రాసి ఉన్న పత్రాలు ఉన్నాయి. రెండు తాళంచెవులు వీరభద్రం, పుల్లారావులవి. ఒక తాళంచెవి ఇప్పుడు నీవద్ద, మరొకటి నావద్ద ఉన్నాయి. ఆ పత్రాల కోసమే నువ్వు ఈ హత్యలు చేశావు. పద పోలీస్ స్టేషన్‌కి... సెల్ సిద్ధంగా ఉంది’’ అంటూ రోహిత్‌ను అదుపులోకి తీసుకుని జీపెక్కించాడు ఎస్సై కాళిదాస్. - రాణీ మోహన్రావ్ -
మరో శిఖరాగ్ర భేటీకి సిద్ధమైన ట్రంప్
హెల్సింకి: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో సింగపూర్‌లో చారిత్రక శిఖరాగ్ర భేటీ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాంటి మరో సమావేశానికి సిద్ధమయ్యారు. అమెరికాతో అత్యంత బలహీన సంబంధాలు ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ సోమవారం ఫిన్లాండ్లో భేటీ కానున్నారు. ట్రంప్, పుతిన్ ఏకాంతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోనుండటం (వన్ టు వన్) ఇదే తొలిసారి. వీరు భేటీ అయ్యే గదిలో అనువాదకులు తప్ప మరెవరూ ఉండరు. ఫిన్లాండ్ అధ్యక్ష భవనంలోని గోథిక్ హాల్లో ట్రంప్, పుతిన్‌లు సమావేశమవుతారు. ప్రస్తుతం అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు ఏ మాత్రం బాగా లేవనీ, బలమైన బంధం కోసం ప్రయత్నం ప్రారంభిస్తున్నామని రష్యా ప్రభుత్వ సలహాదారు యూరీ ఉషకోవ్ వెల్లడించారు. ట్రంప్‌ను ‘సంప్రదింపులు జరిపే నేత’గా తాము పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు. మరోవైపు గతంలో రష్యా కోసమే పనిచేసిన ఓ గూఢచారిపై రష్యానే బ్రిటన్‌లో విషప్రయోగం చేసిందన్న ఆరోపణలు, సిరియా అంతర్యుద్ధంలో అక్కడి ప్రభుత్వానికి రష్యా మద్దతు, క్రిమియాను ఆక్రమించుకోవడం, రష్యాతో ట్రంప్ కఠినంగా వ్యవహరించట్లేదంటూ నాటో సభ్య దేశాల భయాలు తదితర అంశాల నేపథ్యంలో ట్రంప్, పుతిన్‌ల శిఖరాగ్ర భేటీపై ఉత్కంఠ నెలకొంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్లతో ఘర్షణాత్మక వాతావరణం నుంచి స్నేహం వైపు మళ్లిన ట్రంప్, ఇప్పుడు పుతిన్‌తో కూడా అదే రీతిలో వ్యవహరిస్తారో లేదోనని అమెరికా, రష్యాల మిత్రదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్‌తో సన్నిహిత బంధానికే పుతిన్ మొగ్గు చూపొచ్చనీ, ట్రంప్ కూడా అందుకు సానుకూలంగానే స్పందిస్తారని నిపుణులు అంటున్నారు. భారీ అంచనాలేమీ లేవు: ట్రంప్ పుతిన్‌తో భేటీపై ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ ‘నేనేమీ భారీ అంచనాలతో ఈ సమావేశానికి వెళ్లడం లేదు. కానీ ఈ భేటీ ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉండే అవకాశం ఉంది. ఆ ఫలితాలు సానుకూలంగా ఉండొచ్చు తప్ప చెడు జరగదు’ అని అన్నారు. తాను రష్యాతో తొలి నుంచీ కఠినంగానే వ్యవహరిస్తున్నాననీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం అంశాన్ని కూడా పుతిన్‌తో చర్చల్లో కచ్చితంగా ప్రస్తావనకు తెస్తానని ట్రంప్ చెప్పారు. 12 మంది రష్యా మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రాట్ల అకౌంట్లను హ్యాక్ చేశారంటూ వారిపై ఇటీవలే అమెరికా నేరాభియోగాలు మోపింది. ఆ 12 మందిని తమకు అప్పగించాలని కూడా తాను పుతిన్‌ను కోరే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. నేరాభియోగాలు నమోదైన నేపథ్యంలో పుతిన్‌తో భేటీని రద్దు చేసుకోవాలని డెమొక్రాట్లు నాలుగు రోజుల క్రితం ట్రంప్‌ను కోరినా, శ్వేతసౌధం తిరస్కరించింది. కాగా, రష్యాను తిరిగి జీ–7 కూటమిలో చేర్చి, మళ్లీ జీ–8గా మార్చాలని కూడా ట్రంప్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇప్పుడు వారు చర్చిస్తే ఫలితం ఎలా ఉంటుందోనని అమెరికా మిత్రదేశాలు ఆందోళన చెందుతున్నాయి. శత్రువులే కానీ..: రష్యాతోపాటు చైనా, యూరోపియన్ యూని యన్ (ఈయూ) అమెరికాకు శత్రువులని ట్రం ప్ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ‘మాకు చాలా మంది శత్రువులున్నారని నేననుకుంటాను. ఈయూ ఒక శత్రువు. వాణిజ్యంలో వారు మాకు ఏం చేస్తున్నారు? కొన్ని అంశాల్లో రష్యా కూడా శత్రువే. ఆర్థికాంశం పరంగా చైనా మాకు కచ్చితంగా శత్రువే. అయితే వీళ్లంతా చెడ్డవాళ్లని కాదు. పోటీ తత్వం ఉన్నవారు మాత్రమే’ అని ట్రంప్ చెప్పారు. కాగా, బ్రిట న్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు చేపట్టడం తెలిసిందే. ఫిన్లాండ్లోనూ ట్రంప్ అదే పరిస్థితిని ఎదుర్కోనున్నారు. -
చైనా ‘పొరుగు’ మిత్ర దేశమేది? శత్రువెవరు?
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనాకు ఇరుగుపొరుగు దేశాలతో సఖ్యత లేదు. కానీ, ఆసియాలో అత్యధికంగా పెట్టుబడులు పెడుతూ తన మాటను నెగ్గించుకోగలిగే స్థాయికి ఆ దేశం చేరింది. మంగోలియా, వియత్నాం, జపాన్, తైవాన్, భారత్‌లతో చైనాకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. భారత్‌తో కాకుండా చైనా 13 దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. పాకిస్థాన్ మాత్రమే చైనాకు బలమైన మిత్రదేశం. ఆర్థిక అవసరాలు, అమెరికాతో విభేదాల కారణంగా రష్యా చైనాతో స్నేహాన్ని కొనసాగిస్తుందని భావించొచ్చు. చైనాతో కలిసి ముందుకు నడిస్తేనే.. తాను అమెరికాను నిలువరించగలనని రష్యా అనుకుంటోంది. అదే సమయంలో రష్యా మనకు మిత్ర దేశం. ఇక అమెరికాతో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే ఉత్తర కొరియా చైనాతో మైత్రిని కలిగివుంది. అందుకే కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియాతో కలిసి అమెరికా చేపడుతున్న సైనిక విన్యాసాలు ఆపేయాలని చైనా కోరింది. మంగోలియాకు డ్రాగన్‌తో సంబంధాలు బాగోలేవు. ఇక కజకిస్థాన్, లావోస్, మయన్మార్ దేశాలు కూడా చైనాతో సఖ్యంగా ఉంటున్నవే. కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఆప్ఘానిస్థాన్లు గోపీ.. గోడ మీద పిల్లి అన్న వైఖరితో ఉంటున్నాయి. నేపాల్, భూటాన్‌లు మనకు మిత్ర దేశాలు. దక్షిణ సముద్ర వివాదం నేపథ్యంలో వియత్నాంకు డ్రాగన్ అంటే గిట్టడం లేదు. మొదటి నుంచి జపాన్‌తో చైనా సంబంధాలు అంతంత మాత్రమే. తైవాన్, కంబోడియా, బ్రూనై దేశాలకు కూడా చైనా అంటే చిరాకే. సాగర జలాల్ని పంచుకుంటున్న దేశాల్లో ఒక్క మలేసియా మాత్రమే చైనా పట్ల తటస్థ వైఖరిని కనబరుస్తోంది. -
పోడు రైతులను శత్రువులుగా చూడొద్దు
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇల్లెందు: ‘అడవులను కాపాడుకోవడమనేది అటు పాలకులు, ఇటు ప్రజల సమష్టి లక్ష్యం. అంతమాత్రాన, ప్రజలను (పోడు రైతులను) పాలకులు తమ శత్రువులుగా చూడకూడదు’’ అని, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఏజెన్సీలోని ఖనిజ సంపదను తరలించకుపోతుంటే పట్టించుకోని పాలకులు.. అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలపై జులుం సాగించడం, వారి పోడు భూముల్లోని పంటలను ధ్వంసం చేయడం తగదని అన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలన్న డిమండుతో, పంటల ధ్వంసానికి వ్యతిరేకంగా న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం ఇల్లెందులో భారీ ప్రదర్శన, స్థానిక మార్కెట్ యార్డులో సదస్సు జరిగాయి. సదస్సులో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అడవుల పెంపకం, హరితహారం పేరుతో గిరిజనుల నుంచి పోడు భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని విమర్శించారు. అడవిని ప్రభుత్వం తన ఆస్తిగా మార్చుకోవడం, మైదాన ప్రాంతం నుంచి గిరిజనేతరులు అడవుల్లోకి చొచ్చుకురావడంతో పోడు సమస్య ఏర్పడిందని అన్నారు. అనేక పోరాటాల ఫలితంగా 2005 డిసెంబర్ 13న అటవీహక్కు చట్టం వచ్చిందన్నారు. అప్పటి వరకు గిరిజనుల ఆధీనంలోగల భూములకు గుర్తింపును, హక్కును ఈ చట్టం కల్పించిందన్నారు. దీనికి లోబడే పోడు సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడవుల పరిరక్షణలో భాగంగా కలప స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ జేఏసీ సహా అందరం కృషి చేద్దామని అన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోడు రంగారావు మాట్లాడుతూ.. పోడు భూముల్లోని పంటలను అటవీ అధికారులు ధ్వంసం చేయడాన్ని గిరిజనులు తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బీడు, బంజర, అటవీభూముల్లో మొక్కలు నాటి కాపాడుకోవాలని చెబితే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారు. కానీ, పేదల నుంచి పోడు భూములను లాక్కుని.. అందులోని పంటలను ధ్వంసం చేసి, మొక్కలు పెంచుతామనడం సరికాదు’’ అని అన్నారు. ‘‘తెలంగాణ ప్రాంతంలో వందల ఎకరాలను పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అప్పనంగా అప్పగిస్తున్న ప్రభుత్వం.. పేదలు తమ కడుపు నింపుకునేందుకు సేద్యం చేసుకుంటున్న భూములను దౌర్జన్యంగా స్వాధీనపర్చుకుంటోంది. వారి నోటికాడి ముద్దను లాగేసుకుంటోంది’’ అని విమర్శించారు. టేకులపల్లి మండలంలో 20 ఎకరాలను ఏలూరి కోటేశ్వర్రావు, 50 ఎకరాలను లక్కినేని, ఖమ్మంలోని ఎన్ఎస్పీ కాలువ వెంట కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు బడాబాబులు ఆక్రమిస్తే ప్రభుత్వం ఎలా ఊరుకుందని, వాటిని (ఆక్రమిత భూములను) ఎందుకు స్వాధీనపర్చుకోలేదని ప్రశ్నించారు. పోడు భూముల సాధించుకునేందుకు పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, జడ్పీటీసీ సభ్యులు చండ్ర అరుణ, గౌని ఐలయ్య, గుండాల ఎంపీపీ చాట్ల పద్మ, నాయకులు నాయిని రాజు, జగ్గన్న, చిన్న చంద్రన్న, జేఏసీ నాయకులు పాపారావు, విశ్వ, ప్రభాకరాచారి, మురళి, ధర్మార్జున్ తదితరులు పాల్గొన్నారు. -
మనసును అదుపు చేసుకోలేని వారి జీవితం...
ప్రాకారం లేక పాడైన పురము సువార్త శత్రువులు దాడి చేయకుండా చైనా రాజులు తమ దేశం చుట్టూ 15 వేల మైళ్ల పొడవున, సగటున ఏడు మీటర్ల ఎత్తున చైనా గోడ కట్టారు. ప్రజలను పీడించి అందుకు బోలెడు డబ్బు, కాలం, శ్రమ వెచ్చించారు. కాని అది పూర్తయిన వందేళ్లలోపే శత్రువులు చైనాపై మూడు సార్లు దాడి చేశారు. వాళ్లు గోడెక్కి రాలేదు, గోడపై కావలి ఉన్న సైనికులకు లంచమిచ్చి లోపలికొచ్చారు. గోడమీది ధీమాతో వాళ్లు సైనికుల నిజాయితీ విషయం మర్చిపోయారు. తాళం వేసి గొళ్లెం మరిచారు. దావీదు మహాచక్రవర్తి కొడుకుగా సొలొమోను చక్రవర్తికి ఎంతో సంపద, ఖ్యాతి, వైభవం కలిసొచ్చింది. యెరూషలేము మందిరాన్ని సైతం దేవుడు సొలొమోనుతోనే కట్టించాడు. దావీదు తన యుక్తితో, యుద్ధ నైపుణ్యంతో పొరుగు రాజులందరినీ లొంగదీసుకోగా శత్రుభయం లేని గొప్ప శాంతియుత సామ్రాజ్యం సొలొమోను ఒడిలో వచ్చి పడింది. పైగా దేవుడిచ్చిన జ్ఞానవివేచనవల్ల తెలివైన రాజుగా అతని ఖ్యాతి భూదిగంతాలకు పాకింది. కాని క్రమంగా సొలొమోను దేవుని మరిచిపోయాడు. స్త్రీలోలుడై వందలాది మంది భార్యలు, ఉపపత్నులను చేరదీశాడు. తన భార్యలు పూజించే దేవతలకు తానూ పూజించాడు. ప్రజలతో వెట్టి చాకిరి చేయించాడు. తన జ్ఞానంతో ప్రపంచంలో అభిమానులను సంపాదించుకున్నారు కాని అహంకారం, విచ్చలవిడితనంతో సొంత ప్రజలనే శత్రువులను చేసుకున్నాడు (1 రాజులు 11:4 ; 12:4-16). ఫలితంగా అతని తర్వాత ఇశ్రాయేలు దేశం రెండు ముక్కలై బలహీనమైంది. ఆ తర్వాత పూర్తిగా విచ్ఛిన్నమైంది. జీవితాన్ని చేజేతులా పాడుచేసుకునే విద్యలో మనిషి ఆరితేరాడు. కళ్లెదురుగా గొయ్యి కనబడుతున్నా అందులో పడి కనీసం బురదంటుకోకుండా ప్రాణాలతో బయటపడగలనన్న ఆశావాదం ఆధునిక మానవునిది. అందుకే ఎన్నో గొప్ప విజయాలు సాధించిన మహనీయులు కూడా ఎంతో చిన్న విషయాల్లో విఫలమై చరిత్ర హీనులయ్యారు. అవిద్య, దారిద్య్రం, అజ్ఞానం మనిషిని పాడు చేస్తాయన్నది కొందరి అపోహ. కాని ఈ మూడింటి బాధితులైన మన పూర్వికులు ఈ మూడూ లేని మనకన్నా ఎంతో గౌరవప్రదంగా, శాంతిగా, సంస్కారయుక్తంగా, ఎంతో మందికి ప్రయోజనకరంగా బతికారన్నది నిర్వివాదాంశం. మనిషిని నిజంగా పాడుచేసేది అహంకారం, దేవునితో అతను పెంచుకున్న దూరం. అందుకే ‘నాలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు’ అని యేసుక్రీస్తు తన శిష్యులతో అన్నాడు (యోహాను 15:5). మనిషికున్న జ్ఞానం, శక్తి అపారమే! అయినా తనను తాను నియంత్రించుకోవడంలో మాత్రం అతను ముమ్మాటికీ అశక్తుడే! మన ఇంద్రియాలను, అంతరేంద్రియాలను కూడా సృజించిన దేవుని నిరంతర సహవాసం, సాన్నిధ్యంలోనే మనిషికి ఇంద్రియ నిగ్రహం అలవడుతుంది. మనిషి తనను తాను అపరిమితంగా ప్రేమించుకోవడం, నమ్ముకోవడం ద్వారా దేవునికి దూరమవుతాడు, దైవవ్యతిరేక విధివిధానాలకు దగ్గరవుతాడు. దాన్నే బైబిల్ ‘పాపం’ అంటుంది. చాలామంది విశ్వసిస్తున్నట్టు మనిషికే గనుక తనపై తనకు నియంత్రణ ఉంటే ఇన్ని అనర్థాలకు తావేది? డాక్టర్ సలహా మేరకే కనీసం ఉప్పు, కారం, తీపి మానలేని మనిషి తనను తాను అదుపు చేసుకొని లోకకల్యాణాన్ని సాధిస్తాడనుకోవడం గొర్రెతోక పట్టుకొని గోదావరి ఈదాలనుకోవడం కాదా? అందుకే సొలొమోను తన చివరి రోజుల్లో స్వానుభవంతో ‘తన మనస్సును అణచుకోలేనివాని జీవితం ప్రాకారం లేక పాడైన పురము’లాంటిదన్నాడు (సామెతలు 25:28). - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్ -
ఒక వేడుక... ఇద్దరు ఫ్రెండ్స్‌ను విడదీసింది!
నిన్న మొన్నటి వరకూ ప్రియాంకా చోప్రా, ఫ్రీదా పింటో చాలా స్నేహంగా ఉండేవాళ్లు. ఎక్కడ కనిపించినా ఆప్యాయంగా పలకరించుకోవడం, ఆత్మీయంగా హగ్ చేసుకోవడం, తియ్యగా కబుర్లు చెప్పుకోవడం... ఇలా చాలా బాగుండేవాళ్లు. ఇప్పుడు మాత్రం ఇద్దరూ ఎదురుపడితే మొహాలు తిప్పుకోవడం, ఒకవేళ చూపులు కలిస్తే, కాల్చేలా చూసుకోవడం, వీలైనంత డిస్టెన్స్ పాటించడం చేస్తున్నారు. ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ ఇలా ఎనిమీస్‌గా మారిపోవడానికి కారణం ఓ వేడుక. ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో ప్రియాంక, ఫ్రీదా పాల్గొన్నారు. ఇందులో పాల్గొనడానికి అంగీకరించినప్పుడు ఇద్దరూ స్నేహితులే. కానీ, దీనికి సంబంధించిన ఇన్విటేషన్ వచ్చాక ప్రియాంక రగిలిపోయారు. ఆహ్వాన పత్రికలో ఫ్రీదా పింటో పేరు తర్వాత ప్రియాంక పేరు ముద్రించారు. ఆ విషయంలో ప్రియాంక చాలా ఫీలైపోయారు. ఆ కోపంతో వేడుకకు హాజరైన ఈ బ్యూటీ ఫ్రీదాతో సరిగ్గా మాట్లాడలేదట. దాంతో ఫ్రీదా ఫీలైపోయి, మాట్లాడటం మానేశారట. అసలే కోపం మీద ఉన్న ప్రియాంకను మరింత ఆగ్రహానికి గురి చేసేలా.. ఫ్రీదాని వేదికపైకి ఆహ్వానిస్తూ, ‘హోస్ట్’ అనీ, ప్రియాంకను ఆహ్వానిస్తూ, ‘కో-హోస్ట్’ అని సంబోధించడంతో వాతావరణం వేడెక్కిపోయింది. అక్కడికక్కడ ఆ వేడుక నిర్వాహకులతో ప్రియాంక వాదనకు దిగారట. కానీ, పిలుపులు అయిపోయాక తామేం చేయలేమని వాళ్లనడంతో.. ప్రియాంక మూడాఫ్ అయిపోయారు. వేడుక జరిగినంతసేపూ ఆమెలో నవ్వు అనేది కనిపించలేదట. ఎప్పుడెప్పుడు వెళ్లిపోదామా? అన్నట్లుగా వ్యవహరించారని టాక్. ఏదేమైనా ఒక వేడుక... ఇద్దరు ఫ్రెండ్స్‌ను విడదీసేసింది. -
‘ప్రగతి పర్యావరణ శత్రువు కాదు!’
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాలు పర్యావరణానికి శత్రువులు కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అభివృద్ధి చెందిన దేశాలు గుర్తించాలన్నారు. అలాగే, ప్రగతి, వికాసం అనేవి పర్యావరణానికి ప్రతికూలం అనే భావన నుంచి బయటపడాలని ఆ దేశాలకు సూచించారు. పర్యావరణ శాస్త్రాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల్లో ఒకే సిలబస్ ఉండాలన్నారు. దానివల్ల వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు వారిలో ఉమ్మడి లక్ష్యాలు ఏర్పడతాయని వివరించారు. వాతావరణ మార్పునకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న సారూప్య మనస్క దేశాల(ఎల్‌ఎండీసీ) ప్రతినిధుల బృందాల తో మోదీ మంగళవారం భేటీ అయ్యారు. త్వరలో పారిస్‌లో జరగనున్న వాతావరణ మార్పు సదస్సు సన్నాహకాల్లో భాగంగా జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు ఆ ప్రతినిధుల బృందాలు భారత్ వచ్చాయి. వాతావరణ మార్పుపై పోరులో భారత్ ఎల్‌ఎండీసీతో కలిసి నడుస్తుందని మోదీ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. ప్రగతి పర్యావరణ శత్రువన్న భావనను ప్రచారం చేస్తున్న వారిని కలసికట్టుగా సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉందన్నారు. అలాంటివారు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఉన్నారన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కాలుష్య ఉద్గారాలను తగ్గించే ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి, అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. -
పంచమాంగ దళాలు
నానుడి ఆధునిక సైన్యాలలో త్రివిధ దళాలు ఉన్నట్లుగానే, ప్రాచీన సైన్యాలలో చతురంగ బలగాలు ఉండేవి. రథ, గజ, తురగ, పదాతి దళాలనే అప్పట్లో చతురంగ బలగాలు అనేవారు. యుద్ధాలు జరిగేటప్పుడు సైన్యంలో స్థాయీ భేదాలను అనుసరించి వీరాధి వీరుల్లో కొందరు రథాలను అధిరోహించేవారు. మరికొందరు ఏనుగులెక్కి యుద్ధాలు సాగించేవారు. ఇంకొందరు గుర్రాలెక్కి పోరు సల్పేవారు. సామాన్య సైనికులు ఎలాంటి వాహనం లేకుండానే యుద్ధరంగంలో నిలబడి శత్రువులను ఎదుర్కొనేవారు. చతురంగ బలసంపదతో ఎంతటి సేనావాహిని ఉన్నా, యుద్ధాలలో గెలుపు సాధించడం ఒక్కోసారి కష్టమయ్యేది. అలాంటప్పుడే రాజుల్లో కొందరు శత్రువర్గంలోని అసంతుష్టులను చేరదీసి, తమకు అనుకూలంగా తయారు చేసుకునేవారు. వాళ్ల ద్వారా గుట్టుమట్లు సేకరించి, అవలీలగా శత్రువులను మట్టికరిపించేవారు. ఒక్కోసారి అసంతుష్టుల్లో కొందరు తమంతట తామే శత్రు రాజులతో కుమ్మక్కయి, తమ రాజుల ఓటమికి కారకులయ్యేవారు. ఇలాంటి వాళ్లనే పంచమాంగ దళాలుగా అభివర్ణిస్తారు. రామాయణంలోని విభీషణుడు, మహాభారతంలోని శల్యుడు అలాంటి వాళ్లే. -
ఆధిపత్య లొల్లి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు. ‘అనంత’ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే అది నిజమేననిపిస్తుంది. నిన్నా మొన్నటి వరకు సై అంటే సై అనుకున్న వారు నేడు స్నేహ హస్తం అందుకుంటున్నారు. ఎదుటి వారిని దెబ్బ తీసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మంత్రి పరిటాల సునీత, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య వర్గ విభేదాలు ఇప్పటికే ముదిరిపాకాన పడగా.. తాజాగా విప్ యామినీ బాల, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య వార్ మొదలైంది. రెండు వర్గాలుగా విడిపోయిన ‘అనంత’ నేతలు ఆధిపత్యం ప్రదర్శించేందుకు తహతహలాడుతున్నారు. ప్రధానంగా పరిటాల వ్యతిరేక వర్గీయులను ఏకం చేసే బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే కేశవ్ భుజాన వేసుకున్నారు. పదేళ్ల తర్వాత టీడీపీకి అధికారం దక్కడంతో పాటు జిల్లాలో ఎవరూ ఊహించని విధంగా 12 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ప్రతిఫలంగా జిల్లాకు రెండు మంత్రి పదవులతో పాటు చీఫ్ విప్, విప్ పదవులను కట్టబెట్టారు. తమకు దక్కిన పదవుల ద్వారా జిల్లా అభివృద్ధికి పాటుపడాల్సిన టీడీపీ నేతలు ఆధిపత్యం కోసం పావులు కదుపుతూ వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. టీడీపీలోని ఏ ఇద్దరి మధ్య కూడా సయోధ్య లేకుండా ఒకరిపై మరొకరు కత్తులు నూరుకునేలా పరిస్థితి మారిపోయింది. మంత్రి పరిటాల సునీత, అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. 15 ఏళ్ల క్రితమే పరిటాల రవిని ప్రభాకర్ చౌదరి బాహాటంగానే విభేదించారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య అంతర్గతపోరు నడుస్తోంది. తాజాగా అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ స్వరూప విషయంలోనూ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య వివాదం తలెత్తింది. స్వరూపకు మేయర్ పీఠం దక్కకుండా చివరి వరకూ ప్రభాకర్ చౌదరి యత్నించారు. ఇదే క్రమంలో ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకవర్గాన్ని నడిపేందుకు మంత్రి సునీత స్వరూపకు అండగా నిలిచారు. దీంతో స్వరూప పూర్తిగా పరిటాల వర్గంలో చేరిపోయి చౌదరిని వ్యతిరేకి స్తున్నారు. కోఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ క్రమంలో పరిటాల తనయుడు శ్రీరామ్, ప్రభాకర్ చౌదరిలు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుని తమ మధ్య ఉన్న విభేదాలను బట్టబయలు చేశారు. చేతులు కలిపిన వైరివర్గం పరిటాల వర్గానికి చెక్‌పెట్టేందుకు వారి వ్యతిరేకవర్గం చేతులు కలిపింది. మొదట్నుంచి పరిటాల వర్గానికి బద్ధ శత్రువులుగా ఉన్న జేసీ బ్రదర్స్‌తో పాటు వరదాపురం సూరి, బీకే పార్థసారథిలు పరిటాల వర్గంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమయినట్లు తెలుస్తోంది. దీనికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా మద్దతు తెలిపినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పరిటాల వ్యతిరేక వర్గాన్ని ఏకం చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పయ్యావుల కేశవ్ బరిలోకి దిగనున్నారు. ఎమ్మెల్సీ దక్కిన తర్వాత మంత్రి పదవిని ఆశిస్తున్న కేశవ్ తన సామాజిక వర్గానికి చెందిన సునీతకు మంత్రి పదవి దూరం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. దాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రతీ చిన్న అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుంటూ పరిటాల వర్గం, వారి వ్యతిరేకుల వివాదాలను ఎప్పటికప్పుడు చంద్రబాబుకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పరిటాల వర్గానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మొదట్నుంచి అండగా నిలుస్తున్నారు. ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో హిందూపురం ఎంపీ సీటు శ్రీరామ్ ఆశిస్తున్నాడనే కారణంతో నిమ్మల కిష్టప్ప కూడా పరిటాల వ్యతిరేకవర్గం బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి సునీత మంచి, చెడులతో పనిలేకుండా తాను అనుకున్నదారిలో నడుస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యామిని బాల, ప్రభాకర్‌రెడ్డి మధ్య విభేదాలు : యల్లనూరులో ఓ మద్యం దుకాణం వ్యవహారంలో విప్ యామిని బాల, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య తలెత్తిన విభేదాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. మంగళవారం తుంపర డీప్‌కట్ వద్ద నీటి విడుదల సమయంలో యామినీబాలపై ప్రభాకర్‌రెడ్డి పరుష పదజాలంతో దూషించినట్లు సంఘటన ప్రాంతంలో ఉన్న టీడీపీ నేతలు చెబుతున్నారు. జేసీ బ్రదర్స్ నుంచి ఏదోఒక రోజు సమస్య తప్పదని ముందుగానే భావించిన యామిని బాల.. వారిని ఎదుర్కొనేందుకు పరిటాల వర్గంతో నడుస్తోంది. ఇలా టీడీపీలోని ప్రతీనేత ఆధిపత్యం కోసమే ఆరాటపడుతూ అవసరాన్ని బట్టి ఓ నాయకుని పంచ నుంచి మరో నేత దగ్గరికి చేరుతున్నారు. నేతల మధ్య విభేదాలు చూస్తున్న కార్యకర్తలు పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని తమతో పాటు జిల్లా అభివృద్ధికి పాటు పడకుండా పార్టీని, పార్టీలోని ఐక్యతను బలహీనపరుస్తున్నారని బాహాటంగానే విమర్శిస్తున్నారు. -
తుమ్మల, జలగం భేటీ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు శాశ్వతం కాదని మరోమారు రుజువైంది. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో మాజీ ముఖ్యమంత్రి వెంగళరావు కుమారుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు నివాసానికి వెళ్లి ఆయనతో ఏకాంతంగా గంటపాటు చర్చలు జరపడం జిల్లాలో కొత్త రాజకీయ చర్చకు తెరతీసింది. టీఆర్ఎస్లో చేరడానికి ముందు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తుమ్మలను జలగం పరామర్శించడం... ఆ తర్వాత ఆయన పార్టీలో చేరే కార్యక్రమానికి కూడా హాజరుకావడం విదితమే. ఈ నేపథ్యంలో తుమ్మల కూడా తన రాజకీయ చతురతతో జిల్లాలో పార్టీ పరంగా తనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా తొలి నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు, టీఆర్ఎస్లో పనిచేస్తున్న వారితో పాటు జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను కూడా కలిసి అందరం కలిసి పనిచేయాలని చర్చిస్తున్నారు. తన చేరిక సభలో జిల్లాలో అందరూ తుమ్మల నాయకత్వంలో పనిచేయాలని అధినేత కేసీఆర్ సూచించిన నేపథ్యంలో తన నాయకత్వానికి ఆటంకాలు లేకుండా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని సన్నిహితులు చెపుతున్నారు. జలగంతో భేటీకి ముందు తుమ్మల హైదరాబాద్‌లోని తన నివాసంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్‌తో కూడా సమావేశమయ్యారు. ఆయనతో పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఇక, జలగంతో భేటీ సందర్భంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం ఎలా చేయాలి? జిల్లా పార్టీలో ఎలాంటి గ్రూపులు లే కుండా ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలపై చర్చించారని తెలుస్తోంది. మొత్తం మీద నిన్నటివరకు వైరివర్గాలుగా కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావులు క్రమంగా ఒకటవుతున్న పరిస్థితులు కనిపించడం, తుమ్మలను జలగం పరామర్శించడం, ఆ తర్వాత తుమ్మలే నేరుగా జలగం నివాసానికి వెళ్లడం జిల్లా రాజకీయాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించనుందని రాజకీయ వర్గాలంటున్నాయి. -
కాంగ్రెస్, టీడీపీ దోస్తీ
ఎంపీటీసీ ఎన్నికల్లో పలుచోట్ల హంగ్ - ఎంపీపీ స్థానాల కోసం ఎత్తుకు పైఎత్తులు - చిరకాల ప్రత్యర్థులతోనూ చెలిమి - డోన్, బండిఆత్మకూరులో బొమ్మాబొరుసుతో నిర్ణయం - ఓర్వకల్లులో అధ్యక్ష ఎంపిక వాయిదా - మరో ఏడు స్థానాల కోసం పోటాపోటీ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరని మరోసారి నిరూపితమైంది. మండల పరిషత్ ఎన్నికల ఫలితాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. పలు మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో కొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. ఎంపీపీ స్థానాలను దక్కించుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారిపోతున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఆలింగనం చేసుకుని పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. జిల్లాలో ఇటీవల వెలువడిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే తొమ్మిది స్థానాల్లో ఏ పార్టీకి మెజారిటీ దక్కకపోవడంతో హంగ్ నెలకొంది. వీటిని ఎలాగైనా తమ ఖాతాలో జమ చేసుకోవాలనే తలంపుతో ఆ రెండు పార్టీలు రకరకాల ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. కొందరు స్వతంత్రులతో మంతనాలు నెరుపుతుండగా.. మరికొందరు శుత్రువులతో సైతం చేతులు కలుపుతున్నారు. గతంలో ఫలితాలు వెలువడిన నాలుగైదు రోజుల్లోనే ఎంపీపీ ఎంపిక పూర్తయ్యేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంపీపీల ఎంపికకు సమయం ఉండటంతో.. రాజకీయ పార్టీలు శిబిరాల ఏర్పాటు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే కొందరిని రహస్య ప్రాంతాలకు తరలించారు. ఎంపీటీసీ అభ్యర్థులకు ఏమి కావాలో అడిగి తెలుసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో 53 ఎంపీపీ స్థానాలు ఉండగా.. 23 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ 21 స్థానాలను దక్కించుకుంది. మిగిలిన 9 స్థానాల్లో అధిక్యత కోసం పోటాపోటీ నెలకొంది. వెల్దుర్తిలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో 6 వైఎస్సార్సీపీ, 5 టీడీపీ, మరో 6 కాంగ్రెస్ దక్కించుకున్నాయి. ఎంపీపీ పదవి కోసం వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ మద్దతు కోరుతున్నట్లు సమాచారం. కల్లూరులో 3 వైఎస్ఆర్సీపీ, 8 టీడీపీ, 6 స్వతంత్రులు, సీపీఎం ఒకటి గెలుచుకున్నాయి. ఎంపీపీ కోసం టీడీపీ పట్టుబడుతోంది. మద్దతు కోసం సంప్రదింపులు జరుపుతోంది. కోడుమూరులో వైఎస్సార్సీపీ 8, కాంగ్రెస్ 7, టీడీపీ 2, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ఎంపీపీ పదవిని ఇతరులకు కట్టబెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. - డోన్లోవైఎస్సార్సీపీ 9, టీడీపీ 9 స్థానాలను దక్కించుకోగా.. రెండు పార్టీల నేతల్లో సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం ఎంపీపీ పదవి ‘అదృష్టం’పై ఆధారపడి ఉంది. - పాణ్యం మండల పరిషత్‌లో టీడీపీ బొక్క బోర్లా పడింది. ఎంపీపీ స్థానం ఎస్టీకి రిజర్వు అయ్యింది. అయితే టీడీపీ తరఫున ఎస్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్టీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో టీడీపీకి 8 ఎంపీటీసీ స్థానాలు వచ్చినా ప్రయోజనం లేకపోతోంది. ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకోనుంది. - బండిఆత్మకూరులో వైఎస్సార్సీపీ, టీడీపీకి చెరి ఏడు స్థానాలు దక్కాయి. ఇక్కడ ఎంపీపీ పదవి ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. - గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, కాంగ్రెస్ 3, టీడీపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్ మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. - ఓర్వకల్లులో వైఎస్సార్సీపీ 8, టీడీపీ 3, స్వతంత్రులు 6 స్థానాల్లో గెలుపొందారు. కన్నమడకల స్థానం నుంచి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి తిక్కలి వెంకటస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో అధ్యక్ష ఎంపిక వాయిదా పడనుంది. - సి.బెళగల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 6, టీడీపీకి 7, కాంగ్రెస్‌కు 3 ఎంపీటీసీ స్థానాలు లభించాయి. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ అభ్యర్థులు టీడీపీకి మద్దతిచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకే ఎంపీపీ పదవి దక్కనున్నట్లు సమాచారం.