ఉద్రిక్తతల చోటుకి వెళ్లనున్న ట్రంప్‌! | Donald Trump Will Visit Kenosha In Wisconsin Amid Unrest | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తతల చోటుకి వెళ్లనున్న ట్రంప్‌!

Aug 30 2020 7:21 PM | Updated on Aug 30 2020 7:50 PM

Donald Trump Will Visit Kenosha In Wisconsin Amid Unrest - Sakshi

ఘటన జరిగిన కేనోషా పట్టణంలో రోడ్లపై రాళ్లు రువ్వుతూ ఆందోళన కారులు వాహనాలకు నిప్పు పెట్టారు.

వాషింగ్టన్‌: విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని కేనోషా పట్టణం నిరసనలతో అట్టుడుకుతోంది. నల్లజాతీయుడు జేకబ్‌ బ్లేక్‌పై పోలీసులు తుపాకీతో కాల్పులు జరపడంతో అతను ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసుల చర్యకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పోలీసుల తీరుపై దేశ వ్యాప్తంగా నల్లజాతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనలతో హోరెత్తించారు.
(చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఇద్దరు..)

ఘటన జరిగిన కేనోషా పట్టణంలో రోడ్లపై రాళ్లు రువ్వుతూ ఆందోళన కారులు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కర్ఫ్యూ విధించారు. ఇక అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. మరోవైపు నిరసనలతో హోరెత్తుతున్న కేనోషాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం పర్యటించనున్నారని స్వేత సౌధం ప్రకటించింది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులను కలుసుకుని పరిస్థితులను సమీక్షిస్తారని తెలిపింది.
(చదవండి: రెండు కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌ వెనుకంజ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement