న్యూఢిల్లీ: తెలంగాణలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కేంద్రం భద్రతను పెంచింది. హుజురాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌లకు ఇకపై కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఈటల రాజేందర్‌కు కేంద్రం వై ప్లస్, అర్వింద్‌కు వై కేటగిరి సెక్యూరిటీ కేటాయించింది.
ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కూడా భద్రత కల్పించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్‌కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసానికి సీఆర్‌పీఎఫ్ అధికారులు చేరుకున్నారు. కేంద్రం భద్రత పెంపుపై అర్వింద్ స్పందిస్తూ.. వై కేటగిరీ సెక్యురిటీ కేటాయింపుపై సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. తనకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. తనపైపై పదే పదే దాడులు జరిగిన తర్వాత రిటైర్డ్ ఎన్‌ఎస్జీతో ప్రైవేట్ సెక్యురిటీ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. భద్రత లోపలపై అధికారులు తన వద్ద వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
కాగా ఇప్పటికే ఈటల రాజేందర్‌కు తెలంగాణ సర్కార్ వై ప్లస్ భద్రత కల్పించిన విషయం తెలిసిందే ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన హత్యకు ప్లాన్ జరుగుతోందంటూ వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది.
చదవండి: ఆ ఫలితం నమ్మితే మోదీ భ్రమపడ్డట్టే! కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసే ‘బండి’ తొలగింపు ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment