
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. భాస్కర్ అనే యువకుడు కొంతకాలంగా మైథిలి అనే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అయితే వరుసకు అన్న కావడంతో భాస్కర్ ప్రేమను యువతి నిరాకరించింది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో స్కూటీపై వెళుతున్న మైథిలిని కారుతో ఢీకొట్టాడు భాస్కర్.
కంబదూరు మండలం బోయలపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో యువతి మైథిలికి తీవ్ర గాయాలవ్వగా అసుపత్రికి తరలించారు. నిందితుడు భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ఓ వైపు భర్త చావు బతుకుల మధ్య.. మరోవైపు రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
Comments
Please login to add a commentAdd a comment