
సాక్షి, కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వరనాయుడు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే రీతిలో విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమామహేశ్వరనాయుడుకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రత్యర్ధులు చించి, నిప్పు పెట్టారు. ఈ ఘటన అనంతపురం టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఉమామహేశ్వరనాయుడు అనుచరులు మాజీ ఎమ్మెల్యే ఉన్నం వర్గీయులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతంలో ఇరు వర్గీయులు పార్టీ సమావేశాల్లో ఘర్షణలకు దిగిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment