
సాక్షి, కళ్యాణదుర్గం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా నెగ్గుకురావాలో తెలియక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు తలలు పట్టుకుంటుంటే.. మరో వైపు టిక్కెట్ల వివాదాలతో పార్టీలో అసంతృప్తి రగులుతోంది. తనకు అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం టీడీపీ కార్యాలయం ఎదుట కార్యకర్త ఆర్కే రాజు ధర్నాకు దిగారు. టీడీపీలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమా మహేశ్వర్ నాయుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నిరసన తెలిపారు. ఆందోళన చేస్తోన్న కార్యకర్త రాజును టీడీపీ నేతలు బలవంతంగా టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. ఆర్కే రాజు కళ్యాణదుర్గం మండలం నారాయణపురం ఎంపీటీసీ టిక్కెట్ ఆశించి భగ్గపడ్డారు.