ఓ మహిళ తన బాయ్‌ఫ్రెండ్ మీద కోపంతో దారుణానికి ఒడిగట్టింది. ఈ క్రమంలో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌కు చెందిన కెల్లీ హేస్ తన మాజీ బాయ్‌ఫ్రెండ్స్ మీద కోపంతో అతడి కారుకు నిప్పంటించింది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆమె తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఏ మాత్రం లేట్ అయిన ఆమె మంటల్లో చిక్కుకుపోయేది.
అయితే, మొదట కారులో ఇంధనం పోసి ఆ తర్వాత లైటర్‌తో మంటలు అంటించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కారు గ్లాస్‌లో నుంచి మంటలు బయటకు వచ్చాయి. సమయ స్ఫూర్తితో ఆమె మంటలను నుంచి తప్పించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటన అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కెల్లీని వారు అరెస్ట్ చేశారు.
This woman nearly k!lls herself setting ex-boyfriend's car on fire pic.twitter.com/dzxilLh0O3
— Snade (@Sw33tSanade) April 27, 2022
Comments
Please login to add a commentAdd a comment