
యూపీలో ప్రముఖుల విగ్రహాలకు భద్రత కట్టుదిట్టం
సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం ఘటనలు పెరుగుతుండటంతో యూపీ ప్రభుత్వం ప్రముఖుల విగ్రహాలకు భద్రత కల్పించడంపై దృష్టి సారించింది. ప్రముఖుల విగ్రహాల భద్రతను రాష్ట్ర పోలీసులు పర్యవేక్షిస్తారని హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. విగ్రహాల కూల్చివేతపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలు ఆదేశాలు జారీ చేసినా ప్రముఖ నేతలు, సిద్ధాంతకర్తల విగ్రహాలపై దాడులు కొనసాగుతున్నాయి.
గత కొద్ది నెలలుగా పలు రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో విగ్రహాల భద్రతపై నిరంతరం పర్యవేక్షించాలని యూపీ డీజీపీ ఓం ప్రకాష్ సింగ్ అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశారు. మహాత్మా గాంధీ, బీఆర్, అంబేడ్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పెరియార్, లెనిన్ సహా పలువురి ప్రముఖుల విగ్రహాల కూల్చివేతల నేఫథ్యంలో యూపీ సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment