Chevrolet
-
వింటేజ్ కారు ధర రూ.3,675!
మీరు చదివిన శీర్షిక నిజమే. కానీ అది 2024లో కాదండోయ్.. 1936లో సంగతి. అప్పట్లో చేవ్రొలెట్ కంపెనీ ఇచ్చిన వార్తాపత్రిక ప్రకటనను ఇటీవల కార్‌బ్లాగ్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పంచుకున్నారు. అదికాస్తా వైరల్‌గా మారింది. అందులోని వివరాల ప్రకారం చేవ్రొలెట్ కంపెనీ 1936 సంవత్సరంలో 5 సీటింగ్ కెపాసిటీ ఉన్న వింటేజ్ కారును రూ.3,675కే ఆఫర్ చేస్తున్నట్లు ఉంది. అలెన్ బెర్రీ అండ్ కో.లిమిటెడ్ అనే ఏజెన్సీ కలకత్తా, ఢిల్లీ, లఖ్‌నవూ, దిబ్రూఘర్ ప్రాంతాల్లో దీన్ని ఆ రేటుకు అందిస్తున్నట్లు పేర్కొంది. 1936లో రూ.3,675 విలువ 2024లో రూ.3,67,50,000గా ఉందని అంచనా.మరో ప్రకటనలో ఓపెన్‌టాప్ చేవ్రొలెట్ మోడల్ కార్ ధర రూ.2,700 అన్నట్లు ప్రకటనలో ఉంది. దీన్ని లఖ్‌నవూలోని ఎడుల్జీ అండ్ కో మోటార్ ఇంజినీర్స్ అండ్ కోచ్ బిల్డర్స్ కంపెనీ అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం 5 సీటర్ బడ్జెట్ కార్లు రూ.లక్షల్లో ఉన్నాయి. ఏళ్లు గడుస్తుంటే డబ్బు విలువ పడిపోయి లక్షలకు విలువ లేకుండా పోతుంది. దాంతో అన్ని వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. View this post on Instagram A post shared by Car Blog India (@carblogindia)ఇదీ చదవండి: రూ.1,200 కోట్ల సంపద.. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే..ఈ రెండు ప్రకటనలపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘నేనూ ధనవంతుడినే కానీ, వేరే శతాబ్దంలో ఉన్నాను’ అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ‘ఆ రోజుల్లో అది చాలా ఖరీదు’అని రిప్లై ఇచ్చారు. -
షార్ట్ సర్క్యూట్‌తో 'చవర్లెట్ ఎంజాయ్' కారు దగ్ధం
-
Hyderabad: షార్ట్ సర్క్యూట్‌తో 'చవర్లెట్ ఎంజాయ్' కారు దగ్ధం
సాక్షి, హైదరాబాద్: షాద్ నగర్‌లోని రాంనగర్ కాలనీలో షార్ట్ సర్క్యూట్‌తో 'చవర్ లెట్ ఎంజాయ్' వాహనం దగ్ధమైంది. కొందుర్గు మండలానికి చెందిన నగేష్‌కు చెందిన ఈ వాహనం నంబర్ టీఎస్ ఓ7 యూసీ 8997 షార్ట్ సర్క్యూట్‌కు గురైందని డ్రైవర్ అశోక్ తెలిపాడు. ఉదయం రాంనగర్లో తన ఇంటి నుంచి కంపెనీకి బయలుదేరగా కొద్ది దూరం వెళ్ళాక వాహనంలో పొగలు వచ్చాయని, వెంటనే కారు దిగి బానట్ ఓపెన్ చేసి చూసేలోపే మంటలు చెలరేగాయని చెప్పాడు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని, కారు మొత్తం మంటల్లో దగ్ధమైందని వాపోయాడు. అగ్నిమాపక సిబ్బంది వెళ్లే మంటలు ఆర్పారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. చదవండి: హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు -
గతుకుల రోడ్లను చూసి కళ్లు తేలేసింది..
మీకు కార్లంటే విపరీతమైన అభిమానమా.. ఖరీదైన, హై ఎండ్ ఫీచర్లతో కూడిన కారు కొనాలనుకుంటున్నారా.. అయితే ఓ సారి ఈ వీడియో చూడండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకొండి అంటూ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియో నవ్వులు పూయించడమే కాక.. మన రోడ్ల స్థితిగతులను కళ్లకు కడుతుంది. కొద్ది రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దవుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రోడ్లన్ని గుంతలమయం అయ్యాయి. ఎక్కడ చూసినా నీరు నిలిచిపోయి చిన్న సైజు తటకాలను తలపిస్తున్నాయి. సామాన్యులు వినియోగించే ఆటో, లారీలు, టూవీలర్స్‌కు ఈ రోడ్ల మీద ప్రయాణం కొట్టిన పిండితో సమానం. కాబట్టి ఎలాంటి గుంతలనైనా లెక్క చేయక ముందుకు సాగిపోతుంటాయి. అదే ఈ గతుకుల రోడ్ల మీద ఓ లగ్జరీ కారు ప్రయాణం చేయాల్సి వస్తే.. ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. పాపం గంటకు వందల కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లే.. రూ కోటి ఖరీదైన హై ఎండ్ చెవర్లెట్ కారు.. ఈ గతుకుల రోడ్లను చూసి కళ్లు తేలేసింది. గుంతలు లేని చోటు చూసుకుంటూ తాబేలు కంటే నెమ్మదిగా ముందుకు కదల సాగింది. దాని వెనకే వచ్చే ఆటోలు, కార్లు చల్తా హై అన్నట్లు దూసుకుపోతుంటే.. పాపం ఈ ఖరీదైన కారు మాత్రం ఎండ కన్నెరగని సుకుమారిలా.. నిదానంగా ప్రయాణించింది. Never get richer than the Government. pic.twitter.com/rpqoUKvjGl — Godman Chikna (@Madan_Chikna) September 4, 2019 గాడ్‌మ్యాన్ చింకా అనే ట్విటర్ యూజర్ ‘ఎప్పడు ప్రభుత్వం కంటే ధనవంతుల కాకుడదు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘ఈ రోడ్లను చూశాక ట్రాక్టర్ కొనడం ఉత్తమం అనిపిస్తుంది’.. ‘దీని బదులు ఆటో కొని ఉంటే.. ఈ పాటికి ఓ రౌండ్ వేసి వచ్చేవాడవి కదా’.. ‘అందుకే మన దేశంలో తయారయ్యే కార్లనే కొనాలి. వాటికి ఇక్కడ రోడ్ల గురించి బాగా తెలుసు’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. -
భారీగా పడిపోతున్న ఈ కార్ల రీసేల్
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్ (జిఎం) భారతీయ కార్ల మార్కెట్ నుంచి నిష్క్రమించాలన్న ప్రకటన కార్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా రీసేల్ మార్కెట్ లో షెవ్రోలె కార్ల ధరలు భారీగా పడిపోయాయి. గురువారం నాటి ప్రకటన తరువాత నుంచి క్రమంగా ఈ విక్రయాలు పడిపోతున్నాయని, ఈ ధోరణి ఇకముందుకూడా కొనసాగనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గురువారం భారతదేశ దేశీయ విక్రయ మార్కెట్ నుండి నిష్క్రమించాలని ప్రధాన ప్రకటన చేసింది జినరల్ మోటార్. దేశీయ విఫణిలో నిరంతర నష్టాలు, చిన్న మార్కెట్ వాటా (2017 ఏప్రిల్ నాటికి 0.32 శాతం) తర్వాత కంపెనీ నిర్ణయానికి వచ్చింది. అయితే ఈ నిర్ణయం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావాన్ని చూపదని అంచనా వేసినప్పటికీ, జీఎం బ్రాండ్ షెవ్రోలె కార్ల పునఃవిక్రయాలపై మరింత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీఎం ప్రకటించిన తరువాత రీసేల్ మార్కెట్లో 5శాతం పడిపోయాయి. రాబోయే రోజుల్లో 20 శాతం తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే దేశీయ విక్రయాలను నిలిపి వేసినప్పటికీ ఉత్పత్తిని కొనసాగిస్తామనీ కార్ల విడిభాగాలు. ఇతర సర్వీసులను అందిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. వారెంటీలకు సంబంధించి అన్ని ఒప్పందాలను, అమ్మకాల సేవలను గౌరవిస్తామని జిఎం వినియోగదారులకు గురువారం ప్రకటించింది. అయినా వినియోగదారుల్లో ఆందోళన నేపథ్యంలో అమ్మకాలు వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం. మరోవైపు ఈ సంవత్సరాంతానికి సంస్థ ఆథరైజ్డ్ సర్వీసులు విలువైన సేవల్ని అందించలేకపోవచ్చని ట్రూ బిల్ కో ఫౌండర్ సుభ్ బన్సాల్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు జీఎం బ్రాండ్లకు సంబంధించి ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ లభించడం కూడా కష్టం కావచ్చని అంచనా వేశారు. ఒక సంస్థ అమ్మకాలను నిలిపివేసినపుడు సాధారణంగా సంవత్సరం కాలంలో క్రమంగా 10-15 శాతం ధరలు పతనం నమోదవుతుందని అయితే జీఎం కార్ల విషయంలో ఇప్పటికే 5 శాతం పతనం నమోదైందని తెలిపారు. కాగా డిసెంబర్31, 2017 నుంచి విక్రయాలు ముగియనున్నాయని జీఎం ఇండియా ఎండీ కహర్ కజిమ్ ప్రకటించారు. అయితే, అమ్మకాల సేవలను సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తామని చెప్పారు. అన్ని స్థానిక వాటాదారుల మద్దతు కొనసాగిస్తామనిచ భారతదేశంలో విక్రయించిన జీఎం కార్ల భాగాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కజీమ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జీఎం బీట్, స్పార్క్, సెయిల్(సెడాన్) క్రూయిజ్, ఎంజాయ్, తవేరా, ట్రయిల్ బ్లేజర్లతో సహా ఏడు మోడళ్లను విక్రయిస్తుంది.మోడళ్లను విక్రయిస్తోంది -
లక్షన్నర షెవ్రోలె కార్లు వెనక్కి
ముంబై: ఒకటికాదు రెండు కాదు ఏకంగా 1.5 లక్షల షెవ్రోలె కార్లను వెనక్కి తీసుకుంటున్నట్లు జనరల్ మోటార్స్ సంస్థ సోమవారం ప్రకటించింది. 2007 నుంచి 2014 సంవత్సరాల మధ్య అమ్ముడయిన షెవ్రోలె స్పార్క్, షెవ్రోలె బీట్, షెవ్రోలె ఎంజాయ్ మోడళ్ల బ్యాటరీల్లో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ మేరకు కార్ల యజమానులకు ప్రత్యేకంగా లేఖలు రాసింది. ప్రస్తుతం ఆయా మోడళ్ల కార్లలో ఉన్న వైరింగ్తో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నట్లు గుర్తించామని, తగిన మార్పులను ఉచితంగా నిర్వహిస్తామని జనరల్ మోటార్స్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. వాహనదారులు సమీపంలోని షెవ్రోలె షో రూమ్ లకు వెళితే రెండు గంటల వ్యవధిలో మరమ్మతు చేసి పంపుతామన్నారు.