feud
-
USA Presidential Elections 2024: వైషమ్యాలను పెంచుతారు
వాషింగ్టన్: రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ వ్యక్తులను పరస్పరం ఎగదోసి వారిమధ్య వైషమ్యాలు పెంచే రకమంటూ డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ దుయ్యబట్టారు. ట్రంప్ కంటే చాలా మెరుగైన వ్యక్తి మాత్రమే అమెరికాకు నాయకత్వం వహించాలని అభిప్రాయపడ్డారు. స్వింగ్ రాష్ట్రమైన విస్కాన్సిన్లో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.రాజకీయ ప్రత్యర్థులను, తనకు ఓట్లేయని వారని శత్రువులుగా భావించే ప్రమాదకరమైన మనస్తత్వం ట్రంప్ సొంతమని ఆక్షేపించారు. ఆయన జేబులో రాసిపెట్టుకున్న శత్రువుల జాబితా నానాటికీ పెరిగిపోతూనే ఉందన్నారు. ‘‘మరోవైపు రిపబ్లికన్ల నుంచి కూడా ఒకరికి నా మంత్రివర్గంలో చోటివ్వాలన్న మనస్తత్వం నాది. మా ఇద్దరి మధ్య ఇదే తేడా’’అని చెప్పుకొచ్చారు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం రాణిస్తుందన్నారు. -
నువ్వా.. నేనా
♦ పతాక స్థాయికి అధిపత్య పోరు ♦ టీడీపీ పాత, కొత్త నేతల మధ్య పెరుగుతున్న వైరం ♦ అధికారుల బదిలీలే వేదిక నిన్న అద్దంకి సీఐ బదిలీ వ్యవహారం... ♦ నేడు ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్ఈ రమణమూర్తి బదిలీ ♦ రమణమూర్తిని కరణం బదిలీ చేయించారని ప్రచారం... ♦ బదిలీని నిలిపివేయాలని పట్టుబట్టిన గొట్టిపాటి ♦ గొట్టిపాటిని ప్రోత్సహిస్తున్న కరణం వ్యతిరేక వర్గం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ పాత, కొత్త నేతల మధ్య అధిపత్యపోరు పతాక స్థాయికి చేరింది. ముఖ్యంగా పాత నేత కరణం బలరాం కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఢీ అంటే ఢీ అంటూ టీడీపీ వర్గవిభేదాలను పతాకస్థాయికి చేర్చారు. ఇటీవల అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. సీఐని గొట్టిపాటి బదిలీ చేయిస్తే... కరణం ఆ బదిలీని అడ్డుకున్నారు. ఈ విషయం సమసిపోక ముందే ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎస్ఈ రమణమూర్తి బదిలీ వ్యవహారం రచ్చకెక్కింది. రమణమూర్తిని ఇటీవల ఉన్నతాధికారులు విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. రమణమూర్తి బదిలీ వెనుక కరణం హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అద్దంకి నియోజకవర్గంలో నీరు-చెట్టు పనుల కోసం కరణం వర్గీయులు రూ.9 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. చివరకు రూ.5 కోట్ల పనులు మాత్రమే మంజూరయ్యాయి. మిగిలిన పనులు మంజూరు కాకపోవడానికి ప్రాజెక్టుల ఎస్ఈ రమణమూర్తి కారణం అని భావించిన కరణం ఎస్ఈ బదిలీ కోసం ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం ఉంది. కరణంతో పాటు మరికొందరు అధికార పార్టీ నేతలు కూడా ఎస్ఈ బదిలీ కోసం ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్ఈ బదిలీని అడ్డుకుని కరణం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని భావించిన కరణం వ్యతిరేక వర్గం గొట్టిపాటిని ముందు పెట్టి పావులు కదిపింది. దీంతో ఎస్ఈ బదిలీని నిలిపివేయాలంటూ గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం గుంటూరులో ముఖ్యమంత్రిని కలిసి గట్టిగా విన్నవించారు. గొట్టిపాటి తానొక్కడే వెళ్లకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలిసి ఎస్ఈ బదిలీని నిలిపివేయాలని కోరారు. కరణం నిబంధనలకు విరుద్ధంగా పనులు మంజూరు చేయాలని ఎస్ఈపై ఒత్తిడి తెచ్చారని, ఆయన మాట విననందుకే ఎస్ఈ బదిలీకి కరణం పట్టుపట్టారని గొట్టిపాటితో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఈ బదిలీ వ్యవహారం ఎలా జరిగిందన్న దానిపై ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమను విచారించినట్లు సమాచారం. అనంతరం ఎస్ఈ రమణమూర్తి బదిలీని నిలిపివేయాలంటూ ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు సూచించినట్లు ప్రచారం ఉంది. మరోవైపు జిల్లా ఉన్నతాధికారి సైతం రమణమూర్తి బదిలీని నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రమణమూర్తి బదిలీ ఆగిపోతే టీడీపీ వర్గపోరు పతాకస్థాయికి చేరడం ఖాయం. ఇప్పటికే అద్దంకి సీఐ వ్యవహారంలో ఓటమి చెందిన గొట్టిపాటి ఎస్ఈ బదిలీని నిలుపుదల చేయించి కరణం ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇక నుంచి ఒంటరిగా కాక, తనతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకోవడంతో పాటు టీడీపీలో కరణం వ్యతిరేక వర్గీయుల మద్దతును కూడగట్టి కరణంపై అమీతుమీకి సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కరణం సైతం తనకు మద్దతు పలుకుతున్న పాత నేతలతో కలిసి సీఎం వద్దే తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇరువర్గాల గొడవ తీవ్రరూపం దాల్చుతోంది. చివరకు ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సిందే...! -
హ్యాపీ బర్త్ డే ఇక అందరిదీ...
ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన పాటల్లో ఒకటైన 'హ్యాపీ బర్త్ డే' పాటకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ హాయిగా పాడుకునే అవకాశం ఏర్పడింది. పేటెంట్ హక్కుల బంధనాలు వీడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆమెరికా పబ్లిషర్ 'వార్నర్ ఛాపెల్ మ్యూజిక్' సెటిల్ మెంట్ కు రావడంతో దీర్ఘకాలంపాటు కొనసాగిన చట్టపరమైన వివాదం ముగిసింది. మ్యూజిక్ సంస్థ గతంలో ఈ పాటకు 15 మిలియన్ డాలర్లు చెల్లించి పేటెంట్ హక్కులు పొందింది. హ్యాపీ బర్త్ డే టు యు.. అంటూ పుట్టినరోజు సందర్భాల్లో అందరూ పాడుకునే పాటపై 2013 లో వివాదం మొదలైంది. అమెరికాకు చెందిన వార్నర్ ఛాపెల్ మ్యూజిక్ కంపెనీ ఇప్పటిదాకా ఈ పాటకు రాయల్టీ పొందుతోంది. అయితే ఓ సినీ నిర్మాత ఈ పాటను తన సినిమాలో వాడుకోవడంతో కాపీరైట్ చట్టం కింద తనకు 1,500 డాలర్లు చెల్లించాలంటూ వార్నర్ చాపెల్ డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. దాదాపు వందేళ్ళ క్రితం నుంచే అమెరికాలో ప్రముఖంగా వినిపించడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ పాడుకుంటున్న ఆ పాటకు రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని సినీ నిర్మాత సహా మరికొందర్ని భాగస్వాములుగా చేర్చి క్లాజ్ యాక్షన్ దావా దాఖలు చేశారు. దీంతో అప్పట్నుంచీ వివాదం కొనసాగుతోంది. అయితే తాజాగా ఆమెరికా లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టు ముందు ఆ వివాదానికి తెరపడింది. పాటకు రాయల్టీగా పబ్లిషింగ్ హౌస్ కు 14 మిలియన్ డాలర్లను చెల్లించేందుకు, 2030 వరకూ అమల్లో ఉన్న రాయల్టీ చెల్లింపులు ఇక్కడితో ముగించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే చాపెల్ సంస్థకు చెల్లించాల్సిన మొత్తంలో ఫిల్మ్ మేకర్స్, న్యాయవాదులు 4.62 మిలియన్ డాలర్లు... మిగిలిన మొత్తాన్ని ఈ పాట వాడుకున్న వారందరూ కలసి చెల్లించాలని కోర్టు నిర్ణయించింది. ఇలా ఒప్పందం కుదరడం ఎంతో ఆనందంగా ఉందని, ఇటువంటి సమస్య మరోసారి తలెత్తకుండా ఉండాలని ఫిర్యాదుదారులు కోరుకుంటున్నారు. గతంలో ఫిల్మ్ మేకర్స్ వార్నర్ చాపెల్ కు ఎటువంటి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా సెంట్రల్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ పాట అందరికీ అందుబాటులోకి రావాలని, పబ్లిక్ డొమైన్ గా మారాలన్న ఉద్దేశ్యంతో తిరిగి కేసును కొసాగించారు. చివరికి తాజా తీర్పుతో వివాదం సర్దుమణిగింది. ఈ హ్యాపీ బర్త్ డే పాట 1893 లో వచ్చిన గుడ్ మార్నింగ్ టు ఆల్ అనే పాటనుంచి వాడకంలోకి వచ్చింది. ఆ పాటను అప్పట్లోనే అమెరికా స్కూళ్ళలో పాడినట్లుగా తెలుస్తోంది. తర్వాత గుడ్ మార్నింగ్ టు ఆల్ నుంచి హ్యాపీ బర్త్ డే గా ఇందులోని పదాలు మారాయి. ఇంగ్లీష్ లో అన్ని పాటలకంటే హ్యాపీ బర్త్ డే సాంగ్ ఎంతో ప్రాచుర్యం పొందినట్లు గిన్నిస్ బుక్ లెక్కలు చెప్తున్నాయి.