సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వై ప్లస్ భద్రత కల్పించింది. ఈటల ప్రాణాలకు ముప్పు ఉందని వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎమ్మెల్యేకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ సహా 16 మంది సెక్యూరిటీని కేటాయించింది. ఈ మేరకు ఈటలకు భద్రత పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈటలకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించనుంది.
కాగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు ప్లాన్ జరిగిందంటూ ఈటల జమున తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల భద్రతపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ చేసి ఎమ్మెల్యే భద్రతపై సీనియర్ ఐపీఎస్‌తో వెరిఫై చేయాలని సూచించారు.
ఈ క్రమంలో ఈటల రాజేందర్ నివాసానికి గురువారం డీసీసీ సందీప్ రావు చేరుకొని ఆయన భద్రత అంశంపై చర్చించారు. అనంతరం ఎమ్మెలయే భద్రతపై డీసీపీ సందీప్ రావు.. డీజీపీ అంజనీకుమార్‌కు నివేదిక ఇచ్చారు. అయితే ఈటలకు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో తాజాగా ప్రభుత్వమే వై ప్లస్ భద్రత కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
చదవండి: కేటీఆర్‌కు నిరసన సెగ.. ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన మంత్రి
Comments
Please login to add a commentAdd a comment