న్యూయార్క్: ఎన్నికల ర్యాలీలో తన మీద జరిగిన కాల్పులపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ‘ఊహించనిది జరగకుండా ఆ దేవుడు మాత్రమే కాపాడాడు. అమెరికన్లందరూ ఒక్కటి కావాలి. ధృడనిశ్చయంతో నిలబడాలి. చెడు విజయం సాధించకుండా అడ్డుపడాలి’అని పిలునిచ్చారు.
ఈ మేరకు ఆదివారం(జులై 14) ఉదయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌సోషల్‌లో ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. కాగా, శనివారం సాయంత్రం పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా ట్రంప్‌పై దుండగుడు కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో ట్రంప్ చెవికి బుల్లెట్ గాయమై రక్తం చిందింది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది కాల్పలు జరిపిన దుండగుడిని మట్టుబెట్టి ట్రంప్‌ను అక్కడి నుంచి తరలించారు. ఘటన తర్వాత ట్రంప్ తన ప్రైవేట్ విమానం ట్రంప్ ఫోర్స్‌లో నుంచి దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్,రిపబ్లికన్ల తరపున ట్రంప్ హోరాహోరీ తలపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment