![Joe Biden Pardons Son Hunter Biden From Convictions](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/2/biden.jpg.webp?itok=e6ylQTjT)
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుందనగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా తుపాకీ కొనుగోలు,ట్యాక్స్ అక్రమాల కేసుల్లో తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ప్రసాదించారు.
హంటర్‌కు క్షమాభిక్ష ఇవ్వబోనని అతడు దోషిగా తేలిన సందర్భంలో స్పష్టంగా పేర్కొన్న బైడెన్ ఇప్పుడు మాట మార్చడం గమనార్హం. అక్రమంగా తుపాకీ కొనుగోలు,ఆదాయపు పన్ను విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని డెలావెర్,కాలిఫోర్నియాలో హంటర్‌పై నమోదైన కేసుల్లో అతడికి ఇప్పటికే కోర్టులు శిక్ష విధించాయి.
ఒక తండ్రిగా,అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని బైడెన్ తన నిర్ణయంపై వివరణ ఇచ్చారు. కాగా,ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment