
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్‌లోని రాంనగర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్‌తో 'చవర్ లెట్ ఎంజాయ్' వాహనం దగ్ధమైంది. కొందుర్గు మండలానికి చెందిన నగేష్‌కు చెందిన ఈ వాహనం నంబర్ టీఎస్ ఓ7 యూసీ 8997 షార్ట్ సర్క్యూట్‌కు గురైందని డ్రైవర్ అశోక్ తెలిపాడు. ఉదయం రాంనగర్‌లో తన ఇంటి నుంచి కంపెనీకి బయలుదేరగా కొద్ది దూరం వెళ్ళాక వాహనంలో పొగలు వచ్చాయని, వెంటనే కారు దిగి బానట్ ఓపెన్ చేసి చూసేలోపే మంటలు చెలరేగాయని చెప్పాడు.
మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, కారు మొత్తం మంటల్లో దగ్ధమైందని వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది వెళ్లే మంటలు ఆర్పారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది.
చదవండి: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు
Comments
Please login to add a commentAdd a comment